Illu Illalu Pillalu Today Episode may 20th: నిన్నటి ఎపిసోడ్ లో.. వేదవతి ఎందుకో తెలియదు అని ఎదురుగా కూర్చొని దిగిలుపడుతుంది. ఏమైందో అత్తయ్య అంత దిగులు పడుతున్నారు అంటే ఏం లేదు ఏదో కోల్పోయిన నన్ను ఫీలింగ్ కలుగుతుంది అని ప్రేమతో అంటుంది. మీరు ఇంత దిగులుగా ఉండడానికి కారణం నర్మదా అక్కే.. అక్క మీకు దూరంగా వెళ్లిపోయింది కదా అందుకే మీరు ఇలా ఫీల్ అవుతున్నారు అని ప్రేమ అంటుంది.. అందుకేనా సుమీ నాకు ఏందో ఇందాక నుంచి ఎవర్నో కోల్పోయిన అంత ఫీలింగ్ వస్తుంది అని అంటుంది. మీకు అక్క మీద ఉన్న ప్రేమ అక్క మీ మీద చూపిస్తున్న అభిమానం అంతే కదా అని అంటుంది. వేదవతి నర్మదతో ఫోన్ మాట్లాడుతుంది.. వీళ్ళిద్దరిని చూసి కుళ్లుకున్న శ్రీవల్లి రామరాజు దగ్గర నర్మదను అడ్డంగా బుక్ చేస్తుంది. ప్రేమ ట్యూషన్ చెప్పడానికి తిరుపతి పిల్లల్ని తీసుకుని వస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రేమ పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉంటుంది. పిల్లలు అర్ధమైందా లేదా అని అడుగుతూ మరి ట్యూషన్ చెప్పడంతో చాలా సరదాగా ఉంటారు. అయితే ఎవరికైనా డౌట్ ఉందా అని ప్రేమ అడుగుతుంది. అందులో ఒక పాప నాకు ఇంగ్లీష్ పోయం చెప్పండి టీచర్ అని అడుగుతుంది. అప్పుడే ఫోన్ పట్టుకుని అక్కడికి వచ్చిన శ్రీవల్లిని చూసి ప్రేమ దగ్గరికి రమ్మని పిలుస్తుంది. ఏమైంది ప్రేమ నాకు అవతలి చాలా పనుంది అని అనగానే ఈ అమ్మాయికి ఇంగ్లీష్ పోయం అర్థం కాలేదంట అక్క నువ్వు నాలుగు లైన్లే కదా కాస్త వివరంగా చెప్పవా అని అంటుంది. అయ్యబాబోయ్ అడ్డంగా ఇరుక్కునిపోయాను ఏంటి అని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది.
నాకు అర్జెంటు పని ఉంది ప్రేమ నేను వెళ్తున్నాను తర్వాత వచ్చి చెప్తానని అంటుంది.. కానీ ప్రేమ మాత్రం నాలుగు లైన్లే కదా అక్క తొందరగా చెప్పవా నేను మిగతా వాళ్ళని చూసుకుంటాను అని అంటుంది. కానీ శ్రీవల్లి మాత్రం తనకి ఇంగ్లీష్ రాదు అన్న విషయం బయట పడుతుందని టెన్షన్ పడుతుంది. అమ్మ ఫోన్ చేస్తుంది ఏదో అర్జెంట్ అనుకుంటా అని అక్కడ నుంచి మెల్లగా జారుకుంటుంది. నన్ను ఇరికించాలని చూస్తావా నీ సంగతి చూస్తానని శ్రీవల్లి ప్రేమని అంటుంది.
లోపలికి శ్రీవల్లి భాగ్యం కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్తుంది. ఏమైందే బాబు ఎందుకు అట్లా నామీద అరుస్తున్నావని భాగ్యం అడుగుతుంది. స్వయంవరంలో నాకు ఇంగ్లీషు వచ్చని నేను ఇంగ్లీషులో పెద్ద చదువులు చదివానని గొప్పలు చెప్పావు ఇప్పుడు అదే నా మెడకు చుట్టుకుంది నాకు కాపురంలో చిచ్చు పెట్టబోతుంది అని చెప్తుంది.. ప్రేమ ట్యూషన్ చెప్పడానికని పిల్లల్ని తీసుకునింది. వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పమని నన్ను అడిగింది. నేను ఎలాగోలా తప్పించుకుని వచ్చేసాను అని అంటుంది.
ఇప్పటికైతే తప్పించుకున్నాను కానీ ఇంకొకసారి ఇలాగే రిపీట్ అయితే నేనేం చేయమంటావు. నా గురించి మొత్తం తెలిసిపోతుంది. మన బాగోతం కూడా బయట పడుతుందని టెన్షన్ పడుతుంది. నువ్వేం టెన్షన్ పడకు ఈ విషయాన్ని మీ మామ దగ్గర చెప్పు మన ఇంటి పరువు పోతుంది కదా అది ఇది అని చెప్పేస్తే కచ్చితంగా మీ మామయ్య వద్దని చెప్తాడని భాగ్యం సలహా ఇస్తుంది. అటు సాగర్ కు రామరాజు ఫోన్ చేసి హైదరాబాదులో బియ్యం బస్తాలకు సంబంధించిన లెక్కలు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలేదు నువ్వు వెళ్లి తీసుకురా అనేసి అంటాడు.
నర్మదా మొదట కోప్పడిన కూడా తర్వాత సాగర్ పరిస్థితిని అర్థం చేసుకొని వెళ్తే వెళ్ళు కానీ 6 గంటలకు అలా రూమ్ లో ఉండాలి అని చెప్తుంది. ఇక తర్వాత రోజు ఉదయం బాక్స్ పట్టుకొని వెళ్లి మిల్లులో ఇవ్వాలని అనుకుంటుంది. వేదవతి ఎంత వాదించినా కూడా వినదు.. మావయ్య గారు ఎండకేం వస్తారు అని బాక్స్ కట్టుకొని తీసుకెళ్తుంది. మిల్లుకు వెళ్ళగానే శ్రీవల్లి పేరు తెలుసుకున్న వాళ్ళందరూ ఆమెను మర్యాదగా చూసుకుంటారు. అది చూసి శ్రీవల్లి పొంగిపోతుంది. రామరాజు దగ్గరికి వెళ్ళగానే నువ్వేంటమ్మ క్యారేజ్ తీసుకొని వచ్చావు నేనే వచ్చేవాడిని కదా అంటే పెళ్లి పనుల వల్ల చాలా ఆర్డర్లు పెండింగ్ ఉన్నాయని చెప్పారు కదా మామయ్య అవన్నీ మీరు చూసుకోవాలి కదా ఇంటికి వస్తే టైం వేస్ట్ ఎందుకని నేనే తీసుకొచ్చాను అని అంటుంది. మిల్లు కి బియ్యం బస్తాలు కావాలని వచ్చిన వ్యక్తితో 25 బస్తాల నుంచి 50 బస్తాలు కొనేలా చేస్తుంది శ్రీవల్లి. అది చూసిన రామరాజు సంతోష్ పడతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో నర్మదా సాగర్ మధ్య గొడవలు జరిగేలా కనిపిస్తున్నాయి.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..