HBD Jr NTR:జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR).. స్వర్గీయ నటులు , రాజకీయవేత్త అయిన నందమూరి హరికృష్ణ (Nandamuri Harikrishna) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఎన్టీఆర్.. తాతకు తగ్గ మనవడిగా పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా నందమూరి కుటుంబం నుంచి ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా.. ఎన్టీఆర్ రేంజ్ లో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోలేదని చెప్పవచ్చు.
అతి తక్కువ సమయంలో గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకొని, అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఒక ఉనికి చాటుకున్నారు. ఇకపోతే ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి తెలియని విషయాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1. జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో మంచి డాన్సర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ డాన్స్ నేర్చుకోవడం వెనుక మొదటి గురువు తన తల్లి.. మనకంటూ ఒక గుర్తింపు రావాలి అంటే ఏదో ఒకటి నేర్చుకోవాలని చెప్పిందని, ఆ మాటలతో తాను నాలుగేళ్ల పాటు కూచిపూడి నేర్చుకున్నారు. ఆ సాధన తాను సినిమాల్లో చక్కగా స్టెప్స్ లను వేయడానికి ఉపయోగపడిందని పలుమార్లు చెప్పారు.
2. ఆటల విషయానికి వస్తే ఎన్టీఆర్ కి క్రికెట్ అంటే చాలా ఇష్టం .సమయం దొరికితే బ్యాట్ పట్టి బంతికే పరుగులు కూడా నేర్పిస్తారు.
3. అమ్మ వండి పెట్టే రొయ్యల బిర్యానీ అంటే చాలా ఇష్టం. అమ్మ చేసింది తినడమే కాదు గరిట పట్టి చక్కగా వంట కూడా చేయగలరు. తీరిక వేళలో తన భార్య ప్రణతికి వండి పెడతారు.
4. ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. తన తాతయ్య నందమూరి తారకరామారావు దర్శకత్వంలో వచ్చిన హిందీ సినిమా ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో బాల భరత గా నటించారు. అయితే ఈ సినిమా విడుదల కాలేదు.
5. ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత ‘నిన్ను చూడాలని’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన ఈయన.. ఈ చిత్రానికి వచ్చిన మొదటి పారితోషకం మూడున్నర లక్షల రూపాయలను తన తల్లికి ఇచ్చారు.
6. విదేశాలకు వెళ్ళినప్పుడు ఎక్కువ షాపింగ్ చేస్తారు. ముఖ్యంగా తనకు నచ్చింది కొనుక్కోవడమే కాకుండా తన కొడుకు అభయ్ రామ్ కోసం ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఈ మధ్య తన కోసం కంటే తన కొడుకు కోసమే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
7. ఎన్టీఆర్ కి ఉన్న ఏకైక అలవాటు తన సినిమా దర్శకులతో ఫ్రెండ్లీగా ఉండడమే కాదు.. పెద్ద పెద్ద కానుకలు ఇచ్చి వారిని సర్ప్రైజ్ కూడా చేస్తూ ఉంటారు.
8. ఎన్టీఆర్ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ ను సద్గురు అని పిలుస్తూ ఉంటారు ఎన్టీఆర్.
9. ఎన్టీఆర్ కి మర్చిపోలేని రోజు 2009 మార్చి 26. ఎందుకంటే ఆ రోజు ఎన్టీఆర్ కారు ప్రమాదానికి గురవడమే కాకుండా క్షేమంగా ఆయన బయటపడ్డారు. అంతేకాదు ఆయన భార్య లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు కూడా ఆ రోజే.
10. ఎన్టీఆర్కు ఇష్టమైన సినిమా నాన్నకు ప్రేమతో.. ఇష్టమైన పాట కీరవాణి స్వరపరిచిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, ఇష్టమైన కలర్ తెలుపు ..లక్కీ నంబర్ 9.. ఇక తాతయ్య నటించిన చిత్రాలలో దానవీరశూరకర్ణ.