టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు సొంతం చేసుకుంది మంచు ఫ్యామిలీ (Manchu Family). ఇకపోతే క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన ఈ కుటుంబంలో గత కొద్ది రోజులుగా ఆస్తి విభేదాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. వందల కోట్ల ఆస్తి ఉన్న ఈ కుటుంబంలో అనూహ్యంగా ఆస్తి తగాదాలు రావడంతో.. ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఇది చూసిన నెటిజన్స్ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా మనోజ్ (Manchu Manoj), విష్ణు (Vishnu)మధ్య గొడవలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ గొడవలు చిలికి చిలికి రోడ్డు మీదకు రావడంతో ఉన్న పరువు కాస్త పోయిందని చెప్పవచ్చు.
కుటుంబంలో గొడవలు..
ముఖ్యంగా ఆస్తుల పంపకాల విషయంలో మోహన్ బాబు(Mohan Babu) మంచు మనోజ్ కి అన్యాయం చేశారనే వాదన ప్రధమంగా వినిపిస్తోంది. దీనికి తోడు మంచు విష్ణుకి అప్పగించిన మోహన్ బాబు యూనివర్సిటీలలో అవకతవకలు జరుగుతున్నాయని, దానిని వేలెత్తి చూపించే ప్రయత్నం మనోజ్ చేయగా.. తనపై తన కుటుంబం బయటి వ్యక్తులతో దాడి చేయించిందని మనోజ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. మరోవైపు కొడుకు, కోడలు నుంచి తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇదంతా పక్కన పెడితే తనకు రక్షణ కావాలి అని తాను తీసుకొచ్చిన బౌన్సర్లను తన తండ్రి మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లడానికి అనుమతించకుండా.. విష్ణు బౌన్సర్లను మాత్రమే ఇంటి లోపలికి అనుమతించారని పోలీసులపై మండిపడ్డారు. పోలీసులు ఏకపక్షంగా ప్రవర్తిస్తున్నారని మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలిసి డీజీపీ , డీజిలను కలిసి ఇంటికి వస్తున్న సమయంలో మోహన్ బాబు ఇంటి సెక్యూరిటీ వీరిని లోపలికి అనుమతించలేదు. దీంతో గేట్లు బద్దలు కొట్టుకొని మంచు మనోజ్ లోపలికి వెళ్ళిపోయారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మోహన్ బాబును మీడియా మిత్రులు ప్రశ్నించగా.. ఆయన వారిపై దాడి చేశారు. గాయపడ్డ జర్నలిస్టులు మోహన్ బాబు పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇక ఆయన గన్ కూడా సీజ్ చేశారు.
మోహన్ బాబులు భారీ మార్పు..
దీంతో హైబీపీతో హాస్పిటల్ పాలైన మోహన్ బాబు ఇప్పుడిప్పుడే తేరుకున్నారు. అటు ఆలోచనలలో కూడా మార్పు తీసుకొచ్చారనే చెప్పాలి. అందులో భాగంగానే తాను గాయపరిచిన జర్నలిస్టును కలిసి, తాను కావాలని చేయలేదని, పొరపాటున అలా జరిగిందని, ఆ కుటుంబానికి అండగా ఉంటానని,హాస్పిటల్ కి వెళ్లి మరీ జర్నలిస్టుకు క్షమాపణలు తెలియజేశారు మోహన్ బాబు. అంతేకాదు తిరుపతి చంద్రగిరి పోలీస్ స్టేషన్లో తన లైసెన్స్డ్ గన్ ను కూడా సబ్మిట్ చేశారు. ఇక రెండు రోజుల క్రితం తన పీఆర్ఓ ద్వారా తన దగ్గర ఉన్న డబుల్ బ్యారెల్ గన్ ను కూడా పోలీస్ స్టేషన్లో అప్పగించారు. తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మోహన్ బాబులో భారీగా మార్పు వచ్చింది. మరి కొడుకులిద్దరిలో మార్పు వస్తుందా? అసలు ఏం జరుగుతోంది ? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఏది ఏమైనా కొడుకులిద్దరూ కూడా మారి ఎవరి కెరియర్ లో వారు బిజీగా మారితే చూడాలని ఒక తండ్రిగా మోహన్ బాబు ఆకాంక్షిస్తున్నట్లు సమాచారం.