BigTV English

Best Korean Web series on Disney +hotstar : డిస్నీ+ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న బెస్ట్ కొరియన్ వెబ్ సిరీస్ లు ఇవే

Best Korean Web series on Disney +hotstar : డిస్నీ+ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న బెస్ట్ కొరియన్ వెబ్ సిరీస్ లు ఇవే

Best Korean Web series on Disney + hotstar : కొరియన్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ సినిమాలను ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులు కూడా ఎక్కువగా ఆదరిస్తున్నారు. కొరియన్ కంటెంట్ మన ప్రేక్షకులకు కొత్తగా అనిపించడంతో, ఈ సినిమాలను మంచిగా ఆదరిస్తున్నారు. కొరియర్ వెబ్ సిరీస్ లు కూడా ఓటిటి ప్లాట్ ఫామ్ లో హల్చల్ చేస్తున్నాయి. కరోనా తర్వాత ఈ సిరీస్ లు వ్యూస్ ఎక్కువగా అందుకున్నాయి. ఓటిటి ప్లాట్ ఫామ్ డిస్నీ+ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న బెస్ట్ వెబ్ సిరీస్ ల గురించి తెలుసుకుందాం.


స్కెచ్ (Sketch)

స్కెచ్ అనేది దక్షిణ కొరియరన్ వెబ్ సిరీస్. ఇందులో రెయిన్, లీ సన్-బిన్, లీ డాంగ్-గన్, జంగ్ జిన్-యంగ్, కాంగ్ షిన్-ఇల్, లిమ్ హ్వా-యంగ్  సీయుంగ్-జూ నటించారు. ఈ సిరీస్ మే 25, 2018 నుండి జూలై 14, 2018 వరకు JTBCలో ప్రసారం చేయబడింది. తన భార్య హత్యకు పాల్పడిన వ్యక్తిని పట్టుకోవడానికి చేసే హీరో ప్రయత్నంతో ఈ స్టోరీ నడుస్తుంది. ఈ వెబ్ సిరీస్ డిస్నీ+ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్, కొరియన్ వెబ్ సిరీస్ లలో బెస్ట్ సిరీస్ గా చెప్పుకోవచ్చు.


బిగ్ మౌత్ (Big mouth)

బిగ్ మౌత్ వెబ్ సిరీస్ 2022 లో రిలీజ్ అయిన బెస్ట్ సిరీస్. ఇందులో లీ జోంగ్-సుక్, ఇమ్ యూన్-ఆహ్, కిమ్ జూ-హున్ నటించారు. ఇది MBC TVలో జూలై 29 నుండి సెప్టెంబర్ 17, 2022 వరకు ప్రసారం అయింది. ప్రస్తుతం ఈ సిరీస్ డిస్నీ+ హాట్ స్టార్లో ప్రసారం అవుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ లో హత్య కేసులో చిక్కుకున్న వ్యక్తి , కేసును వాదించిన న్యాయవాది చుట్టూ స్టోరీ నడుస్తుంది.

బ్లడీ హార్ట్ (Bloody Heart) 

బ్లడీ హార్ట్ అనే వెబ్ సిరీస్ 2022 దక్షిణ కొరియాలో రిలీజ్ అయిన బెస్ట్ సిరీస్, ఇందులో లీ జూన్, కాంగ్ హన్-నా, జాంగ్ హ్యూక్, పార్క్ జి-యోన్, హియో సంగ్-టే, చోయిరి నటించారు. ఇది KBS2లో మే 2 నుండి జూన్ 21, 2022 వరకు ప్రసారం చేయబడింది. పురాతన రాజవంశం నేపథ్యంలో మూవీ స్టోరీ నడుస్తుంది. రాజవశంలోని రాణికి, ప్రత్యర్థి రాజుకు మధ్య జరిగే సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. చివరి వరకు సస్పెన్స్ తో సాగే ఈ వెబ్ సిరీస్ కొరియన్ సిరీస్ లో బెస్ట్ సిరీస్ గా చెప్పుకోవచ్చు. ఈ సిరీస్ డిస్నీ+హాట్ స్టార్ లో  స్ట్రీమింగ్ అవుతోంది.

కాల్ ఇట్ లవ్ (Call it Love)

కాల్ ఇట్ లవ్ అనే వెబ్ సిరీస్ 2023 దక్షిణ కొరియా బెస్ట్ సిరీస్ గా చెప్పుకోవచ్చు. ఇందులో లీ సుంగ్-క్యుంగ్, కిమ్ యంగ్-క్వాంగ్ నటించారు. ఇది ఒక రొమాంటిక్ మెలోడి డ్రామా తో తెరకెక్కింది.  ప్రేమలో పడి జీవితం అధోగతి పాలు చేసుకనే అమ్మాయి చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ప్రేమ పేరుతో జరిగే విధ్వంసం ఎలా ఉంటుందో ఈ సీరియస్ లో చూపించారు. ఈ సిరీస్ డిస్నీ+హాట్ స్టార్ లో  స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

Friday Ott Release Movies: ఓటీటీల్లో సినిమాల జాతర.. ఇవాళ ఒక్కరోజే 15 సినిమాలు..

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

Big Stories

×