Game Changer : కల్కి, దేవర, పుష్ప 2 తర్వాత అంతటి సినిమా ఏదైనా ఉందా అని అంటే… అందరి నుంచి వచ్చే ఆన్సర్ గేమ్ ఛేంజర్. గ్లోబల్ స్టార్ ఇమేజ్‌ను మాత్రమే కాదు… మెగా కుటుంబం ఇమేజ్ మొత్తాన్ని లేపే మూవీ అని అందరూ అనుకుంటున్నారు. కానీ అలాంటి బజ్ మాత్రం సినిమాపై లేదు. 1000 కోట్లు కలెక్ట్ చేసే మూవీ అంటున్నారే కానీ, అలాంటి హైప్ అయితే సినిమాపై లేదు అనేది ఒప్పుకోవాల్సిన నిజం. టీజర్‌తో గేమ్ ఛేంజ్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా… సినిమాపై బజ్ ఎందుకు క్రియేట్ అవ్వడం లేదు.? గేమ్ ఛేంజింగ్ మూమెంట్ ఎందుకు రావడం లేదు అనేది ఇప్పుడు చూద్దాం…
ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ అయింది. అది జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌కు ఎంత హెల్ప్ అయిందో తెలీదు కానీ, రామ్ చరణ్ కు మాత్రం గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ తెచ్చి పెట్టింది. అలాంటి సినిమా తర్వాత రామ్ చరణ్ నుంచి సినిమా వస్తుంది అంటే… మినిమం ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అందులోనూ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో అంటే… సినిమాకు వచ్చిన హైప్ అంతా ఇంత కాదు. కానీ, ఇది రోజులు గడుస్తున్న కొద్ది తగ్గుతూ వచ్చింది. దీనికి కారణాలు లేకపోలేదు.
ఫస్ట్ మైనస్ శంకరే…
సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. 200 కోట్ల బడ్జెట్ అంటనే ఫ్యాన్స్ అందరూ వావ్… అన్నారు. అలాంటిది బడ్జెట్ 400 కోట్ల వరకు వెళ్లింది. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ ను కుమ్మేసే సినిమా వచ్చేస్తుంది అంటూ అంచనాలు పెట్టుకున్నారు ఆడియన్స్. సరిగ్గా అలాంటి టైంలోనే శంకర్ దర్శకత్వం వహించిన ఇండియన్ 2 అనే సినిమా రిలీజ్ అయింది. ఈ ఇండయన్ 2 సినిమా కూడా భారీ అంచనాలతోనే వచ్చింది. కానీ, బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిపోయింది. ఇది గేమ్ ఛేంజర్ పై చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించింది. శంకర్ పని అయిపోయిదని, ఇక సినిమాలు చేయడం మానేయ్యాలని అంటూ ట్రోల్స్ చేశారు. ఇక రాబోయే గేమ్ ఛేంజర్ కూడా ఇండియన్ 2 లానే ఉంటుంది అంటూ అనుకుని సినిమాపై ఆశలు వదలుకున్నారు.
ఇంపాక్ట్ క్రియేట్ చేయలేని పాటలు…
శంకర్ విషయం పక్కన పెట్టి… సినిమా గురించి ఆలోచించే వాళ్లు కొంత మంది ఉన్నారు. వాళ్లను కూడా నిరాశపరిచేలా చేశాయి సాంగ్స్. ఇప్పటి వరకు రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. ‘రా మచ్చా మచ్చా…’ స్లైలీష్ గా ఉంది. రామ్ చరణ్ డాన్స్ సూపర్ గా ఉంది. లిరిక్స్ కూడా పేరు పెట్టేలా అయితే ఏం లేవు. అయినా.. ఎందుకో జనాలకు ఈ సాంగ్ ఎక్కలేదు. ఇక ఓ డ్యూయెట్ వచ్చింది. సినిమాలో అత్యంత భారీ బడ్జెట్ దేనికైనా అయిందా అంటే అది ఈ సాంగ్‌కే. కంటికి ఇంపుగా కనిపించే లోకేషన్స్. రీచ్ లుక్. రామ్ చరణ్, కీయార మధ్య సూపర్ కెమిస్ట్రీ. అన్నింటికీ మంచి లవ్ డ్యూయేట్. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి దీంట్లో. అయినా ఈ సాంగ్ కూడా జనాల నోట్లో నానలేకపోయింది.
కల్కి గానీ, దేవర గానీ, రీసెంట్ గా వచ్చిన పుష్ప 2లో గానీ సాంగ్సే సినిమాపై హైప్ క్రియేట్ చేసేలా చేశాయి. తర్వాత ట్రైలర్ మరింత బజ్ పెంచింది. జనాలు థియేటర్స్ వరకు వచ్చారు. మంచి ఓపెనింగ్స్ రాబట్టేలా చేశాయి. కానీ, ఇప్పుడు గేమ్ ఛేంజర్ లో సాంగ్స్ బాగున్నా.. జనాలకు ఎక్కలేదు.
టీజర్ కూడా ఛేంజ్ చేయలేదు…
గేమ్ ఛేంజ్ చేసే టీజర్ అన్నారు. అయితే అది ఎంత వరకు గేమ్ ఛేంజ్ చేసింది అంటే… నో అనే ఆన్సరే వస్తుంది మెగా ఫ్యాన్స్ నుంచి. నిజానికి టీజర్ బాగుంది. అద్భుతంగా కట్ చేశారు. కానీ, సేమ్… సాంగ్స్ జనాలకు ఎక్కలేనట్టే, టీజర్ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. బజ్ పెంచలేదు.
దోప్ సాంగ్ దోచేయ్యాలి…
ఈ గేమ్ ఛేంజర్ నుంచి మరో సాంగ్ రాబోతుంది. థమన్ కాసేపటి క్రితమే అప్డేట్ ఇచ్చాడు. అప్డేట్ మాత్రమే కాదు… ఆ సాంగ్ గురించి భారీ హైప్ కూడా ఇచ్చాడు. ఈ సాంగ్ అయినా… ఆడియన్స్ ను మెప్పిస్తుందా..? సినిమాపై బజ్ క్రియేట్ చేయడానికి సాయపడుతుందా అనేది చూడాలి.
ఇంకా ఉన్నది 22 రోజులే…
సినిమా రిలీజ్ ఇంకా 22 రోజులే ఉంది. ప్రీమియర్స్ అంటూ ఒక రోజు ముందుగానే సినిమా థియేటర్స్ లోకి వస్తుంది. కాబట్టి సినిమాపై ప్రమోషన్స్ ఏం చేసినా.. ఇంకా 21 రోజుల టైం మాత్రమే ఉంది. ఈ నెల 21న యూఎస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఓ తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ యూఎస్ లో జరగడం ఇదే మొదటి సారి. దీనికి సుకుమార్ గెస్ట్. దీంతో పాటు మరిన్నీ ఈవెంట్స్ నిర్వహించే ఛాన్స్ ఉంది. అన్నింటకంటే ముఖ్యంగా ట్రైలర్. ఈ ట్రైలర్ పైనే సినిమా ఓపెనింగ్స్ ఆధారపడి ఉంటాయి.