Prabhas Marriage:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ (Prabhas) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకొని వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయారు. ఇప్పుడు చేతినిండా వరుస సినిమాలతో వరుస ప్రాజెక్టులలో ప్రకటిస్తూ అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే ప్రభాస్ ఇలా వరుసగా ప్రాజెక్టులు ప్రకటిస్తున్నారు. కానీ తన వ్యక్తిగత జీవితంపై మాత్రం ఇప్పటివరకు ఓపెన్ అవ్వడం లేదు. ఇన్నేళ్లయినా పెళ్ళివూసు ఎత్తకుండా సింగిల్ గానే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు దక్కించుకున్న వారిలో సల్మాన్ ఖాన్ (Salman Khan) తర్వాత ప్రభాస్ (Prabhas) పేరే ప్రధమంగా వినిపిస్తోంది.
ప్రభాస్ పెళ్లిపై వీడని నిరాశ..
గతంలో త్రిష (Trisha) ను ప్రేమించారని.. పెళ్లి చేసుకుంటారనే వార్తలు వచ్చాయి. కానీ అది వార్తల వరకే పరిమితమైంది. ఆ తర్వాత అనుష్క శెట్టి (Anushka Shetty) తో వివాహం జరగబోతోంది అంటూ వార్తలు వినిపించగా.. అందులో నిజం లేకపోయింది.అయితే అభిమానులు మాత్రం వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని ఏఐ ని ఉపయోగించి మరి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు, వీళ్ళకి పిల్లలు పుట్టినట్టుగా కూడా ఫోటోలు ఎడిట్ చేసి మరీ సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ తోటి నటీనటులంతా వివాహాలు చేసుకుని పిల్లలకు కూడా జన్మనిస్తుంటే.. ప్రభాస్ మాత్రం ఇంకా ఒంటరిగానే జీవితాన్ని గడపడంపై ప్రభాస్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఒకే ఒక్క వీడియో.. సెలబ్రిటీలంతా కలిసి ప్రభాస్ పెళ్లి చేస్తే..?
అసలు ఈ జన్మకి ప్రభాస్ పెళ్లి చూస్తామా? అనే ఆలోచనలో పడ్డారు అభిమానులు . ఈ నేపథ్యంలోనే అభిమానుల ఆలోచనలకు కాస్త ఊరట కలిగేలా.. ఏకంగా సెలబ్రిటీలంతా దిగివచ్చి ప్రభాస్ పెళ్లి చేస్తే ఎలా ఉంటుందో అలా ఒక వీడియోని ఎడిట్ చేసి మరీ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్. దీనికి బ్రహ్మానందం మీమ్ కూడా జోడించడం జరిగింది. అసలు” ఈ జన్మకి ప్రభాస్ పెళ్లి చూస్తానే లేదో అనుకున్నాను. ఈ ఒక్క వీడియోతో నా కోరిక తీరింది” అంటూ అభిమానులు అన్నట్టుగా బ్రహ్మానందం ఫొటో పెట్టి మీమ్ క్రియేట్ చేశారు. ఇకపోతే ప్రభాస్ ‘మిర్చి’ సినిమాలో తన మరదలు అనుష్కను వివాహం చేసుకున్న వీడియోని మెయిన్ థీమ్ గా తీసుకొని.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో తమ చెల్లి కోసం వెంకటేష్(Venkatesh ), మహేష్ బాబు (Maheshbabu) పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నట్లు.. అటు రామ్ చరణ్ (Ram Charan) తన ఫ్రెండ్ కోసం బంధువులందరినీ ఆహ్వానిస్తున్నట్లు.. ఇక గోపీచంద్(Gopichandh ) మొదలుకొని చిరంజీవి (Chiranjeevi), శ్రీ కాంత్ (Srikanth), బ్రహ్మానందం (Brahmanandam) , ఎన్టీఆర్ (NTR ), రాజమౌళి (Rajamouli) తో పాటు పలువురు దిగ్గజ సెలబ్రిటీలంతా ఈ వివాహానికి విచ్చేస్తున్నట్లు పలు సినిమాలలోని ఇలా పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలు , అలాగే నిజజీవితంలో సెలబ్రిటీలు ఇతరుల వివాహాలకు, ఈవెంట్లకు హాజరైన వీడియో క్లిప్పు లన్నీ ఒకచోట చేర్చి.. చాలా అద్భుతంగా ప్రభాస్ పెళ్లి జరిగినట్టుగా ఒక వీడియో ఎడిట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. సెలబ్రిటీలంతా కలిసి ప్రభాస్ పెళ్లి చేస్తే ఎలా ఉంటుందో.. ముందుగానే ఊహించుకొని ఆ వీడియో ద్వారా చూపించేశారు అభిమానులు. ఈ వీడియో చూస్తుంటే రెండు కళ్ళు చాలడం లేదు. ఇక ఇదే నిజం కావాలని అటు ఫ్యాన్స్, ఎటు ప్రభాస్ శ్రేయోభిలాషులు, స్నేహితులు కూడా కోరుకుంటూ ఉండడం గమనార్హం.
?utm_source=ig_web_copy_link