Alekhya Chitti Pickles Controversy: కస్టమర్లను నోటికి వచ్చినట్లు తిట్టిన అలేఖ్య చిట్టీకి తగిన శాస్తి జరిగింది. అలేఖ్య చిట్టీ పికెల్స్ వ్యాపారం కుప్పకూలిపోయింది. ఇంతకాలం కష్టపడి పెంచుకుంటూ వచ్చిన వ్యాపారం.. నోరు అదుపులో పెట్టుకోలేకపోవడంతో నట్టేట ముంచేసుకుంది. బిజినెస్ క్లోజ్ కావడంతో పాటు విపరీతమైన నెగెటివిటీని మూటగట్టుకుంది. నెటిజన్లు, మీమర్స్ అలేఖ్య చిట్టీ సిస్టర్స్ పై తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అలేఖ్య డిప్రెషన్ లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ప్రస్తుతం ఆమె హాస్పిటల్ లో చేరినట్లు తెలుస్తోంది.
అలేఖ్య వివాదంపై అన్వేష్ ఏమన్నారంటే?
ఇక అలేఖ్య చిట్టీ పికెల్స్ వివాదంపై ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ కూడా స్పందించాడు. అలేఖ్య సిస్టర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని, అందుకే వారికి పాపం తగిలిందన్నాడు. దేవుడు వాళ్లకు తగిన శాస్తి చేశాడని చెప్పుకొచ్చాడు. అలేఖ్య మాట్లాడిన మాటలతో ఆమె బిజినెస్ పూర్తిగా క్లోజ్ అయినట్లు చెప్పాడు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదన్నాడు. అలేఖ్య చిట్టీ పికెల్స్ వ్యాపారం క్లోజ్ కావడంతో ఇప్పుడు కొత్త బిజినెస్ మొదలుపెట్టబోతున్నట్లు చెప్పుకొచ్చాడు.
అలేఖ్య సిస్టర్స్ మొదలుపెట్టబోయే కొత్త బిజినెస్ ఇదే!
అలేఖ్య ఇప్పుడు లడ్డూల బిజినెస్ మొదలుపెడుతున్నట్లు అన్వేష్ వెల్లడించాడు. ఇకపై ఈ లడ్డూలు మూడు రకాలుగా తయారు చేబోతున్నట్లు వివరించాడు. మూడు రకాల ధరల్లో వీటిని తయారు చేసి అమ్మబోతున్నట్లు చెప్పుకొచ్చాడు. “ పికెల్స్ బిజినెస్ క్లోజ్ చేశాం. లడ్డూల బిజినెస్ మొదలు పెడుతున్నాం. ఇప్పుడు లడ్డూలు పేద, మధ్య తరగతి, రిచ్.. మూడు క్వాలిటీస్ లో ఉంటాయి. మీ స్థాయిని బట్టి లడ్డూలు కొనుగోలు చెయ్యొచ్చు. చీప్ గా ఉన్నాయి అనుకుంటే, కాస్ట్ లీ లడ్డూలు కొనవచ్చు. చాలా ఎక్కువ ధర ఉన్నాయి అనుకుంటే చీప్ లడ్డూలు కొనుగోలు చేయవచ్చు. అందరికీ అందుబాటులో ఉండేలా వ్యాపారం చేయబోతున్నాం” అన్నాడు.
గతంలో మ్యాగీ న్యూడిల్స్ విషయంలోనూ ఇలాగే జరిగిందని ఎగ్జాంఫుల్ గా చెప్పుకొచ్చాడు. “మ్యాగీ న్యూడిల్స్ గురించి ఐడియా ఉంది కదా. అప్పట్లో దాని మీద ఎంతో నెగెటివిటీ వచ్చింది? సేమ్ ఇలాగే చేశారు. వచ్చారు. క్షమాపణ చెప్పారు. మళ్లీ ప్రారంభించారు. బాగా డబ్బులు సంపాదించడం మొదలు పెట్టారు. అన్యాయం చేయకుండా కష్టపడితే కచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎంత కష్టపడితే అంత లాభపడుతారు. కష్టే ఫలి అంటారు. అలేఖ్య చిట్టీ పికెల్స్ కథ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. కచ్చితంగా వాళ్ల మళ్లీ బిజినెస్ సక్సెస్ అవుతుంది” అని అన్వేష్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
Read Also: చిక్కుల్లో అలేఖ్య చిట్టీ? నోరు జారితే ఎన్నేళ్ల జైలు శిక్షో తెలుసా?
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఇంతే!
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరికి అలేఖ్య చిట్టీకి పట్టిన గతే పడుతుందన్నాడు అన్వేష్. “బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు అలేఖ్య సిస్టర్స్ కు తగిన శిక్ష పడింది. దేవుడే డైరెక్ట్ గా శిక్ష వేశాడు. బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ల జీవితాలు అన్నీ ఇలాగే అవుతాయి. భయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి, ఇమ్రాన్ బతుకులు కుక్క బతుకులు అయ్యాయి. నిజాయితీగా బతికిన వాళ్లు హ్యాపీగా ఉంటున్నారు. బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ల జీవితాలు దరిద్రం అయిపోయాయి” అని చెప్పుకొచ్చారు.
Read Also: బెట్టింగ్ యాప్స్ తో పచ్చళ్ల దుకాణం.. అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదంలోకి అన్వేష్ ఎంట్రీ!