Vijay Deverakonda:సూర్య(Suriya ) హీరోగా నటించిన ‘రెట్రో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఒక తెగను ఉద్దేశించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో స్పందించిన హీరో విజయ్ దేవరకొండ సారీ చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. ఇక ఈ విషయం కాస్త విజయ్ దేవరకొండ వరకు వెళ్లడంతో ఆయన దీనిపై స్పందించారు.
వివాదంపై స్పందించిన విజయ్ దేవరకొండ..
తాజాగా ఒక ప్రకటన విడుదల చేసిన ఈయన అందులో.. “రెట్రో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో నేను చేసిన వ్యాఖ్య కొంతమంది సభ్యులను ఆందోళనకు గురి చేసిందని నా దృష్టికి వచ్చింది. అందుకే నేను మనస్ఫూర్తిగా స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఏ కమ్యూనిటీని కానీ, ముఖ్యంగా ఏ షెడ్యూల్డ్ తెగలను కానీ.. మన దేశంలో అంతర్భాగంగా భావించే వారిని గాయపరచడమే లక్ష్యంగా నేను ఏ మాటలు మాట్లాడలేదు. నేను ఒక్క ఐక్యత గురించి మాత్రమే మాట్లాడాను. భారతదేశం ఒకటి.. మనమంతా ఒక్కటి.. మనమంతా కలిసి ముందుకు సాగాలి.. ముఖ్యంగా ఏ ప్రపంచంలో కూడా ఒక దేశంగా , ఐక్యంగా నిలబడాలని ప్రోత్సహిస్తున్నప్పుడు. ఉద్దేశపూర్వకంగా భారతీయులలో ఏదైనా ఒక తెగ పట్ల వివక్షత ఎలా చూపుతాను.. వారందరినీ నేను నా కుటుంబంలో నా సోదరులలాగే చూస్తాను. నేను ఉపయోగించిన తెగ అనే పదం చారిత్రక లేదా నిఘంటువు అర్థంలో ఉద్దేశించబడింది. శతాబ్దాల క్రితం ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజం ఇలా తెగలు, వంశాలుగా వ్యవస్థీకృతమై తరచుగా సంఘర్షణలో ఉన్న సమయాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా ఇది ఒక షెడ్యూల్డ్ తెగల వర్గీకరణకు ఎప్పుడు కూడా సూచన కాదు. వలస రాజ్యాల, వలస పాలనాంతర భారత దేశంలో ప్రవేశపెట్టబడింది. 20వ శతాబ్దం మధ్యలో మాత్రమే అధికారకరించబండింది. నా మాటలతో ఎవరినైనా తప్పుగా మాట్లాడినట్లు అనిపిస్తే లేదా బాధ కలిగించినట్లయితే నేను నా హృదయపూర్వక విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. శాంతి ప్రగతి, ఐక్యత గురించి మాట్లాడడమే నా ఏకైక లక్ష్యం. నా సమాజాన్ని ఉద్ధరించడానికి, విభజించకుండా ఏకం చేయడానికి మాత్రమే నేను కట్టుబడి ఉంటాను. ఎవరూ కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు” అంటూ విజయ్ దేవరకొండ కామెంట్లు చేశారు.
రెట్రో ఈవెంట్ లో ఏం జరిగిందంటే..?
రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ టెర్రరిస్టులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. “టెర్రరిస్ట్ కొడుకులకు సరైన ఎడ్యుకేషన్ ఇప్పిస్తే.. ఇలా బ్రెయిన్ వాష్ అవ్వకుండా ఉంటారు. 500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు ఇలా బుద్ధి లేకుండా, కామన్ సెన్స్ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు”అంటూ విజయ్ దేవరకొండ కామెంట్లు చేశారు. దీంతో ఆయన చేసిన కామెంట్లపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి . క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్స్ కూడా వచ్చాయి. తమ మనోభావాలు దెబ్బతీసేలా విజయ్ దేవరకొండ మాట్లాడాడని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దీంతో విజయ్ దేవరకొండ ఇప్పుడు స్పందించడం జరిగింది.
To my dear brothers ❤️ pic.twitter.com/QBGQGOjJBL
— Vijay Deverakonda (@TheDeverakonda) May 3, 2025