BigTV English

5 Best Telugu comedy Movies on OTT : ఓటీటీలో ఉన్న టాప్ 5 తెలుగు కామెడీ మూవీస్… సమ్మర్లో చిల్ అవ్వాలనుకుంటే ఈ సినిమాలు డోంట్ మిస్

5 Best Telugu comedy Movies on OTT : ఓటీటీలో ఉన్న టాప్ 5 తెలుగు కామెడీ మూవీస్… సమ్మర్లో చిల్ అవ్వాలనుకుంటే ఈ సినిమాలు డోంట్ మిస్

5 Best Telugu comedy Movies on OTT : తెలుగులో కడుపుబ్బా నవ్వించే కామెడీ సినిమాలకు కొదవేం లేదు. ఇప్పటికే థియేటర్లలో అదరగొట్టిన తెలుగు కామెడీ సినిమాలపై ఈ సమ్మర్ హాలీడేస్ లో కూడా మరోసారి ఫ్యామిలీతో కలిసి ఓ లుక్కేసి చిల్ అవ్వండి. ఓటీటీలో ఇలాంటి సినిమాల కోసం వెతుకుతున్న వారి కోసమే ఈ టాప్ 5 తెలుగు కామెడీ సినిమాలు. మరి ఆ సినిమాలు ఏంటి ? ఏ ఓటీటీలో ఉన్నాయి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


1. జాతి రత్నాలు (Jathi Ratnalu)
2021లో రిలీజ్ అయిన ఈ కామెడీ ఎంటర్టైనర్ రిలీజ్ అయ్యింది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి పులికొండ, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు కె.వి. అనుదీప్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న సినిమాకు ఐఎండీబీలో 7.3 రేటింగ్ ఉంది.

ఈ చిత్రం ముగ్గురు స్నేహితులు (శ్రీకాంత్, రవి, సతీష్)ల చుట్టూ తిరుగుతుంది. పనీపాటా లేని ఈ ముగ్గురూ జోగిపేట నుండి హైదరాబాద్‌కు వచ్చి, ఒక హత్య కేసులో ఇరుక్కుంటారు. ఇందులో ఉన్న నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్, డైలాగులు ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ గా మార్చాయి. ‘జాతి రత్నాలు’ హిలేరియస్ కామెడీ రైడ్ మాత్రమే కాదు తెలుగు సినిమాలలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది.


2. ఓం భీమ్ బుష్ (Om Bheem Bush)
శ్రీ విష్ణు, ప్రియదర్శి పులికొండ, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఐఎండీబీలో దీనికి 5.8 రేటింగ్ ఉంది. ఇందులో ముగ్గురు సైన్స్ విద్యార్థులు (కృష్, వినోద్, మాదవ్) దెయ్యం ఉన్న ఒక గ్రామంలో ఒక స్కామ్‌ చేయడానికి వెళ్తారు. కానీ అక్కడ నిజమైన ఆత్మ చేతిలో చిక్కుకుంటారు.

3. సమాజవరగమన (Samajavaragamana)
శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్, నరేష్ మెయిన్ లీడ్స్ గా నటించిన ఈ సినిమాకు దర్శకుడు రామ్ అబ్బరాజు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న ఈ సినిమాకు ఐఎండీబీలో 7.5 రేటింగ్ ఉంది. ఈ సినిమాలో బాలు (శ్రీ విష్ణు), ఒక సినిమా టికెట్ షాప్ ఉద్యోగి. తన కజిన్ సరయుతో ప్రేమలో పడతాడు. కానీ వీళ్లిద్దరి ప్రేమకు ఇంట్లో వాళ్ళు అడ్డు చెబుతారు. తరువాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.

4. డీజే టిల్లు (DJ Tillu)
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన హిలేరియస్ కామెడీ మూవీ ‘డీజే టిల్లు’. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ రెండు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఐఎండీబీలో ఈ మూవీకి 7.2 రేటింగ్ ఉంది. టిల్లు (సిద్ధు) ఒక డీజే. రాధిక (నేహా)తో ప్రేమలో పడి, ఒక హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఇందులో హైదరాబాదీ స్లాంగ్, సిద్ధు వన్-లైనర్స్, రొమాన్స్ ఈ సినిమాను యూత్‌కు ఆల్ టైమ్ ఫేవరెట్‌ గా చేశాయి.

Read also : వే*శ్యా గృహంలో వెర్రివేషాలు… అమ్మాయిలకు నరకం చూపిస్తూ… ఏందిరా సామి ఈ అరాచకం

5. ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindi)
2018 లో రిలీజ్ అయిన ఈ మూవీ కూడా తెలుగు ఆల్ టైమ్ కామెడీ ఎంటర్టైనర్ లలో ఒకటి. విశ్వక్ సేన్, వెంకటేష్ కాకుమాను, అభినవ్ గోమటం ప్రధాన పాత్రలు పోషించారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఐఎండీబీలో 8.0 రేటింగ్ ఉంది. నలుగురు స్నేహితులు (వివేక్, కార్తీక్, ఉప్పు, కౌశిక్) తమ ఫిల్మ్‌ మేకింగ్ కలలను సాకారం చేసుకోవడానికి గోవాకు వెళతారు. అక్కడ ఏమైంది అన్నదే స్టోరీ.

Related News

OTT Movie : పిల్లోడిని చంపి సూట్ కేసులో… మైండ్ బెండయ్యే కొరియన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

OTT Movie : రెంటుకొచ్చి పక్కింటి అమ్మాయితో… కారు పెట్టిన కార్చిచ్చు… దిమాక్ కరాబ్ ట్విస్టులు సామీ

OTT Movie : అమ్మాయి ఫోన్ కి ఆ పాడు వీడియోలు… ఆ సౌండ్ వింటేనే డాక్టర్ కి దడదడ… మస్ట్ వాచ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పిల్లల ముందే తల్లిపై అఘాయిత్యం… సైతాన్ లా మారే కిరాతక పోలీస్… క్లైమాక్స్ లో ఊచకోతే

OTT Movie : కాల్ సెంటర్ జాబ్ లో తగిలే కన్నింగ్ గాడు… ఫోన్లోనే అన్నీ కానిచ్చే కస్టమర్లు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : ఆసుపత్రిలో దిక్కుమాలిన పని… ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా ఏంది భయ్యా ఈ అరాచకం

OTT Movie : మెయిడ్ గా వచ్చి యజమానితో రాసలీలలు… ఈ అత్తా కోడళ్ళు ఇచ్చే షాక్ అరాచకం భయ్యా

OTT Movie : రాత్రికి రాత్రే వింత చావులు… అర్ధరాత్రి పీకలు తెగ్గోసే కిల్లర్… గూస్ బంప్స్ పక్కా

Big Stories

×