Former Minister Mallareddy: మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వివాదాల్లో ఇరుక్కున్నారు. ఓ సినీ ఫంక్షన్‌కు హాజరైన మల్లారెడ్డి హీరోయిన్‌పై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. హీరోయిన్ పేరును పలికే క్రమంలో.. కసికపూర్ అంట మంచి కసి..కసిగా ఉందని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. మల్లారెడ్డి వ్యాఖ్యలపై మహిళాసంఘాలు మండిపడుతున్నాయి. మల్లారెడ్డి అసెంబ్లీకి డుమ్మాకొట్టి మరి సినీఫంక్షన్‌కు హాజరుకావడంపై విమర్శలు తలెత్తుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. మాజీ మంత్రి మల్లారెడ్డి నిత్యం ఏదొక వార్తల్లో ఇరుక్కుంటునే ఉంటారు. బీఆర్ఎస్ హయంలో ఉన్నప్పుడు ఈయన ఆడిందే ఆట.. సాగింతే పాట అన్నట్టుగా సాగింది యవ్వారం. ప్రస్తుతం బీఆర్ఎస్ అధికారంలో లేకపోయనా సరే.. ఎక్కడున్న అంతా నా ఇష్టమే అన్నట్లుగా మాట్లాడుతుంటారు. మరీ ముఖ్యంగా మల్లారెడ్డి మాట్లాడే మాటలు.. చేసే కామెంట్స్ అందరిని నవ్వించేలా చేస్తాయి. ఇక మల్లారెడ్డి కాలేజీలన్నీ ఈయనవే.. ఈ మధ్య పలు సినిమాలకు ఈవెంట్లకు కూడా వెళుతూ.. అక్కడ వచ్చిన సెలబ్రెటీలను, అభిమానులను నవ్వులు పుట్టిస్తూ ఉంటారు. ఇలాంటి మాజీ మంత్రి మల్లారెడ్డి తాజాగా ఓ మూవీ ఈవెంట్లో పాల్గొని, హీరోయిన్‌పై హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు వివాదాస్పాదంగా మారాయి. ఇంతకీ మల్లారెడ్డి ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం..
ది గ్రేట్ పాపులర్ దివంగత సింగర్ అయిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు.. ఎస్పీ చరణ్ చాలా రోజుల తర్వాత ‘లైఫ్’ అనే సినిమాతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రీహర్ష, కషికపూర్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 4న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా గ్రాండ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా మల్లారెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హీరో శ్రీహర్ష మా కాలేజీ వాడే.. ఇక్కడే చదువుకున్నాడు. శ్రీహర్ష తండ్రి మా కాలేజీలో ప్రిన్సిపల్. అలా మా ప్రిన్సిపల్ కొడుకు సినిమా హీరో అవడం చాలా గర్వంగా ఉందని తెలిపారు. అలాగే శ్రీహర్ష తమిళ స్టార్ విజయ్ కంటే చాలా స్మార్ట్‌గా ఉన్నాడంటూ పొగడ్తల వర్షం కురిపించారు.
Also Read: ఆ డైరెక్టర్ వల్లే టాలీవుడ్ కి వెలుగొచ్చింది.. రౌడీ హీరో కామెంట్స్..!
ఇక ఈ సినిమాలో నటించిన కషిక కపూర్‌ని ఉద్దేశించి మల్లారెడ్డి మాట్లాడుతూ.. హీరోయిన్ పేరు కషిక అంట.. చాలా కసి కసిగా ఉందంటూ ఆయన మాట్లాడటంతో .. అక్కడ ఉన్నవాళ్లందరూ నవ్వేశారు. అంతేకాదు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అసెంబ్లీకీ మరీ డుమ్మా కొట్టి వచ్చాను అంటూ హాస్యాస్పదంగా మాట్లాడారు. అయితే అంతా బాగానే ఉన్నప్పటికీ హీరోయిన్‌పై అలా కసి కసిగా ఉందంటూ మాట్లాడటం చాలా మందికి నచ్చలేదు. ఈ నేపథ్యంలో మాల్లారెడ్డి మాటలు వివాదాస్పదంగా మారాయి. ఈయన మాటలు విన్న కొంతమంది.. బాధ్యత గల పదవిలో ఉండి ఆడవాళ్లపై ఇలా మాట్లాడటం సరికాదు అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు.
కసికాపూర్ అంట హీరోయిన్ మంచి కసి కసిగా ఉన్నది .
– మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి.అసెంబ్లీకి డుమ్మా కొట్టి మరి సినిమ ఫంక్షన్ కి హాజరైన మల్లారెడ్డి విద్యాసంస్థలు అధినేత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్ల రెడ్డి pic.twitter.com/oEMY0o10sT
— Telangana365 (@Telangana365) March 28, 2025