Elon Musk: ప్రపంచంలో అత్యంత ధనిక వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. కృత్రిమ మేధస్సు (AI) రంగంలో తన కొత్త స్టార్టప్ xAIలో, తన సోషల్ మీడియా X (మునుపటి ట్విట్టర్)ని విలీనం చేశారు. ఈ ఒప్పందంలో మొత్తం $33 బిలియన్ల విలువైన స్టాక్ లావాదేవీ చోటుచేసుకోగా, అందులో $12 బిలియన్లు అప్పుగా ఉంది. ఈ విలీనంతో xAI కంపెనీ విలువ అక్షరాలా $80 బిలియన్లకు చేరుకుంది. ఈ క్రమంలో మస్క్ తన సొంత xAIకి $33 బిలియన్ల స్టాక్ డీల్ కు Xని అమ్మేశాడు.
విలీనానికి కారణాలు
xAI, X ద్వారా వినియోగదారులను సమన్వయం చేస్తూ, మరింత మెరుగైన సేవలను అందించేేందుకు విలీనం చేశారని టెక్ వర్గాలు అంటున్నాయి. మస్క్ ఈ విలీనంపై మాట్లాడుతూ, “xAI, X పరస్పరం అనుసంధానించబడ్డాయని ప్రకటించారు.
ఎలాన్ మస్క్ గతంలో ఏం చేశారంటే
2022లో ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను $44 బిలియన్లకు కొనుగోలు చేసి, దాన్ని Xగా పునఃనామకరణం చేశారు. ఈ కొత్త విలీనంతో, xAI సామర్థ్యాలతో X సోషల్ మీడియాను సమన్వయం చేస్తారు. తద్వారా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందనున్నాయి.
Grok చాట్‌బాట్
ఈ విలీనంతో xAI Grok చాట్‌బాట్ సేవలు Xలో ఉపయోగించుకునేందుకు వినియోగదారులకు అవకాశముంది. ఆ క్రమంలో Grok చాట్‌బాట్ వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకుని, వారికి తక్షణ సమాధానాలు అందించగల సామర్థ్యాన్ని కల్గి ఉంటుంది.
Read Also: 5G Smartphone Offer: టాప్ బ్రాండ్లకు పోటీగా కొత్త మోడల్..
వినియోగదారులకు ప్రయోజనాలు
ఈ విలీనంతో వినియోగదారులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. xAI ఆధునిక AI టెక్నాలజీ ద్వారా X వేదికను వినియోగదారులు మరింత ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. దీంతోపాటు వినియోగదారులు తమ ఆసక్తికి అనుగుణంగా కంటెంట్‌ను పొందవచ్చు. తద్వారా వారి సమయం ఆదా కావడంతోపాటు మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.
భవిష్యత్తు దిశ
ఎలోన్ మస్క్ ఈ విలీనాన్ని ఒక కొత్త దిశగా చూస్తున్నారు. AI మరియు సామాజిక మాధ్యమం కలిసి పనిచేయడం ద్వారా, వినియోగదారులకు మరింత సమర్థవంతమైన, తెలివైన సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విలీనంతో, xAI మరియు X యొక్క భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తోంది.
ఎలాన్ మస్క్ వ్యాపారం కోసం మాత్రమే కాదు
మస్క్ దృష్టి కేవలం వ్యాపారాన్ని పెంచడం మాత్రమే కాదు. ప్రధానంగా వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడం కూడా. xAI ద్వారా అందించే AI టెక్నాలజీని Xలో సమన్వయం చేయడం ద్వారా, వినియోగదారులు మరింత ఈజీగా, త్వరగా సమాచారాన్ని పొందగలుగుతారు.
టెక్ వర్గాల కామెంట్స్
ఈ విలీనంతో సోషల్ మీడియా, ఏఐ మధ్య మరింత సంబంధం పెరుగుతుంది. వినియోగదారులు తమ అనుభవాలను మెరుగుపరచడానికి, AI ఆధారిత సేవలను సులంభంగా ఉపయోగించుకుంటారు. ఈ విషయం తెలిసిన టెక్ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఇకపై ఒకే ప్లాట్ ఫాం ద్వారా రెండు రకాల సేవలను వినియోగించవచ్చని అంటున్నారు. ఈ క్రమంలో ఏఐ సేవల కోసం గ్రోక్, సోషల్ మీడియా కోసం ఎక్స్ విడివిడిగా ఉపయోగించాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు.