BigTV English

FreeFire x Pushpa2TheRule : టార్గెట్ ఆడియన్స్ పల్స్ పట్టుకున్నారు

FreeFire x Pushpa2TheRule : టార్గెట్ ఆడియన్స్ పల్స్ పట్టుకున్నారు

Free Fire x Pushpa2 The Rule: గంగోత్రి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా ఈ సినిమాను విపరీతంగా ఆదరించారు. అయితే ఈ సినిమాకి సంబంధించి అల్లు అర్జున్ కంటే ఎక్కువ పేరు రాఘవేంద్రరావుకి వచ్చింది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఆర్య సినిమాను చేశాడు అల్లు అర్జున్. ఆర్య సినిమా తర్వాత అల్లు అర్జున్ వెనక్కి తిరిగి చూసుకోవలసిన పరిస్థితి రాలేదు అని చెప్పాలి. అల్లు అర్జున్ కెరీర్ లోనే ఇప్పటికీ ఆర్య సినిమాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆ సినిమాతోనే నేడు పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి పేరు సాధించిన సుకుమార్ కూడా పరిచయమయ్యాడు. ఇక వీరిద్దరి కాంబినేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం వీరి కాంబినేషన్ లో పుష్ప 2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ తుది దశలో ఉంది. డిసెంబర్ 5న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.


ఇక రిలీజ్ కి ఎక్కువ రోజులు లేవు కాబట్టి ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో జోరు పెంచింది. చాలా డిఫరెంట్ గా ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ కి సోషల్ మీడియాలో ఎంత పెద్ద క్రేజ్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ మీద ఒక నెగిటివ్ వీడియో ఎవరైనా పోస్ట్ చేస్తే ఆ వీడియోకి విపరీతమైన కౌంటర్స్ రావడంతో పాటు అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి కూడా వార్నింగ్స్ వస్తూ ఉంటాయి. అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అల్లు అర్జున్ పి.ఆర్ సర్కిల్. ఎంత సర్కిల్ ఉన్నా కూడా ట్రోల్స్ ని పూర్తిస్థాయిలో ఆపలేం గనుక అవి ఇంకా వస్తూనే ఉంటాయి. ఇక ది బిగ్గెస్ట్ గేమ్ ఫ్రీ ఫైర్ తో కొలబరేషన్ అవుతుంది పుష్ప సినిమా యూనిట్. ఒక యానిమేషన్ వీడియో ని రెడీ చేసి అఫీషియల్ గా రిలీజ్ చేసింది పుష్ప టీం. దీనిని కూడా కొంతమంది మరోరకంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

Also Read: Varun Tej’s upcoming films : నెక్స్ట్ చేయబోయే రెండు ప్రాజెక్టులు అఫీషియల్ గా చెప్పేసాడు


ప్రతి హీరో కి ఫ్యాన్స్ ఉంటే అల్లు అర్జున్ కు మాత్రం ఆర్మీ ఉంది అని కొన్ని సందర్భాల్లో చెబుతూ ఉంటాడు. అల్లు అర్జున్ కి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే వీరిలో ఎక్కువ శాతం స్కూల్ పిల్లలు ఉన్నారు అంటూ కొంతమంది ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇక రీసెంట్ టైమ్స్ లో స్కూల్ పిల్లలు అంతా కూడా ట్యాబ్స్ లోను మొబైల్ ఫోన్స్ లోను ఫ్రీ ఫైర్ గేమ్ కి విపరీతంగా అలవాటు పడిపోయారు. ఇక ఆ గేమ్ లో పుష్ప సినిమా రిలేటెడ్ కంటెంట్ వస్తే సినిమా మీద బజ్ విపరీతంగా పెరుగుతుంది. వాస్తవానికి అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ అక్కడే ఉందని, వాళ్ల టార్గెట్ ఆడియన్స్ కూడా చిన్నపిల్లలే అని కొత్తగా సోషల్ మీడియాలో ట్రోల్స్ వేయడం మొదలుపెట్టారు. ఏదేమైనా పుష్ప సినిమా మీద మంచి హైప్ అయితే ఉంది.

Tags

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×