Varun Tej’s upcoming films: మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోస్ లో వరుణ్ తేజ్ ఒకరు. ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తన కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. రీసెంట్ టైమ్స్ లో వరుణ్ హిట్ సినిమా చూసి చాలా రోజులైంది. కేవలం కాన్సెప్ట్ బేస్ సినిమాలు మాత్రమే ఎంచుకుంటూ తనకున్న మార్కెట్ ను కూడా పోగొట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం మళ్ళీ ఒక కమర్షియల్ సక్సెస్ సాధించాలని ఉద్దేశంతో కరుణకుమార్ దర్శకత్వంలో మట్కా అనే ఒక సినిమాను చేశాడు. ఈ సినిమా నవంబర్ 14న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఈ సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు చిత్ర యూనిట్. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తను చేయబోయే తదుపరి సినిమాలను స్వయంగా రివీల్ చేశాడు వరుణ్ తేజ్.
వరుణ్ తేజ్ తన నెక్స్ట్ సినిమా దర్శకుడు మేర్లపాక గాంధీతో చేయనున్నట్లు తెలిపాడు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు గాంధీ. సందీప్ కిషన్ నటించిన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత చేసిన ఎక్స్ప్రెస్ రాజా సినిమా కూడా పరవాలేదు అనిపించుకుంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన కృష్ణార్జున యుద్ధం సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఇక చివరగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనే సినిమాను చేశాడు గాంధీ. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ కోసం రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఒక కథను సిద్ధం చేశాడు. మట్కా ప్రమోషన్స్ అయిపోయిన వెంటనే ఆ సినిమాకి సంబంధించిన స్లాంగ్ నేర్చుకుంటాను అని వరుణ్ తేజ్ తెలిపాడు. ఇక ఆ తర్వాత మరో కొత్త డైరెక్టర్ తో ఒక లవ్ స్టోరీని చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక వరుణ్ తేజ్ కెరియర్లో చేసిన ఫిదా, తొలిప్రేమ వంటి సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి.
Also Read : Hero Darshan: దర్శన్ పై అమితమైన ప్రేమ పెంచుకున్న స్టార్ హీరోయిన్.. చచ్చేవరకు అంటూ..!
శ్రీదేవి సోడా సెంటర్ సినిమా తర్వాత కరుణకుమార్ దర్శకత్వం వహించిన సినిమా మట్కా. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఇకపోతే మట్కా సినిమా సక్సెస్ సాధించడమనేది ఇద్దరికీ చాలా అవసరం. అదే రోజు శివ దర్శకత్వంలో సూర్య నటించిన కంగువ సినిమా కూడా రిలీజ్ కానుంది. కంగువ సినిమా పైన ఎంత హైపు ఉంది అని మనకు తెలియంది కాదు. ఈ సినిమాను తమిళ్ బాహుబలి అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాత జ్ఞానవేల్ రాజా కూడా ఈ సినిమా దాదాపు 2000 కోట్లు కలెక్షన్స్ వసూలు చేస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయో నవంబర్ 14న తెలియనుంది.