Pushpa 2-Robinhood: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో.. భారీ అంచనాల మధ్య వచ్చిన పుష్ప2 సినిమా ఎంత పెద్ద సంచలన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఏకంగా బాహుబలి 2 రికార్డ్ బద్దలు కొట్టి.. 1871 కోట్లు కొల్లగొట్టి హైయెస్ట్ గ్రాసర్ రాబట్టిన ఇండియన్ సినిమాల్లో రెండో స్థానంలో నిలిచింది. అయితే.. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేశారు మైత్రి మూవీ మేకర్స్ వారు. కానీ హైదరాబాద్‌లోని అత్యంత కీలకమైన ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో మాత్రం పుష్ప 2ను విడుదల చేయలేకపోయారు. ఈ విషయంలో ప్రసాద్స్ మల్టీప్లెక్స్ వారు మూవీ లవర్స్‌కు క్షమాపణలు కూడా చెప్పారు. అలాగే.. పర్సెంటేజ్ తేల్చకపోతే.. ప్రసాద్స్‌లో పుష్ప 2 రిలీజ్ అవ్వదని కూడా చెప్పారు. చివరి నిమిషం వరకు ప్రసాద్స్‌లో పుష్ప 2 రిలీజ్ ఉంటుందని అనౌన్స్ చేయలేదు. ఫైనల్‌గా రిలీజ్ డేట్‌కి ఒక్క రోజు ముందు.. పర్సెంటేజ్ ఇష్యూ క్లియర్ చేసుకున్నారు. తాజాగా మైత్రీ మేకర్స్ వారు దీనిపై క్లారిటీ ఇచ్చారు.
రాబిన్‌హుడ్‌కి ఆ ప్రాబ్లమ్ లేదు
మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన సినిమా లేటెస్ట్ ఫిల్మ్ రాబిన్‌హుడ్. భీష్మ కాంబినేషన్ రిపీట్ చేస్తూ.. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఈ సినిమా మార్చి 28న గ్రాండ్‌గా థియేటర్లోకి రాబోతోంది. ఈ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ కీ రోల్ ప్లే చేశాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. మేకర్స్ ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు. ఇక ఈ ప్రమోషన్స్‌లో భాగంగా.. మైత్రీ మూవీస్ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్‌ను పుష్ప2 ప్రసాద్ ఐమాక్స్ ఇష్యూ గురించి అడగ్గా.. క్లారిటీ ఇచ్చారు. పుష్ప 2 టైంలో ప్రసాద్ ఐ మ్యాక్స్ వాళ్లకు, మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లకు మధ్య చిన్న గ్యాప్ వచ్చింది కదా అంటే? అప్పుడేదో పుష్ప 2 మూవీకి పర్సెంటేజ్ విషయంలో ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు రాబిన్ హుడ్ సినిమాకు అలాంటిదేమి లేదు.. అంతా సాఫీగానే రిలీజ్ అవుతుందని.. చెప్పుకొచ్చారు.
గ్రాండ్‌గా రాబిన్ హుడ్ రిలీజ్
ఈ సినిమా కోసం నితిన్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ ఖర్చు చేశారు మైత్రీ మూవీ మేకర్స్ వారు. దాదాపు 60 కోట్లు ఖర్చు చేసినట్టుగా టాక్. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకుతగ్గట్టే.. భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 28 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. దీంతో.. రాబిన్‌హుడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 29 కోట్లుగా ఫిక్స్ అయింది. ఇక గ్రాస్ ప్రకారం చూస్తే.. ఈ సినిమా 55 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. నితిన్ కెరీర్లోనే ఇది భారీ టార్గెట్ చిత్రంగా రాబోతోంది. ఈ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఉండడం ప్లస్ అయిందనే చెప్పాలి. ఈ సినిమా ఓటిటి డీల్ కూడా భారీగానే జరిగింది. మరి రాబిన్ హుడ్ ఎలా ఉంటుందో చూడాలి.