Venuswamy:ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి(Venuswamy) ఈ మధ్యకాలంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. ఎక్కువగా సెలబ్రిటీల జాతకాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా శోభిత ధూళిపాళ (Shobhita dhulipala) , నాగచైతన్య (Naga Chaitanya) రెండో పెళ్లిపై చేసిన కామెంట్స్ ఎంతలా సెన్సేషన్ సృష్టించాయో అందరికీ తెలుసు. ముఖ్యంగా మహిళా కమిషన్ సీరియస్ అవ్వడంతో ఎట్టకేలకు క్షమాపణలు కూడా చెప్పారు. కనీసం ఇకనైనా సైలెంట్ అవుతారని.. అందరూ అనుకోగా.. ఇప్పుడు మరొకసారి తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ తో నెట్టింట సంచలనం సృష్టించారు. ఇక అందులో భాగంగానే గత మూడు రోజులుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉండే బడా నిర్మాతలతో పాటు ‘పుష్ప 2’ మూవీ నిర్మాతలు, డైరెక్టర్ సుకుమార్ (Sukumar)ఇళ్లలో ఐడి అధికారులు దాడి చేయగా.. దీనిపై కూడా స్పందించారు వేణు స్వామి.
అల్లు అర్జున్, సుకుమార్ కి అప్పటివరకు కష్టాలు తప్పవు..
వేణు స్వామి తన ఇంస్టాగ్రామ్ లో అల్లు అర్జున్, సుకుమార్ జాతకం గురించి విశ్లేషించారు. అల్లు అర్జున్ గురించి ఆయన చుట్టూ జరిగే వాటి గురించి అందరూ విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ కు సంబంధించి ఎంతోమంది అడుగుతున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ది కన్య రాశి, సుకుమార్ ది కుంభరాశి. వీళ్ళ జాతకాలు షష్టాష్టకం.. ఈ కాంబినేషన్ జాతకాల వల్ల శని స్థానాన్ని బట్టి సంఘటనలు జరుగుతాయి. ఈ రెండు కలవడం వల్ల ఒక ఫైర్ లాగా బ్లాస్ట్ అవుతుంది. దీనివల్ల చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా అల్లు అర్జున్ జాతకం ప్రకారం ఇప్పుడు ఉన్న శని స్థానం ఆయనకు శత్రు స్థానం, రోగస్థానం. అందుకే గత సంవత్సరం నుంచి ఆయన మీద విపరీతమైన శత్రువుల దాడి జరుగుతోంది. ఇది మనందరికీ తెలుసు. వీటివల్లే ఆయన జైలుకు కూడా వెళ్లి వచ్చి మానసికంగా దెబ్బతిన్నారు. అంతేకాదు 2025 మార్చి 30 వరకు అల్లు అర్జున్ , సుకుమారులకు శని కీలక స్థానాలలో ఉండడం వల్లే వీరికి ఇబ్బందులు తప్పవు. వీరిద్దరి వల్ల మైత్రి మూవీ మేకర్స్ తో పాటు దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) కూడా ఎఫెక్ట్ అవుతారు అంటూ తెలిపారు వేణు స్వామి.
సినీ పరిశ్రమకు కూడా తప్పని తిప్పలు..
అంతేకాదు ఉగాది నుండి శని తులారాశిలోకి వెళ్లడం వల్ల తెలుగు సినీ పరిశ్రమ, తెలుగు రాజకీయాల మీద కూడా ఎఫెక్ట్ ఉంటుందని, అసలైన సినిమా ముందుంది ఇప్పటివరకు కేవలం టైటిల్ , ట్రైలర్స్ మాత్రమే పడ్డాయి.. మార్చి 30 నుంచి మరిన్ని చూడబోతున్నాము అంటూ హాట్ బాంబు పేల్చారు వేణు స్వామి. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నిజానికి వేణు స్వామి చెప్పిన మాటలన్నీ నిజమవుతాయా అంటే చెప్పలేని పరిస్థితి.ఎందుకంటే గతంలో ఈయన చేసిన కామెంట్లలో కేవలం కొన్ని మాత్రమే నిజమయ్యాయి. కాబట్టి ఇప్పుడు వేణు స్వామి చెప్పిన మాటలు నూటికి నూరు శాతం నిజమవుతాయి అనడంలో ఆధారాలు లేవని ఫాన్స్ కొట్టి పారేస్తున్నారు. ఏది ఏమైనా వేణు స్వామి మళ్లీ ఇలాంటి కామెంట్లు చేసి చిక్కుల్లో పడ్డారేమో అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">