SSMB 29: దిగ్గజ దర్శకుడు రాజమౌళి (Rajamouli).. ఎన్టీఆర్(NTR ), రామ్ చరణ్ (Ram Charan)తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేసి ప్రపంచ స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటించి ఊహించని ఇమేజ్ తెచ్చి పెట్టిందని చెప్పవచ్చు. అంతేకాదు అటు రామ్ చరణ్ ఇటు ఎన్టీఆర్ ఇద్దరూ కూడా ఒక సినిమాతో గ్లోబల్ స్టార్స్ అయిపోయారు. అలాంటి దిగ్గజ దర్శకుడు ఇప్పుడు మహేష్ బాబు (Maheshbabu) తో సినిమా చేయడానికి సిద్ధం అయిపోయారు. మహేష్ బాబు కూడా నిన్న మొన్నటి వరకు కేవలం టాలీవుడ్ కే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏకంగా పాన్ వరల్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడుతున్నారని చెప్పవచ్చు. దీనికి తోడు ఈ సినిమా కోసం దాదాపు రెండు మూడు సంవత్సరాల సమయాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది.
రాజమౌళి మూవీ కోసం కష్టపడుతున్న మహేష్ బాబు..
ఈ నేపథ్యంలోనే పూర్తిగా రాజమౌళి సినిమా కోసమే సమయాన్ని కేటాయించిన మహేష్ బాబు.. గత కొన్ని నెలలుగా ఈ సినిమా కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నారు. అంతేకాదు తన లుక్ సైతం మార్చేశారు. ఇకపోతే ‘ఎస్ఎస్ఎంబి 29’ అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్గా నటిస్తోంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. దీంతో మహేష్ బాబు ఎలాంటి పాత్రలో నటించబోతున్నారు? అసలు ఈ సినిమా ఎలా ఉంటుంది? కథ ఏంటి? అని తెలుసుకోవాలనే ఆసక్తి ఇప్పుడు అభిమానులతో పాటు ప్రేక్షకులలో కూడా నెలకొంది. దీంతో ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందా అని అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూశారు. అలాంటి వారికి తాజాగా మహేష్ బాబుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సింహం సిద్ధం అయింది.. మహేష్ బాబు లుక్ వైరల్..
మహేష్ బాబు జిమ్ములో వర్కౌట్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో మహేష్ బాబు లాంగ్ హెయిర్ లో అదరగొట్టేశాడు.” సింహం సిద్ధం అవుతోందని” మహేష్ బాబు అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే రాజమౌళి సినిమా కోసం మహేష్ బల్క్ గా మారుతున్నారు అందుకే శరీరాన్ని కూడా భారీగా పెంచుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇది చూసిన అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు. మొత్తానికైతే ఇప్పటివరకు సాఫ్ట్ బాయ్ గా కనిపించిన మహేష్ బాబు ఒక్కసారిగా సింహంలా మారిపోయారు అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం . మహేష్ బాబు లుక్ ఎక్కడ రివీల్ కాకుండా ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు మహేష్ బాబు లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని బట్టి చూస్తే ఈ పాత్రలో ఆయన ఇలాంటి గెటప్ లోనే కనిపించబోతున్నారని స్పష్టం అవుతోంది. మొత్తానికి అయితే రాజమౌళి కూడా చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఆస్కార్ టార్గెట్ గా సిద్ధమవుతున్న వీరిద్దరూ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటారో చూడాలి.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">