BigTV English

Idli Sambar Goa beach : ఇడ్లీ సాంబార్‌తోనే విదేశీ పర్యాటకులు తగ్గిపోతున్నారు.. గోవా మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Idli Sambar Goa beach : ఇడ్లీ సాంబార్‌తోనే విదేశీ పర్యాటకులు తగ్గిపోతున్నారు.. గోవా మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Idli Sambar Goa beach | గోవా బీచ్‌లో ఇడ్లీ-సాంబార్‌, వడా పావ్‌లు విక్రయించడాన్ని తప్పుబడుతూ బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్‌ లోబో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గోవాలో కొంతకాలంగా పర్యటకులు ముఖ్యంగా విదేశీ పర్యటాకుల సంఖ్య తగ్గడంపై స్థానిక ఎమ్మెల్యే మైఖేల్‌ లోబో ఆందోళన వ్యక్తం చేస్టూ ఈ విధంగా స్పందించారు. గోవా బీచ్‌‌లలో ఇడ్లీ-సాంబార్‌, వడా పావ్‌లు వంటి దేశీల అల్పహారం విక్రయించడం వల్లే విదేశీ పర్యటకుల సంఖ్య తగ్గిందని ఆయన అన్నారు. నార్త్‌ గోవాలోని కలంగూట్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.


ఈ కార్యక్రమంలో గోవా పర్యటన స్థలాల్లో ఇడ్లీ-సాంబార్‌, వడా పావ్‌ల విక్రయాలు అమ్మకంపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. బెంగళూరు నుంచి వచ్చినవారు బీచ్‌ దుకాణాల్లో వడా పావ్‌లు అమ్ముతున్నారని, మరికొందరు ఇడ్లీ-సాంబార్‌ విక్రయిస్తున్నారని బిజేపీ మంత్రి లోబో చెప్పారు. అందుకే, గత రెండేళ్లుగా గోవాకు విదేశీ పర్యటకుల సంఖ్య తగ్గిపోయిందని అభిప్రాయపడ్డారు.

పర్యటకులు తగ్గడంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. అయితే, పర్యాటకంపై ఇడ్లీ-సాంబార్‌ విక్రయాలు ఏవిధంగా ప్రభావం చూపుతున్నాయన్న విషయాన్ని ఆయన వివరించలేదు.. కానీ దీంతో పాటు అనేత కారణాలున్నాయని చెప్పారు. గోవా బీచ్ లను తిలకించేందుకు వచ్చే రష్యా, ఉక్రెయిన్‌ పర్యాటకులు కూడా యుద్ధం కారణంగా రావడం లేదన్నారు. గోవాలో విదేశీ పర్యటకుల సంఖ్య తగ్గి పోవడానికి ప్రభుత్వానిదే మొత్తం బాధ్యత కాదని.. దీనికి అందరూ బాధ్యులేనని ఎమ్మెల్యే లోబో పేర్కొన్నారు.


Also Read: కేవలం చట్టాలతో మహిళలకు రక్షణ కల్పించలేం.. అత్యాచార ఘటనలపై మాజీ సిజెఐ

ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి గోవా వాసులు తమ దుకాణాలను అద్దెకు ఇవ్వడంపై ఆయన మండిపడ్డారు. “ఈ పరిస్థితి రావడానికి మేమంతా తప్పుచేశామని అంగీకరించాలి. తప్పుచేశాం కాదు.. చేస్తూ ఉన్నాం. బీచ్ దుకాణాల్లో ఇడ్లీ సాంబార్ విక్రయించడం ప్రారంభించాం. దీన్ని ఆపాలి. గోవా వాసులైన దుకాణాల ఓనర్లు వాటిని ఇతర రాష్ట్రాల వారికి అద్దెకు ఇచ్చేస్తున్నారు. ఇలా చేస్తే ఇంకేముంది. ఇడ్లీలు కావాలంటే మెయిన్ రోడ్ పక్కన అమ్ముకోండి. కానీ బీచ్ లో విక్రయించే వంటకాలు వేరే. అది గోవా ఫుడ్ అయి ఉండాలి లేదా సీ ఫుల్, కాంటినెంటర్ లాంటి విదేశీ వంటకాలై ఉండాలి. వచ్చే టూరిస్టులు అవి తినడానికే ఇష్టపడతారు. అంతేకానీ హైదరాబాద్, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల సంస్కృతి చూసేందుకు వారు ఇక్కడికి వస్తారా?.. శ్రీలంక వెళ్లి చూడండి. అక్కడ టూరిజం చూడండి. ఇండియా కంటే చాలా చిన్న ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశం. ఇప్పుడు గోవాకు విచ్చేసే టూరిస్టులంతా శ్రీలంక వెళ్లడానికి ఇష్టపడుతున్నారు.

గోవా బీచ్ లలో వీధి కుక్కలు తిరుగుతున్నాయి. ఏదైనా పర్యాటక బీచ్ లున్న దేశానికి వెళ్లి చూడండి. అక్కడ వీధి కుక్కలు తిరుగుతూ కనిపిస్తాయా?.. ఈ సమస్య గురించి పర్యాటక శాఖను ప్రశ్నిస్తే.. అది పశుసంవర్థక శాఖ సమస్య అని చెబుతారు. పశుసంవర్థక శాఖను ప్రశ్నిస్తే.. స్థానిక గ్రామ పంచాయితీ బాధ్యత అని అంటారు. బీచ్ లలో వీధి కుక్కలు దాడి చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. విదేశీ పర్యాటకులు రాకపోవడానికి ఇది కూడా ఒక కారణం.” అని మంత్రి లోబో ఆగ్రహం వ్యక్తం చేశారు.

గోవాకు విదేశీ పర్యటకుల సంఖ్య తగ్గడంపై కారణాలు అన్వేషించేందుకు టూరిజం శాఖతో సహా భాగస్వామ్య పక్షాలు సంయుక్తంగా భేటీ అయి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక ట్యాక్సీలు, క్యాబ్‌ల మధ్య అనేక సమస్యలు ఉన్నాయని, ఈ పరిస్థితులను సరిదిద్దక పోతే పర్యటకానికి చీకటి రోజులేనని ఆయన హెచ్చరించారు. మైఖేల్‌ లోబో చేసిన ఈ వ్యాఖ్యలు వేరే రాష్ట్రాల వారిపై ద్వేషాన్ని, వ్యతిరేకతను ప్రేరేపించేలా ఉన్నాయంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×