Vishwak Sen : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మల్టీ టాలెంటెడ్ హీరోస్లో విశ్వక్సేన్ ఒకరు. కేవలం నటుడు గానే కాకుండా దర్శకుడుగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. వెళ్ళిపోమాకే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి నటుడుగా ఎంట్రీ ఇచ్చిన విశ్వక్సేన్ ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు. వివేక్ పాత్రలో కనిపించిన విశ్వక్సేన్ చాలామందికి దగ్గరయిపోయాడు. ఆ తర్వాత తనలో దర్శకత్వ ప్రతిభను బయటకు తీసి ఫలక్నామా దాస్ సినిమాను తీశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. విశ్వక్సేన్ కెరియర్లో మంచి క్వాలిటీ సినిమాలు ఉన్నాయి. అయితే ప్రతి సినిమాకి యాదృచ్ఛికంగా జరుగుతుందో లేదా కావాలని చేస్తున్నారు తెలియదు కానీ ఏదో ఒక వివాదం వెంటాడుతూనే ఉంటుంది.
విశ్వక్సేన్ రీసెంట్ గా నటించిన సినిమా లైలా. విశ్వక్సేన్ కెరియర్ లో అతిపెద్ద డిజాస్టర్ సినిమా ఇది అని చెప్పొచ్చు. సినిమా మొదటి షో పడినప్పుడు నుంచి కంప్లీట్ నెగిటివ్ దాక వచ్చింది. కొంతమంది విశ్వక్సేన్ ను ట్రోలింగ్ కూడా చేశారు. ప్రతి సినిమాకు విమర్శలు రావడం అనేది కామన్ గా జరుగుతుంటుంది. అప్పుడు విశ్వక్ బయటికి వచ్చి స్పందించేవాడు. కానీ ఈ సినిమా జెన్యూన్ రిజల్ట్ విశ్వక్సేన్ కు కూడా అర్థమైపోయింది అందుకని చాలా సైలెంట్ అయిపోయాడు. అయితే ఈ డిజాస్టర్ తర్వాత విశ్వక్సేన్ తన కెరియర్ ను మరింత పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పొచ్చు. విశ్వక్సేన్ కెరియర్ లో పర్ఫెక్ట్ సినిమాలను ప్లాన్ చేసుకున్నాడు.
Also Read : Vijay Devarakonda : విజయ్ దేవరకొండ తో కిల్ డైరెక్టర్ నిఖిల్ నగేష్ భట్ సినిమా.?
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనుదీప్ కేవీ దర్శకుడుగా ఫంకీ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు అనుదీప్ జాతి రత్నాలు సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు. ప్రిన్స్ సినిమా సరైన కమర్షియల్ సక్సెస్ సాధించకపోయిన కూడా తెలుగులో మంచి పేరుని సాధించింది. ఇప్పుడు అనుదీప్ నుంచి సినిమా వస్తుంది అంటే క్యూరియాసిటీతో ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ ఎలా కనిపిస్తాడు అని క్యూరియాసిటీ కూడా చాలామందికి ఉంది. ఈ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఈ నగరానికి ఏమైంది సీక్వెల్లో నటించిన ఉన్నాడు. ఆ తర్వాత దాదాపు ఒకటి రెండేళ్లు ఫలక్నామా దాస్ సీక్వెల్ కోసం ప్రీ ప్రొడక్షన్ కు టైం ఇచ్చి సినిమాను పగడ్బందీగా ప్లాన్ చేయాలని చూస్తున్నాడు. అయితే ఈ మూడు ప్రాజెక్టులు కూడా ఎంతో కొంత అంచనాలను క్రియేట్ చేసేవే. వీటితోనే ముందుకెళ్తాడా లేదంటే మరో కమిట్మెంట్స్ తో సినిమా చేస్తాడా అని ఇంకా క్లారిటీ లేదు. దీనిపై విశ్వక్సేన్ ఏమైనా స్పందిస్తాడేమో వేచి చూడాలి.
Also Read : Tammreddy Bharadwaja : కాస్టింగ్ కౌచ్ పై తమ్మారెడ్డి భరద్వాజ్ రియాక్షన్, ఆ నీచపు పని నేను చేశాను