Vijay Devarakonda : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో అంటే విజయ్ దేవరకొండ అని చెప్పాలి. ముందుగా చిన్న చిన్న సినిమాల్లో కనిపించి పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత విజయ్ చేసిన అర్జున్ రెడ్డి సినిమా ఒక సెన్సేషన్. ఆ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రస్తావన తీసుకొస్తూ శివ సినిమా తర్వాత శివ సినిమాకు ముందు అని ఎలా చెప్తామో, అర్జున్ రెడ్డి సినిమా కూడా అంతే స్థాయిలో గుర్తింపు లభించింది. అక్కడితోనే సందీప్ రెడ్డి వంగ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. సౌత్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయడమే కాకుండా బాలీవుడ్ లో కూడా తన ప్రభంజనం చూపించాడు సందీప్. ఇక ప్రస్తుతం సందీప్ ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస డిజాస్టర్ సినిమాలు చేస్తున్నాడు. విజయ్ కెరియర్ లో సరైన హిట్ సినిమా పడి చాలా ఏళ్లయింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎటువంటి ఫలితాన్ని అందుకుందో అందరికీ తెలిసిన విషయమే. ఆ సినిమా తర్వాత చేసిన కృషి సినిమా ఖుషి అంతంత మాత్రమే ఆడింది. ఒక పరశురాం దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ మంచి లైన్ అప్ సెట్ చేశాడు. యంగ్ డైరెక్టర్స్ అందరితో కూడా చేతులు కలుపుతూ కెరియర్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాడు అని చెప్పాలి. గౌతం దర్శకుడుగా ప్రస్తుతం కింగ్డమ్ అనే సినిమాను చేస్తున్నాడు విజయ్. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ వీడియో కూడా రీసెంట్ గా రిలీజ్ అయిందని సప్రైజ్ చేసింది. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read : Laila: భారీ దెబ్బ కొట్టిన విశ్వక్ లైలా.. భోజనాల ఖర్చులు కూడా రాలేదా..?
రాజావారు రాణి గారు సినిమాతో దర్శకుడుగా పరిచయమైన రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమాను చేయాల్సి ఉంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తుంది. రాహుల్ దర్శకత్వంలో మరో సినిమాను చేయబోతున్నట్లు కూడా ఇదివరకే ప్రకటించారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించాల్సి ఉంది. ఈ సినిమాలతో పాటు రీసెంట్ గా మరో కథను కూడా విజయ్ ఓకే చేసినట్లు సమాచారం వినిపిస్తుంది. కిల్ సినిమా డైరెక్టర్ నిఖిల్ నగేష్ భట్ రెండు వారాల క్రితం హైదరాబాద్ వచ్చి విజయ్ దేవరకొండను కలిశారు. ఒక కథను చెప్పినట్లు దానికి విజయ ఇంప్రెస్ అయినట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమాకు కరణ్ జోహార్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారు. అన్నీ కుదిరితే విజయ్ ప్రస్తుత కమిట్మెంట్స్ తరువాత చేసే సినిమా ఇదే అవుతుంది అని విశ్వసినీయ వర్గాల సమాచారం.
Also Read : Shobhita dhulipala: అక్కినేని కోడలు కీలక నిర్ణయం.. వర్కౌట్ అవుతుందా..?