Tammareddy Bharadwaj : ప్రస్తుతం ఉన్న జనరేషన్ ఆడియన్స్ కి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ తమ్మారెడ్డి భరద్వాజ్ సినిమాలు అంటేనే సంచలనాత్మకంగా ఉండేవి. దాదాపు 20 సినిమాలకు పైగా ఆయన దర్శకత్వం వహించారు. ఎన్నో సామాజిక అంశాలను కూడా ఆయన సినిమాల్లో ప్రస్తావించేవాళ్ళు. ఆయన తీసిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించాయి. కేవలం దర్శకుడుగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలను నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి వంటి హీరోలతో పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. ఇక ప్రస్తుతం ఆయన సినిమాలు చేయడం తగ్గించేశారు. ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రతి విషయం పైన ఆయన తన సొంత ఛానల్ లో స్పందిస్తూ ఉంటారు. రీసెంట్ గా ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను తమ్మారెడ్డి భరద్వాజ్ చర్చించారు.
రీసెంట్ టైమ్స్ లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఎంత పెద్ద చర్చ జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. ఒక సందర్భంలో మొత్తం ఇండస్ట్రీ అంతా షేక్ అయింది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, నాని వంటి వాళ్ళ గురించి కూడా అనేక విమర్శలు వచ్చాయి. ఇకపోతే ఏదైనా రెండు రోజులే ఉంటుంది అన్నట్లు, దానికి సంబంధించిన వివాదం సద్దుమణిగిపోయింది. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ కోసం నేను పెద్ద ఫైట్ చేస్తాను అంటూ వచ్చిన శ్రీరెడ్డి కూడా దెబ్బతో చెన్నై చెక్కేసింది. అయితే ఇండస్ట్రీలో ఇంకా కాస్టింగ్ కౌచ్ గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. రీసెంట్ గా జానీ మాస్టర్ విషయంలో కూడా ఎంత పెద్ద వివాదం రేగిందో అందరికీ తెలిసిన విషయమే. వీటన్నిటి గురించి తమ్మారెడ్డి భరద్వాజ్ చర్చించారు.
Also Read : Kollywood: కూటి కోసం కోటి విద్యలు.. మిమిక్రీ ఆర్టిస్ట్ మొదలు రూ.100 కోట్ల రెమ్యునరేషన్..!
ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. ఒక డైరెక్టర్ కాస్టింగ్ కౌచ్ ఉంది అని బహిరంగంగా చెప్పారు అని అడిగినప్పుడు. ఒకవేళ ఆ దర్శకుడు పని చేసిన ప్రొడక్షన్ హౌసెస్ అలా ఉండి ఉండొచ్చు. ఆయనకి ఆ ఎక్స్పీరియన్స్ జరగొచ్చు. కానీ నేను నా ఎక్స్పీరియన్స్ లో అటువంటిది ఎప్పుడూ జరగలేదు. రివర్స్ లో నాకు కమిట్మెంట్ ఇస్తాము అన్న వాళ్ళు కూడా ఉన్నారు అంటూ తెలిపారు. ఇలా కమిట్మెంట్ ఇస్తాము అనేవాళ్ళు ఎలా తక్కువ మంది ఉంటారో, అలానే కమిట్మెంట్ ఇవ్వమని అడిగే వాళ్ళు కూడా తక్కువ మంది ఉంటారు వాళ్ళ బట్టి మనం డిసైడ్ చేయలేమంటూ చెప్పుకొచ్చారు. అలానే చాలా ఐటెం సాంగ్స్ గురించి కూడా మాట్లాడారు. బాలకృష్ణ సినిమాలో దబిడి దిబిడి సాంగ్ అనవసరం. అంతకుముందు భగవంత్ కేసరి బాగానే చేశారు కదా అని చెబుతూ.. అప్పట్లో నేను కూడా బంగారు మొగుడు అనే సినిమాలో ఇలాంటి నీచపు పనే చేశాను. ఆ పాటే చాలా దరిద్రంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read : Harish Shankar: తెలుగు ఆడియన్స్ పై డైరెక్టర్ విమర్శలు.. నెటిజెన్స్ ట్రోల్స్.. ఏమన్నారంటే?