BigTV English

Dear OTT: రెండు వారాల్లోనే ఓటీటీలోకి కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Dear OTT: రెండు వారాల్లోనే ఓటీటీలోకి కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Dear OTT: కరోనా కష్టకాలం తర్వాత ఓటీటీలకు మరింత ఆదరణ లభించింది. దీంతో కొత్త కొత్త సినిమాలను సైతం ప్రముఖ ఓటీటీ సంస్థలు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాయి. అంతేకాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో కొత్త సినిమాలు, సిరీస్‌లను సైతం రూపొందించి ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఒక సినిమా ఓటీటీలోకి వస్తుంది అంటే.. కొన్ని రోజుల ముందే అనౌన్స్ చేస్తారు. పలాన సినిమా పలాన రోజున స్ట్రీమింగ్ కాబోతుంది అంటూ ప్రేక్షకాభిమానులను అలర్ట్ చేస్తారు.


కానీ ఈ మధ్య అలా జరగడం లేదు. కొత్త సినిమాలు సైతం ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే చాలా బడా హీరోలు, చోటా హీరోల సినిమాలు సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ అందించాయి. ఇందులో భాగంగానే తాజాగా మరో సినిమా ఎలాంటి ప్రకటన లేకుండా సైలెంట్‌గా ఓటీటీ ఆడియన్స్ ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అదే ‘డియర్’ మూవీ. జీవీ ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ జంటగా ఈ మూవీలో నటించారు.

ఈ మూవీ ఇటీవలే ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజ్ అయింది. కామెడీ మూవీగా తెరకెక్కి అందరినీ బాగా అలరించింది. గురక సమస్యే ప్రధాన కారణంగా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కాస్త కామెడీని జోడించి దర్శకుడు ఆనంద్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఎన్నో అంచనాలతో తెరకెక్కిన ఈ మూవీ ఆశించినంత స్థాయిలో హిట్ కాలేకపోయింది. ఈ చిత్రంలో ఏది కరెక్ట్‌గా చూపించాలో అది చూపించలేక.. ప్రజెంట్ చేయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు.


Also Read: మరొక కొత్త సినిమాతో అనుబ్యూటీ.. కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేయనున్న సామ్

దీంతో ఈ మూవీ పెద్దగా హిట్ కాలేకపోయింది. అందువల్ల ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఇక ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండు వారాలు మాత్రమే అవుతుంది. దీంతో ఈ రెండు వారాల గ్యాప్‌లోనే ఈ డియర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నెల 28 (ఏప్రిల్ 28)న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×