Big Stories

Rohmalia Breaks Record: ఇండోనేషియా అమ్మాయి అదుర్స్ .. ఒక్క పరుగు ఇవ్వకుండా.. 7 వికెట్లు

“7” Wickets for “0” Runs – Indonesian Bowler Rohmalia Creates World Record: ఇది కలా? నిజమా? అని అనుకుంటున్నారా? అవునండీ అవును.. ఇది నిజమే.. అయితే ఇది అబ్బాయిలు సాధించలేదు. అమ్మాయిలు సాధించారు. ఇంతకీ విషయం ఏమిటంటే బాలీ బాష్ గా పిలిచే టోర్నీలో ఇండోనేషియా వర్సెస్ మంగోలియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండోనేషియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.

- Advertisement -

152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు మంగోలియా బయలుదేరింది. కానీ ఇంతకుముందు మనం అనుకున్నాం కదా.. ఒకమ్మాయి ఒక్క పరుగు ఇవ్వకుండా 7 వికెట్లు తీసింది. అని.. ఆమె పేరేమిటంటే రొహ్మాలియా. తనేం మ్యాజిక్ చేసిందో తెలీదు, ఎలాంటి బాల్స్ వేసిందో తెలీదు, అది పిచ్ మీద ఎలా తిరిగాయో తెలీదు, మొత్తానికి అందరూ చాప చుట్టేశారు.

- Advertisement -

తను 3.2 ఓవర్లు వేసింది. అంటే 20 బాల్స్ మాత్రమే వేసింది. అందులో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. మూడు ఓవర్లు మెయిడిన్స్ వేసింది. అలాగే ఫటాఫట్ 7 వికెట్లు తీసేసింది. అంతే ఆశ్చర్యపోవడం అందరి వంతు అయ్యింది. ఆమె దెబ్బకి మంగోలియా 16.2 ఓవర్లలో కేవలం 24 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చెయ్యలేదు. ఎక్స్ ట్రాలు మాత్రం 10 రావడం వల్ల అవైనా చేశారని అంతా అంటున్నారు.

Also Read: సన్‌రైజర్స్‌కు బ్రేక్.. ఆర్సీబీ గెలిచిందోచ్‌..

అంతర్జాతీయ టీ 20 మ్యాచ్ ల్లో పురుషులు-మహిళల్లో చూస్తే ఇవే అత్యుత్తమ గణాంకాలు. ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ గుర్తింపు పొందిన ఏ జట్టు తరఫున ఇలాంటి గణాంకాలు ఇప్పటివరకు నమోదు కాలేదు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, తనకి ఇది రెండో మ్యాచ్ మాత్రమే. అప్పుడే ఇంత అద్భుతం చేసేసరికి అందరూ  ఆశ్చర్యపోతున్నారు.

ఇప్పటివరకు పురుషుల క్రికెట్ లో మలేషియాకు చెందిన మీడియం పేసర్ సయాజ్రుల్ ఇడ్రస్ 4 ఓవర్లలో 8 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీసుకున్నాడు. టీ 20 ప్రపంచ కప్ ఆసియా బి క్వాలిఫయర్స్ ప్రారంభమ్యాచ్ లో ఈ ఫీట్ సాధించాడు.

అంతకుముందు నెదర్లాండ్ క్రికెటర్ ఫ్రెడ్రిక్ ఓవర్ధిక్ 4 ఓవర్లు వేసి కేవలం 3 పరుగులే ఇచ్చి 7 వికెట్లు తీశాడు.

భారత ఆటగాడు దీపక్ చాహర్ 2019లో బంగ్లాదేశ్‌పై ఇలాంటి ఫీట్ సాధించాడు కానీ 7 వికెట్లు తీయలేదు. 6 వికెట్లే తీశాడు. కానీ 7 పరుగులు సమర్పించుకున్నాడు.

మొత్తానిక అమ్మాయి అదుర్స్ అనిపించింది. అసలు మగవాళ్లకే గానీ  ఆడవాళ్లకు క్రికెట్ పనికిరాదని చెప్పేవాళ్లకి తగిన సమాధానం రొహ్మాలియా చెప్పిందని నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News