Gaddar Film Awards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ప్రధానోత్సవం హైదరాబాద్ హైటెక్స్ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభం అయింది. ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు (Dilraju ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు సుమారుగా 5000 మందికి పైగా సెలబ్రిటీలు హాజరయ్యారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఈ గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమానికి.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ముఖ్య అతిథిగా విచ్చేశారు. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క(Batti Vikramarka), సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy venkatareddy) తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇకపోతే సినీ తారల రాకతో ఈ హైటెక్స్ ప్రాంగణం మొత్తం సందడిగా మారింది.
ఆ సందర్భం కోసమే అందరి ఎదురుచూపు..
ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఎవరికి ఏ విభాగంలో అవార్డు లభిస్తుంది అనే విషయంపై ఎఫ్ డి సి జ్యూరీ సభ్యులు జయసుధ (Jayasudha), మురళీమోహన్ (Murali Mohan) మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పుడు వారంతా కూడా ఈ వేదికపై అవార్డు అందుకోనున్నారు. అయితే ఇక్కడ అందరి దృష్టి అల్లు అర్జున్(Allu Arjun) పైనే అని చెప్పాలి. ఎందుకంటే టాలీవుడ్ లో తొలి నేషనల్ అవార్డు అందుకున్న హీరోగా రికార్డ్ సృష్టించిన ఈయనకి.. అదే ఉత్తమ నటుడు విభాగంలో ఇప్పుడు గద్దర్ అవార్డు కూడా వరించడం నిజంగా ప్రశంసనీయమని చెప్పాలి. ఇకపోతే అల్లు అర్జున్ నటనకు ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే.. ఇక్కడ ఇది కాదు ప్రశ్న.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అల్లు అర్జున్ అవార్డు అందుకుంటే.. ఆ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి అని అభిమానులే కాదు సినీ సెలబ్రిటీలు కూడా ఎదురు చూస్తున్నారు. ఇక ఆ తరుణం కూడా ఇప్పుడు వచ్చేసింది. ఉత్తమ నటుడు విభాగంలో పుష్ప సినిమాకి అల్లు అర్జున్ గద్దర్ అవార్డును సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు.
ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్న బన్నీ..
ఈ క్షణం కోసం ఎదురుచూసిన అందరి కల నెరవేరింది అని చెప్పాలి ముఖ్యంగా సీఎం చేతుల మీదుగా అల్లు అర్జున్ అవార్డు అందుకుంటున్న తీరును చూస్తే ఇద్దరి మధ్య సమస్యలు సద్దుమణిగినట్లు అనిపిస్తోంది. ఇద్దరి ముఖంలో తాండవిస్తున్న ఆ సంతోషం చూస్తుంటే.. ఇక గతంలో జరిగిన విషయాన్ని ఇద్దరు మర్చిపోయారని ఇటు అభిమానులు అటు సెలబ్రిటీలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఇద్దరి మధ్య సమస్య దానివల్లేనా?
ఇకపోతే సీఎం రేవంత్ రెడ్డి కి అల్లు అర్జున్ కి మధ్య గొడవకి గల కారణం ఏమిటి అంటే.. ‘పుష్ప 2’ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ 70mm సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కేసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కొడుకు శ్రీ తేజ్ ఇప్పటికీ ప్రాణాలతో పోరాడుతున్నారు. అయితే ఆరోజు అల్లు అర్జున్ పోలీస్ పర్మిషన్ తీసుకోకుండా తన సొంత బాడీగార్డ్ లతో.. పైగా ర్యాలీ నిర్వహించుకుంటూ సంధ్యా థియేటర్ కి రావడం వల్లే.. ఈయనను చూడడానికి అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడడం.. బాడీగార్డ్స్ వీరిపై దాడి చేయడం.. అక్కడ తోపులాట జరగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది అని పలువురు ఆరోపించారు.
దీంతో అల్లు అర్జున్ పై కేసు ఫైల్ అయింది. ఇక సెలబ్రిటీ అని కూడా చూడకుండా ప్రజలకు కష్టం వస్తే ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందే అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాదు ఒక రోజంతా జైల్లోనే మగ్గిపోయారు. ఇకపోతే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సినీ సెలబ్రిటీ లందరూ ఒక్కొక్కరిగా అల్లు అర్జున్ ని పరామర్శించారు కానీ చనిపోయిన బాధిత మహిళ కుటుంబాన్ని ఏ ఒక్క సెలబ్రిటీ పరామర్శించకపోవడంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ సమయంలో ఆయన అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ బాధిత మహిళ కుటుంబానికి ఆర్థిక సహాయం ప్రకటించాలి అని తెలిపిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచి వీరిద్దరికీ పడదు అని వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.
ఇది కదా అసలైన గద్దర్ అవార్డ్స్ వేడుకంటే..
కానీ ఇప్పుడు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కి అవార్డు వచ్చింది. రేవంత్ రెడ్డి చేతుల మీదుగానే ఆయన ఆ అవార్డు కూడా అందుకున్నారు. ఈ క్షణం కోసమే ఎదురుచూసిన అభిమానులకు ఇది కదా అసలైన సందర్భం అంటే.. ఇప్పుడే గద్దర్ అవార్డ్స్ వేడుకకు అసలైన కళ వచ్చింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:Kannappa Event : మా ప్రెసిడెంట్ కి గద్దర్ అవార్డ్స్ అంటే లెక్క లేదా? అసలేం మెస్సేజ్ ఇస్తున్నారు!