Indian Railways: తత్కాల్ రైలు టికెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకోవడానికి రైల్వేశాఖ కొత్త రూల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జూలై 1 నుంచి IRCTC అకౌంట్ తో ఆధార్ లింక్ చేసిన వారికి మాత్రమే తల్కాల్ టికెట్లను బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించనుంది. మోసాలను తగ్గించడం, అనధికార ఏజెంట్ల బుకింగ్‌ను నిరోధించడం, నిజమైన ప్రయాణీకులకు లబ్ది చేకూర్చమే లక్ష్యంగా ఈ నింబంధనను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఆధార్ ను IRCTC ఖాతాతో ఎలా లింక్ చేసుకోవాలి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
IRCTCని ఆధార్ తో లింక్ చేయాలంటే?
IRCTC అకౌంట్ తో ఆధార్ ను లింక్ చేయాలంటే.. ముందు మీ దగ్గర ఇవి ఉండాలి.
⦿ యాక్టివ్ IRCTC అకౌంట్
⦿ ఆధార్ నంబర్ లేదంటే వర్చువల్ ID
⦿ వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) పొందేందుకు అవసరమైన మొబైల్ ఫోన్
IRCTC అకౌంట్ తో ఆధార్ ను ఎలా లింక్ చేయాలి?
⦿ అధికారిక IRCTC వెబ్ సైట్ కు వెళ్లండి.
⦿ మీ ఆధారాలతో లాగిన్ అవ్వండి.
⦿ మై అకౌంట్ ట్యాబ్ కు వెళ్లి ప్రామాణీకరించు అనే ఆప్షన్ ను ఎంచుకోండి.
⦿ ఆ తర్వాత మీ ఆధార్ నంబర్ లేదంటే వర్చువల్ IDని నమోదు చేయండి.
⦿ వివరాలను ధృవీకరించండి.
⦿ ఆ తర్వాత ఓటీపీని జెనరేట్ చేయండి.
⦿ మీ ఫోన్ కు OTP వచ్చిన తర్వాత, దానిని ఎంటర్ చేయాలి.
⦿ ఆ తర్వాత యాక్సెప్ట్ ఫారమ్ ను సమర్పించాలి.
⦿ మీ ఆధార్ విజయవంతంగా ప్రామాణీకరించబడిన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
Read Also: విమానంలో ఇంధన ట్యాంక్ ఎక్కడ ఉంటుంది? ఎమర్జెన్సీ టైమ్ లో ఏం చేస్తారు?
IRCTC అకౌంట్ కు ఆధార్-ధృవీకరించబడిన ప్రయాణీకుడిని ఎలా యాడ్ చేయాలి?
మీ తత్కాల్ బుకింగ్ ను వేగంగా బుక్ చేసుకోవడానికి మీ మాస్టర్ జాబితాలో ప్రయాణీకుల వివరాలను ముందస్తుగా యాడ్ చేసుకుని, ఆధార్ ధృవీకరించవచ్చు. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ మీ IRCTC ఖాతాలోకి లాగిన్ అయిన తర్వాత, మై ప్రొఫైల్‌కు వెళ్లి మాస్టర్ లిస్ట్‌ను ఎంచుకోండి.
⦿ ప్రయాణీకుల వివరాలను – పేరు, పుట్టిన తేదీ, లింగం, వారి ఆధార్ కార్డులో ఉన్నట్లుగా ఎంటర్ చేయండి.
⦿ ID రుజువుగా ఆధార్ కార్డును ఎంచుకుని, ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
⦿ వివరాలను ఎంటర్ చేయండి. ప్రయాణీకుల ధృవీకరణ స్థితి మొదట పెండింగ్ గా చూపబడుతుంది.
⦿ ధృవీకరణ పూర్తయిందో లేదో తనిఖీ చేయడానికి, పెండింగ్ లో ఉన్న ఆధార్ ధృవీకరణ స్థితిని తనిఖీ చేసుకోవచ్చు.
⦿ వివరాలు ఆధార్ డేటాబేస్ తో సరిపోలిన తర్వాత, మీ స్టేటస్ ధృవీకరించబడిందిగా కనిపిస్తుంది.
ఒక ప్రయాణీకుడు ధృవీకరించబడిన తర్వాత, వారి వివరాలు బుకింగ్ సమయంలో మీ మాస్టర్ లిస్ట్ నుంచి నేరుగా అందుబాటులో ఉంటాయి. టికెట్లు ఎక్కువ డిమాండ్‌లో ఉన్నప్పుడు మీ టైమ్ ను సేవ్ చేయడంతో పాటు ఈజీగా టికెట్లు పొందేలా సాయపడుతుంది.
Read Also: దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్.. విశాఖ మెట్రో ప్రత్యేకతే వేరు!