Aiden Markram: ఆస్ట్రేలియా తో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025 ఫైనల్ లో సౌతాఫ్రికా ఛాంపియన్ గా నిలిచింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా ఓపెనర్ ఎయిడెన్ మార్కరమ్ సెంచరీతో చెలరేగాడు. బలమైన ఆస్ట్రేలియా పేస్ ఎటాక్ కి ఎదురొడ్డి నిలుచొని సెంచరీతో కదం తొక్కాడు. అతనికీ తోడు ప్రొటీస్ కెప్టెన్ టెంబ బవుమా సైతం హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. వీరిద్దరూ అద్భుతమైన బ్యాటింగ్ చేయడంతో డబ్ల్యూటీసీ రెండో టైటిల్ గెలవాలనే ఆసీస్ ఆశపై నీళ్లు చల్లారు. సౌతాఫ్రికా చేతుల్లోకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గద వచ్చేసింది. WTC ఫైనల్ లో ఆస్ట్రేలియా పై ఘన విజయం సాధించిన సౌతాఫ్రికా జట్టు విజేతగా నిలిచింది. ఈ విజయంలో మార్కరమ్ కీలక పాత్ర పోషించాడు. సౌతాఫ్రికా జట్టు 5 వికెట్ల తేడాతో ఆసీస్ ను లార్డ్స్ మైదానంలో చిత్తు చేసి తమ మొదటి ఐసీసీ ట్రోఫీ కలను సాకారం చేసుకుంది.
Also Read : MLC 2025 Bizarre Run-out : దున్నపోతు మీద వాన కొట్టినట్టే.. పోలార్డ్ దారుణంగా రనౌట్
27 ఏళ్ల తరువాత ఐసీసీ ట్రోఫీ..
2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ను సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ జట్టు 27 సంవత్సరాల తరువాత ఓ ఐసీసీ ట్రోఫీని సాధించింది. సౌతాఫ్రికా కే గర్వకారణం. ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ లో మొదటి రెండు రోజులు ఆస్ట్రేలియా ఆదిపత్యం కనిపించినప్పటికీ సౌతాఫ్రికా ఓపెనింగ్ బ్యాట్స్ మన్ మార్కరమ్ ఈ ఆటను పూర్తిగా మార్చేసాడు. మూడోరోజు అద్భుతమైన శతకం సాధించాడు. క్రీజులో నిలబడి తన జట్టు విజయాన్ని కూడా ఖాయం చేసాడు. కానీ చివరికీ విన్నింగ్ షాట్ మాత్రం కొట్టలేకపోయాడు. మార్కరమ్ 207 బంతుల్లో 136 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ అయిన మార్కరమ్.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం అద్భుతంగా ఆడాడు. మరోవైపు కెప్టెన్ బవుమా 134 బంతుల్లో 66 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించాడు.
గ్రౌండ్ లోనే లిప్ కిస్..
ఇప్పటివరకు ఒక్క ప్రపంచ కప్ కూడా సాధించని సౌతాఫ్రికా జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ టైటిల్ విజయం సాధించడంతో ఆ దేశ క్రికెట్ అభిమానులు సంబురాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మార్కరమ్ భార్య సౌతాఫ్రికా విజయం సాధించిన తరువాత భర్త మార్కరమ్ కి స్టేడియం వద్ద కిస్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం విశేషం. ముఖ్యంగా 213/2 స్కోర్ తో నాలుగో రోజు ఆటను ప్రారంభించింది సౌతాఫ్రికా జట్టు. 83.4 ఓవర్లలో 285 పరుగులు సాధించింది. విజయానికి 6 పరుగుల దూరంలో ఉండగా హేజిల వుడ్ బౌలింగ్ లో ట్రావిస్ హెడ్ డైవింగ్ చేసి క్యాచ్ అందుకోవడంతో మార్కరమ్ ఐదో వికెట్ గా వెనుదిరిగాడు. తరువాత బ్యాటర్ వచ్చి తన పూర్తి చేశాడు. తొలి ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా 212 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా 138 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో రెండో ఇన్నింగ్స్ లో 282 పరుగుల లక్స్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా పుంజుకొని విజయం సాధించింది. 27 ఏళ్ల తరువాత ఐసీసీ టైటిల్ గెలుచుకుంది.
Aiden Markram kiss his wife after won the ICC WTC Mace .!!♥️ pic.twitter.com/B3X0tnJ4bh
— MANU. (@IMManu_18) June 14, 2025