TNPL 2025 : సాధారణంగా క్రికెట్ లో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. కొన్ని సంఘటనలు చూస్తే.. మనం ఇలా కూడా క్రికెట్ ఆడుతారా..? అనే ఆలోచన తప్పకుండా వస్తుంది. క్రికెట్ అంటేనే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉంటాయి. కొన్ని సంఘటనలు నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని సంఘటనలు కాస్త భయంకరంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. ఇక మన ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఏ మూలకు వెళ్లినా.. ఏ గల్లి కి వెళ్లినా… క్రికెట్ మాత్రం కచ్చితంగా ఆడతారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇండియాలో క్రికెట్ ఆడతారు. క్రికెట్ ఆడడమే కాకుండా చూసే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. భారతదేశంలో… జాతీయ క్రీడ హాకీ అయినప్పటికీ… క్రికెట్ అంటేనే పడి చచ్చిపోతారు జనాలు. అంతలా జనాల రక్తాల్లోకి క్రికెట్ ఎక్కిపోయింది. అందుకే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లు చాలా సక్సెస్ అవుతున్నాయి. దానికి తగ్గట్టుగానే భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా గ్రౌండ్ స్థాయి క్రికెటర్లను కూడా.. పైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. భారత ప్రభుత్వం కూడా క్రికెట్ కి ప్రాధాన్యత ఇచ్చి అందరికీ ప్రోత్సాహాలు ఇస్తుంది.
Also Read : Unlucky 11 Number: 11వ నెంబర్ ఇంత దరిద్రమా… అందరి జీవితాలు తలకిందులు చేసిందిగా !
వరసగా 4 నో బాల్స్..
ఇదిలా ఉంటే.. గతంలో 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. భారత్ కి కపిల్ దేవ్ కెప్టెన్సీ హయాంలో 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టి వరల్డ్ కప్ తెచ్చుకుంది టీమిండియా. అలాగే టీ-20లో ఇంగ్లండ్ పై యువరాజ్ సింగ్ కూడా 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టాడు. 6 బంతుల్లో 6 సిక్సులు, 6 బంతుల్లో 6 ఫోర్లు కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ ఘటన మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. కానీ తాజాగా మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకోవడం విశేషం. అదేంటంటే..? TNPL ఓ బౌలర్ వరుసగా 4 నో బాల్స్ వేశారు. దీంతో అతను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమి పాలైంది. సేలం స్పార్టన్స్ విజయానికి చివరి 2 ఓవర్లలో 31 పరుగులు కావాలి. ఈ క్రమంలో తిరుప్పూర్ తమిలియన్స్ బౌలర్ ఎసక్కిముత్తు 19వ ఓవర్ బౌలింగ్ వేశారు. వరుసగా 4 నో బాల్స్ తో పాటు 25 రన్స్ ఇచ్చారు. దీంతో స్పార్టన్స్ కి చివరి ఓవర్ లో 6 రన్స్ కావాల్సి ఉండగా.. మరో బంతి ఉండగానే టార్గెట్ గా ఛేదించింది.
17 రకాల నో బాల్స్..
వాస్తవానికి క్రికెట్ లో మొత్తం 17 రకాల నో బాల్స్ ఉంటాయి. క్రికెట్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్లకు కూడా మహా అయితే నాలుగైదు రకాల నో బాల్స్ తెలిసి ఉంటాయి. అయితే ఆ నో బాల్స్ ఏంటి..? వాటిని ఎలా అంఫైర్లు ఎలా నోబాల్ ఇస్తారు. వీటిలో ఫ్రంట్ పుట్ నో బాల్, బ్యాట్స్ మెన్ తలపై నుంచి వెళ్లినా.. బీమర్ వేసినా, చకింగ్ చేసినా, బ్యాక్ ఫుట్ నో బాల్, ప్రమాదకరమైన షాట్ పిచ్ బాల్స్, అండర్ ఆర్మ్ నోబాల్, కీపర స్టంప్స్ ముందుకు వస్తే నోబాల్ ఇలా మొత్తం 17 రకాలుగా ఉంటాయి నో బాల్స్. కొన్ని సందర్భాల్లో బంతి కౌంట్ కాగానే ఇలా పరుగులు రావడం బ్యాట్స్ మెన్ టీమ్ కి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.