Mr. Celebrity: టాలీవుడ్ లో పరుచూరి బ్రదర్స్ గురించి తెలియనివారు ఎవరు ఉండరు. పరుచూరి గోపాల కృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు అన్నదమ్ములు. వారే పరుచూరి బ్రదర్స్ గా పేరు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో ఎన్నో మంచి సినిమాలకు స్టోరీలు అందించిన ఘనత వారికే సొంతం. ప్రస్తుతం వీరి హవా తగ్గింది. వెంకటేశ్వరరావు అనారోగ్య కారణాల వలన ఇంటికే పరిమిత్తమవ్వగా.. గోపాల కృష్ణ.. యూట్యూబ్ ద్వారా సినిమాల మీద అభిప్రాయాలు చెప్తూ అభిమానులకు దగ్గరగానే ఉంటున్నారు.
ఇక వీరి వారసుడుగా ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు సుదర్శన్ పరుచూరి. అతను హీరోగా తెరకెక్కుతున్న సినిమా మిస్టర్. సెలబ్రిటీ. చందిన రవి కిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్‌పి సినిమాస్ బ్యానర్ పై ఎన్. పాండురంగారావు, చిన్నరెడ్డయ్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. రీసెంట్‌గా ఈ మూవీ నుంచి విడుదల చేసిన టీజర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మిస్టర్ సెలెబ్రిటీ నుంచి మొదటి పాటను రిలీజ్ చేశారు. వినాయక చవితి స్పెషల్ గా గజానన అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
గణేష్ రాసిన ఈ పాటకు వినోద్ ఇచ్చిన బాణీ ఎంతో హుషారుగా అనిపించింది. ఇక మంగ్లీ తన వాయిస్ తో ఈ సాంగ్ ను ఎక్కడికో తీసుకెళ్లింది. ఈ పాటలో వరలక్ష్మీ శరత్ కుమార్ వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. చాలా రోజుల తరువాత వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంత ఎనర్జీగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది.
ఇక ఈ వీడియో సాంగ్‌ని చూస్తుంటే నిజంగానే ఉత్సవం జరిగినట్టు అనిపిస్తోంది. తెరపై ఈ పాట కచ్చితంగా ఓ పండుగలా ఉండబోతోందనిపిస్తోంది. ఇక ఈ వినాయక చవితి నవరాత్రుల్లో ఈ పాట మార్మోగిపోయేలా కనిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్లు ప్రకటించనున్నారు. మరి ఈ సినిమాతో సుదర్శన్ పరుచూరి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.