Gundeninda GudiGantalu Today episode May 22 nd: నిన్నటి ఎపిసోడ్ లో.. పార్వతి మీనాకు ఫోన్ చేసి శివ ఆ గుణ దగ్గరికి వెళ్తున్నాడు అని చెప్తుంది.. వాడి దగ్గరికి వెళ్తే మళ్లీ ఎన్ని సమస్యలు వస్తాయో వీడు చెప్పిన మాట వినట్లేదు అని పార్వతి ఫీల్ అవుతుంది. నువ్వేం బాధపడకు అమ్మ నేను వచ్చి వాడికి చెప్తాను కదా అని మీనా అంటుంది. అల్లుడు గారికి కూడా వాడి దగ్గర పని చేయడం అస్సలు ఇష్టం లేదు కదా వీడు చెప్పిన మాట వినట్లేదు నువ్వు అర్జెంటుగా రావాలి మీ నాని పార్వతి అంటుంది.. ఇక మీనా శివ బయటికి వెళ్తుంటే ఎదురుగా వస్తుంది. ఇప్పుడు చేయాలా ఉంది ఎక్కడికి వెళ్తున్నావ్ అసలు నువ్వు అని అడుగుతుంది. నేను జాబ్ కి వెళ్తున్నాను అక్క మరేం పర్లేదు నాకు అని శివ అంటాడు.. గుణ దగ్గరికి వెళ్లి ఇలా చేతులు కాళ్లు విరగొట్టుకోవడం అవసరమంటావా అని మీనా గట్టిగా అరుస్తుంది. నన్ను ఆపమని గుణ దగ్గరికి వెళ్లొద్దని మీ ఆయన చెప్పాడా నీకు అని శివ అంటాడు. దానికి కోపంతో రగిలిపోయిన మీనా మా ఆయన ఏంటి బావగారు అని అనలేవా అని అంటుంది. నన్ను కొట్టిన తర్వాత కూడా బావని ఎలా పిలుస్తారు అనుకున్నావా అని శివ అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రభావతి పై మీనా సెటైర్లు వేస్తుంది. దాని గురించి ఇంట్లో పెద్ద చర్చ జరుగుతూ ఉంటుంది అప్పుడే బాలు ఎంట్రీ ఇస్తాడు. పూల కొట్టుకి అద్ది బాల అంటూ ప్రభావతిని ఓ ఆట ఆడుకుంటాడు. ఇక తర్వాత ఇదిగోండి నాన్న మీ డబ్బులు అని శివ ఇచ్చిన డబ్బులను సత్యంకిస్తాడు బాలు. నా డబ్బులు ఏంట్రా ఎవరిచ్చారు ఏం డబ్బులు ఇవి అని సత్యం అడుగుతాడు.. ఒకరోజు ఈ అద్యావతికి మీ పెన్షన్ డబ్బులు ఇచ్చి వడ్డీ కట్టమని ఇచ్చారు కదా అవి ఎవరో దొంగలు తీసుకెళ్లారని చెప్పింది కదా అదే ఇవి అని అంటాడు. అవి పోయాయి కదా నీకు ఎలా వచ్చాయి అని సత్యం అడుగుతాడు. ఆ దొంగని పోలీసులు పట్టుకున్నారు ఆ డబ్బుల్ని తెచ్చి నాకు ఇచ్చారు నేను మీకు ఇచ్చాను అంతే.
ఇప్పటికైనా ఈ డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోండి. చాలామంది కళ్ళు ఈ డబ్బులు మీద పడ్డాయి తీసుకున్న తీసుకుంటారు జాగ్రత్త నానో అని బాలు అంటారు. ప్రభావతి మాత్రం ఆ దొంగ దొరికాడా ఎవడోడు ఎక్కడున్నాడు వాడు అని అడుగుతుంది. వాన్ని పోలీసులు పట్టుకొని జైలుకు పంపించారు ఒకవేళ నువ్వు కలవాలనుకుంటే జైలుకెళ్ళి కలువు అని ప్రభావతిని అంటాడు. ఈరోజు రెండుసార్లు జైలు అన్న మాట విన్నాను. భార్యను అన్నం కావాలి అంటే జైలుకెళ్లండి అంటుంది. నువ్వేమో జైలుకెళ్లండి అంటున్నావ్ అసలు ఏంట్రా ఇది ఏంటి గోల అని ప్రభావతి చిరాకు పడుతుంది.
ఇంతకీ ఆ దొంగ నువ్వు చూసావా అంటే లేదు చూడలేదు పోలీసులు నాకు ఈ డబ్బులు ఇచ్చారు ఆ దొంగని జైలుకు పంపించారు అని అంటాడు. రోహిణి కి మాత్రం బాలు చెప్పే దాంట్లో పొంతన లేకపోవడంతో ఎక్కడో అనుమానం మొదలవుతుంది. పోలీసులు నీకు డబ్బులు ఇచ్చారా ఆంటీ మీరు పోలీస్ కేసు పెట్టారా అని అడుగుతుంది. నేను పోలీసులకు చెప్పలేదమ్మా అని అనగానే.. నేను నాకు తెలిసిన ఒక కానిస్టేబుల్ ద్వారా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను ఇది బయటకు రానివ్వకుండా చూసుకోమని చెప్పాను. అతనే నాకు ఇప్పుడు ఈ డబ్బులు తెచ్చి ఇచ్చారు అని రోహిణి తో అంటాడు బాలు..
కానీ రోహిణి మాత్రం ఇది ఎలా నమ్మేలా లేదే అని అడుగుతుంది. మీ మలేషియా మావయ్య కూడా నమ్మిన లేడు కానీ మేము నమ్మలేదా ఇది అంతే అని బాలు రోహిణి అడ్డంగా ఇరికిస్తాడు. కానీ రోహిణి మాత్రం మనోజ్ తో కూడా అంటుంది. బాలు ఏదో దాస్తున్నాడు అని అంటుంది. కానీ మనోజ్ మాత్రం నా తమ్ముడు చాలా మంచివాడు అలాంటివాడు కాదు అని రోహిణి తో అంటాడు. అయితే ఇదంతా మీనా విని ఆలోచిస్తుంది.
బాలు శివ అన్న మాటని తలుచుకొని కోపంగా ఉంటాడు.. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళావా అని అడుగుతాడు. మా అమ్మ ఫోన్ చేస్తే వెళ్లాను ఏమైంది ఇప్పుడు ఏం జరిగిందండి అని అడుగుతుంది. తమ్ముడు నా దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడలేక ఆ గుణ దగ్గరికి వెళ్లొద్దని మీ భార్యతో నాకు చెప్పిస్తున్నావని వార్నింగ్ ఇచ్చాడు. వాడు ఇంత జరిగిన తర్వాత మళ్లీ మీ దగ్గరికి వచ్చాడా అసలు ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య అని అడుగుతుంది. వాడిని అడుగు వెళ్లేని బాలు అంటాడు. నువ్వు ఇంకొకసారి వాడున్న ప్లేస్ కి అంటే మీ పుట్టింటికి అసలు వెళ్ళకూడదు మీ అమ్మ చెల్లిని ఇక్కడికి రమ్మని చెప్పు లేదా గుడి దగ్గరికి వెళ్లి కలువు అని మీనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు..
మీనా శివ కి ఫోన్ చేసి ఏం జరుగుతుంది రా.. మీ బావ అలా అంటున్నాడు.. పుట్టింటికి వెళ్లోద్దని చెప్పాడు అని అంటుంది. దానికి శివ అయితే నువ్వు రావాల్సిన అవసరం లేదు అక్కడే ఉండు నువ్వు మీ ఆయన హ్యాపీగా చూస్తున్నాడు అన్నావు కదా అక్కడే హ్యాపీగా ఉండు.. మీలాగా మేము ఉండలేం నేను ఆ గుణ దగ్గరే పని చేస్తానని మీ నాకు చెప్తాడు.. నా గురించి నేను చూసుకోగలను నా మంచేది నా చెడేదో నాకు తెలుసు అని శివ అంటాడు. ఆ మాటలు విన్నా మీనా షాక్ అవుతుంది.. వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుంది తెలుసుకోవాలని మీనా అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో మనోజ్ ఉద్యోగం పోయినట్లు ప్రభావతికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..