BigTV English
Advertisement

This Week Theater Movies: ఈ వారం బాక్సాఫీసు వద్ద త్రిముఖ పోటీ.. హిట్టు కొట్టేదెవరో..?

This Week Theater Movies: ఈ వారం బాక్సాఫీసు వద్ద త్రిముఖ పోటీ.. హిట్టు కొట్టేదెవరో..?

Bhaje Vayu Vegam, Gam Gam Ganesha & Gangs Of Godavari Releasing on May 31st: ప్రతి ఏడాది సమ్మర్ సీజన్ వస్తే థియేటర్ల కళకళలాడేవి. సమ్మర్ హాలీడేస్‌లో పలు సినిమాలు ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధంగా ఉండేవి. అయితే ఈ ఏడాది అంతా బోసిపోయింది. సమ్మర్ సీజన్‌లో అంతగా ఏ సినిమాలు రాలేదు. ఒకవేళ చిన్న చిన్న సినిమాలు వచ్చినా ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెల మొత్తం బాక్సాఫీసు వద్ద సందడే కనిపించలేదు. చిన్న మూవీస్ వచ్చినా.. మెరుపుతీగలా వెళ్లిపోయాయి.


అయితే అందులోనూ రెండు తెలుగ రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి, అంతేకాకుండా ఐపీఎల్ సీజన్ కావడంతో చాలా పెద్ద సినిమాలు సైతం తమ రిలీజ్‌లను వెనక్కి జరుపుకున్నాయి. ఇక ఎలక్షన్స్, ఐపీఎల్ సీజన్ అయిపోయింది. ఇక మే 31 నుంచి థియేటర్లు దద్దరిల్లిపోయే సమయం వచ్చేసింది. ఇందులో భాగంగానే ఈ వారం పలు సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుక సిద్ధంగా ఉన్నాయి.

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకాభిమానుల్ని అలరించేందుకు రెడీ అవుతున్నారు. అందులో విశ్వక్ సేన్, ఆనంద్ దేవరకొండ, కార్తికేయ వంటి హీరోలు ఉన్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో విశ్వక్, భజే వాయు వేగంతో కార్తికేయ, గం గం గణేషా సినిమాతో ఆనంద్.. ఈ ముగ్గురు మంచి హిట్ కోసం ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు.


Also Read: విజయ్ తో పెళ్లి ఫిక్స్.. ఎట్టకేలకు బయటపెట్టిన రష్మిక.. ?

ఇందులో భాగంగానే ఆల్రెడీ పోస్టర్లు, గ్లింప్స్, టీజర్స్, సాంగ్స్ సహా ట్రైలర్లతో ఈ మూడు సినిమాలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ప్రస్తుతం వీటిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మూవీ మేకర్స్ కూడా ప్రమోషన్స్‌ను యమ జోరుగా కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా తమ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లకు స్టార్లను తీసుకొచ్చి సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు.

ఇటీవలే ఆనంద్ దేవరకొండ మూవీ గం గం గణేశా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నేషనల్ క్రష్ రష్మక వచ్చి సందడి చేసింది. ఆనంద్, రష్మిక ముచ్చట్లు బాగానే వర్కౌట్ అయ్యాయి. అంతా బాగా ఎంజాయ్ చేశారు. అలాగే తాజాగా విశ్వక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీకి బాలయ్య బాబు గెస్ట్‌గా వచ్చి సందడి చేశారు. ఇలా ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు స్టార్లను తీసుకువచ్చి తమ సినిమాపై అంచనాలు పెంచుకుంటున్నారు. ఇక ఈ మూడు సినిమాల్లో ఏ ఒక్క సినిమా హిట్ టాక్ వచ్చినా థియేటర్లు దద్దరిల్లిపోవడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read: Vijay Antony – Toofan Teaser: అత్యంత ఆసక్తికరంగా విజయ్ ఆంటోని ‘తుఫాన్’ టీజర్.. మాస్ యాక్షన్ సీన్లతో అదరిపోయింది

ఇప్పటికే విశ్వక్ గామి చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక ఆనంద్ బేబి సినిమాతో బాక్సాఫీసును షేక్ చేశాడు. దీంతో ఇప్పుడు మరి హిట్ అందుకుంటారో లేదో చూడాల్సిందే. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ మే 31న రిలీజ్ కానుంది. అలాగే గం గం గణేశా కూడా మే 31న రిలీజ్ కానుంది. కార్తికేయ భజే వాయు వేగం మూవీ కూడా మే 31 గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×