BigTV English

Anand Deverakonda: ‘బేబీ’ తర్వాత 25 మంది డైరెక్టర్లు నన్ను సంప్రదించారు: ఆనంద్ దేవరకొండ

Anand Deverakonda: ‘బేబీ’ తర్వాత 25 మంది డైరెక్టర్లు నన్ను సంప్రదించారు: ఆనంద్ దేవరకొండ

Anand Deverakonda in Gam Gam Ganesha Movie Promotion: స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ 2019లో వచ్చిన ‘దొరసాని’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ క్లాసిక్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’, ‘పుష్పక్ విమానం’ వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించాడు. అయితే ఈ సినిమాలేవి ఆనంద్ దేవరకొండకు పెద్దగా సక్సెస్ అందించలేదు. అయితే గతేడాది 2023లో వచ్చిన ‘బేబి’ సినిమా మాత్రం ఆనంద్ కెరీర్‌ను మార్చేసింది.


చిన్న బడ్జెట్‌తో.. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేసింది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ప్రముఖ సినీ దిగ్గజాలు సైతం ఈ మూవీని ప్రశంసించారు. ఈ చిత్రంతో ఆనంద్ దేవరకొండ పేరు మారుమోగిపోయింది. దీంతో వరుస సినీ ఆఫర్లు అందుకున్నాడు ఈ యంగ్ హీరో.

ఇందులో భాగంగానే ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నాడు. అదే ‘గం గం గణేశా’. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ సిక్స్ ప్యాక్‌తో కనిపించనున్నాడు. ఈ మూవీ మే 31న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆనంద్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.


Also Read: ఆనంద్ కామెడీ అదిరింది గురూ.. గంగం గణేశా ట్రైలర్ రిలీజ్..!

ఈ ఇంటర్వ్యూలో బేబి మూవీ మంచి విజయం సాధించిన తర్వాత మీ దగ్గరకు ఎవరైనా దర్శకులు వచ్చారా అని ఓ ప్రశ్న అడగ్గా.. బేబీ సినిమా తర్వాత తన దగ్గరకు పెద్ద దర్శకులెవరూ రాలేదని తెలిపాడు. ఎందుకో తనకు కూడా తెలీదన్నాడు. కాగా 100 మంది దర్శకులు తన వద్దకు వస్తే అందులో 50 మంది డెబ్యూ డైరెక్టర్లే అని పేర్కొన్నాడు. అయితే బేబీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తమిళ దర్శకులు ఎక్కువ మంది తనను సంప్రదించినట్లు తెలిపాడు.

అందులో దాదాపు 20 నుంచి 25 మంది వరకు తమిళ డైరెక్టర్లు తనతో సినిమా చేయాలని తనను కలిసినట్లు తెలిపాడు. అయితే ఆ సమయంలో తనకు చాలా సర్‌ప్రైజింగ్‌గా అనిపించిందని చెప్పుకొచ్చాడు. ఇక ఏది ఏమైనా బేబీ సినిమాతో రూ.100 కోట్లు రాబట్టడం చాలా ఆనందంగా ఉందని తెలిపాడు. ఇక తనకు ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి సినిమాలంటే చాలా ఇష్టమని.. వారిని ఇన్సిపిరేషన్‌గా తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు.

Tags

Related News

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big Stories

×