Game Changer: ఒకప్పుడు మేకర్స్ .. సినిమా లీకులను, ఫైరసీ బారిన పడిందని బాగా బాధపడేవారు. అప్పట్లో పెద్ద పెద్ద సినిమాలు ఫైరసీ బారిన పడిన విషయం కూడా తెల్సిందే. సినిమా రిలీజ్ కు ముందే అరగంట లీక్ అయిన అత్తారింటికి దారేది సమయంలో ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆ ఘటన అనంతరం ఫైరసీపై ఇండస్ట్రీ దృష్టి సారించింది. ఈ మధ్యకాలంలో ఆ ఫైరసీ కొద్దిగా తగ్గింది. అందులోనూ ఓటీటీ రావడంతో.. మూడువారాల్లో సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా.. అప్పుడే చూడొచ్చు అని ప్రేక్షకులు సైతం ఫైరసీ వైపు చూడడం లేదు. దీంతో ఇండస్ట్రీ కొద్దిగా చల్లబడింది.
ఇక ఇప్పుడు ఫైరసీ మరోసారి కోరలు చాచింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను తెచ్చుకున్న విషయం తెల్సిందే. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ సినిమా రిలీజ్ అవుట్ డేటెడ్ గా ఉందని, ఎప్పటిదో కథను ఇప్పుడు చూపించారని, అసలు ఏమి బాలేదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.
ఇక దీనికి తోడు.. రిలీజ్ అయిన రెండు రోజులకే గేమ్ ఛేంజర్ HD ప్రింట్ ను ఫైరసీ చేశారు. వెంటనే తగిన చర్యలు తీసుకొని ఆ ప్రింట్‌ను ఆన్‌లైన్ నుండి తొలగించేలా చేశారు నిర్మాతలు. కానీ వెంటనే మళ్లీ ఈ ప్రింట్ బయటికొచ్చింది. బస్సుల్లో సైతం ఈ సినిమాను ప్లే చేయడం జరిగింది. ఇక దీంతో సీరియస్ అయిన మేకర్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫైరసీ వెనుక చాలామంది హస్తం ఉందని టాక్ నడుస్తోంది.
Akkineni Nagarjuna: అన్నపూర్ణ స్టూడియోస్ కు 50 ఏళ్లు.. ఎమోషనల్ అయిన కింగ్.. వీడియో వైరల్
అసలే కలక్షన్స్ లేక, నెగిటివిటి పెరిగిపోయి ఉన్న ఈ సినిమాకు మరో దెబ్బ తగిలింది. కేవలం బస్సులో, ఆన్ లైన్ లోనే కాకుండా లోకల్ ఛానెల్స్ లో కూడా గేమ్ ఛేంజర్ సినిమా ప్రత్యక్షమయింది. దీంతో మెగా ఫ్యాన్స్ కొంతమంది ఫైర్ అవుతుండగా.. ఇంకొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అరేయ్ దారుణంరా.. మరీ లోకల్ ఛానెల్ లో ప్లే చేయడం ఏంట్రా.. ఇంత నెగిటివిటీ పనికిరాదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఫ్యాన్స్ తో పాటు ప్రముఖ నిర్మాత SKN కూడా ఈ ఘటనపై ఫైర్ అయ్యాడు.
” ఇది ఆమోదయోగ్యం కాదు. కేవలం 4-5 రోజుల క్రితం విడుదలైన ఒక సినిమా స్థానిక కేబుల్ ఛానెల్స్ లో, బస్సులలో ప్రసారం కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సినిమా అంటే కేవలం హీరో, దర్శకుడు లేదా నిర్మాతలే కాదు ..ఇది 3-4 సంవత్సరాల కృషి, అంకితభావం, వేలాది మంది కలల ఫలితం. ఈ సినిమాల విజయంపై ఆధారపడి జీవిస్తున్న డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబిటర్లపై పడే ప్రభావం గురించి ఆలోచించండి.
ఇలాంటి చర్యలు వారి ప్రయత్నాలను దెబ్బతీస్తాయి. ఇలాంటివి చిత్ర పరిశ్రమ భవిష్యత్తుకు ముప్పు కలిగిస్తాయి. గౌరవప్రదమైన ప్రభుత్వాలు దీనికి ముగింపు పలికేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సినిమాకి మంచి భవిష్యత్తును అందించడానికి మరియు భరోసా ఇవ్వడానికి అందరం ఏకం అవుదాం.. సేవ్ ది సినిమా” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
This is unacceptable. A film that was released just 4-5 days ago being telecasted on local cable channels & Buses raises serious concerns. Cinema is not just about the Hero, director or producers – it’s the result of 3-4 years of hard work, dedication and the dreams of thousands… https://t.co/ukPHIpi6ko
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) January 15, 2025