Medak district: ఉమ్మడి మెదక్ జిల్లాలో దొంగలు, తల్వార్లతో యువకులు హల్ చల్ సృష్టిస్తున్నారు. తరుచుగా ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దొంగలు బీభత్సం సృష్టిస్తూనే ఉన్నారు. ఇలాంటి ఘటనల వల్ల ఉమ్మడి జిల్లా ప్రజలు భయ బ్రాంతులకు లోనవుతున్నారు. రాత్రి వేళ గ్రామాలలోని కిారణ షాపులు, ఇళ్లను టార్గెట్ చేసుకొని దొంగతనానికి పాల్పడతున్నారు. తరుచుగా ఎక్కడో ఓ చోట దొంగతనాలు జరుగుతూ ఉన్నా పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదని జిల్లా ప్రజలు వాపోతున్నారు. రక్షణ పరమైన విషయాల్లో సరైన భద్రత లేకపోవడంతో జిల్లాలో దొంగతాలు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.
తాజాగా.. మెదక్ జిల్లాలో ఓ బ్యాచ్ తల్వార్లతో రెచ్చిపోయింది. జిల్లాలోని తుప్రాన్‌లో యువకులు తల్వార్లు పట్టుకుని కిరాణా షాపుపై దాడిచేశారు. షాపులోని గాలిపటాలను ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సిఉంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో రాత్రి సమయంలో పోలీసులు నగారాల్లో, మండలాల్లో , గ్రామాల్లో పెద్దగా పెట్రోలింగ్ నిర్వహించడం లేదని విమర్శలు వస్తున్నాయి. రోజుకు ఒక పోలీసు అధికారి విధులు నిర్వర్తించాలని నిబంధన ఉన్నప్పటకీ మండలాల్లో, గ్రామాల్లో పెద్దగా అమలు చేయడం లేదని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ప్రధానంగా జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారని.. గ్రామాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
Also Read: Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1267 ఉద్యోగాలకు ఇంకా రెండు రోజులే గడువు.. APPLY NOW
జిల్లాలో దొంగతనాలు, తల్వార్లతో షాపులపై ఎలాంటి దాడులు జరగకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీ చేయాలని ప్రజలు వేడుకుంటున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో దొంగతనాలు జరగకుండా చూడాలని కోరుకుంటున్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు దొంగలను గుర్తిస్తే.. ఇక ఇలాంటి సంఘటన జరగయని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.