Skill Census: యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది కూటమి సర్కార్. దేశంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చేపడుతున్న స్కిల్ సెన్సెస్ కార్యక్రమం మరో అడుగు ముందుకు పడింది. దీనికి అవసరమైన సాంకేతిక సహకారం అందించడానికి ఇన్ఫోసిస్ కంపెనీ ముందుకొచ్చింది.
ఎలాంటి ఆర్థిక వనరులతో సంబంధం లేకుండానే స్కిల్ సెన్సెస్‌లో ఏఐని ఉపయోగించనుంది. అభ్యర్థుల నైపుణ్యాల ముందస్తు ధృవీకరణ కోసం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను అందించేందుకు ఇన్ఫోసిస్-ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం కుదిరింది.
శుక్రవారం అమరావతిలో విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ- ఇన్ఫోసిస్ ప్రతినిధుల మధ్య ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద స్కిల్ సెన్సెస్ డాటా ప్రివాలిడేషన్‌కు ఇన్ఫోసిస్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. దీనిద్వారా యువత నైపుణ్యాలను అంచనా వేయవచ్చారు.
మార్కెట్ డిమాండ్‌కు తగ్గట్టుగా యవతకు స్కిల్ డెవలప్‌మెంట్ కింద ట్రైనింగ్ ఇవ్వడానికి మార్గం సులభతరం అవుతుందన్నారు. రాబోయే ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనలో భాగస్వామి కావడానికి ఇన్ఫోసిస్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ ప్రతినిధులు- స్కిల్ డెవలప్‌మెంట్ విభాగం అధికారులు హాజరయ్యారు.
ALSO READ: మరో వివాదంలో ఫైర్ బ్రాండ్ రోజా.. సొంత కార్యకర్తలపై చేయి చేసుకుని.. బూతులు తిడుతూ..
ఏపీలో యువత, మహిళల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు కూటమి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో గత సెప్టెంబర్ 30న పైలెట్ ప్రాజెక్టు చేపట్టింది. మంగళగిరి గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్ట్‌కు సర్వేను ప్రారంభించింది. దీనివల్ల యువతకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి అందించడం ద్వారా ఉద్యోగవకాశాలు లభించనున్నాయి.
నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్కిల్ డవలప్‌మెంట్ శాఖ- డీడాప్- న్యాక్ సిబ్బంది దీన్ని నిర్వహిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో మొత్తం లక్షా 61 వేల కుటుంబాల నుంచి ఎన్యుమరేటర్లు వివరాలను సేకరించారు. దీని కోసం ప్రత్యేకంగా యాప్ తయారు చేసిన విషయం తెల్సిందే.