E-Paper
Advertisement

Game Changer : వచ్చే ఏడాది సమ్మర్ కి గేమ్ ఛేంజర్ రిలీజ్ డౌటే.. మళ్లీ వాయిదా ?

Game Changer : వచ్చే ఏడాది సమ్మర్ కి గేమ్ ఛేంజర్ రిలీజ్ డౌటే.. మళ్లీ వాయిదా ?
Advertisement
Game Changer

Game Changer : ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ అయినా రామ్ చరణ్.. ఆ తర్వాత ఆచార్య మూవీలో కనిపించినా.. అది జీర్ణించుకోలేని డిజాస్టర్ గా మిగిలిపోయింది. దాంతో.. చెర్రీ అభిమానులు గేమ్ ఛేంజర్ సినిమాపై కొండంత ఆశలు పెట్టుకున్నారు. చరణ్ హీరోగా, కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా .. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా కాలమే అయినా.. ఇప్పటి వరకూ సరైన అప్డేట్ ఇవ్వలేదు.

అప్పుడప్పుడూ విడుదల చేసిన ఒకట్రెండు పోస్టర్లు మినహా.. ఇంకేం అప్డేట్ లేదు. ఫస్ట్ సింగిల్ గా జరగండి సాంగ్ ను దీపావళికి విడుదల చేస్తామన్నారు.. ఆ తర్వాత దాన్ని కూడా పోస్ట్ పోన్ చేశారు. విసిగిపోయిన అభిమానులు ఏదొక అప్డేట్ ఇవ్వండంటూ.. సోషల్ మీడియా వేదికగా నిర్మాతలను తిట్టిపోస్తున్నారు. ఇక సినిమా విడుదల సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలుత 2024 సంక్రాంతికి విడుదల చేస్తామన్నారు. ఆ తర్వాత సమ్మర్ కి వాయిదా వేశారు. సర్లే వేసవికైనా వస్తుంది కదా అని అభిమానులు ఎదురుచూస్తుంటే.. ఇప్పుడు అది కూడా జరిగేలా కనిపించడం లేదు. అందుకు కారణం ఇండియన్ 2 సినిమా.

Advertisement

కమల్ హాసన్ తో శంకర్ తీసిన ఇండియన్ 2 సినిమాను 2024 ఆగస్టులో రిలీజ్ చేస్తారని ప్రకటించేశారు. దాంతో గేమ్ ఛేంజర్ సినిమా ఆ తర్వాతే ఉంటుందని టాలీవుడ్ టాక్. ఇండియన్ 2 సినిమా పనులన్నీ పూర్తయ్యాకే శంకర్ గేమ్ ఛేంజర్ పై దృష్టి పెడతాడని తెలుస్తోంది. షూటింగ్ ఈలోగానే పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ పనులను మాత్రం ఇండియన్ 2 రిలీజ్ తర్వాతే చూసుకుంటారని తెలుస్తోంది. అంటే దాదాపు వచ్చే ఏడాది దసరాకో, దీపావళికో సినిమా విడుదల చేస్తారని సమాచారం. గేమ్ ఛేంజర్ రిలీజ్ అవ్వాలంటే ఇంకా సుమారుగా 11 నెలలైనా సమయం పడుతుంది. అసలే అప్డేట్స్ లేవు. చిత్రయూనిట్ స్పందించడం లేదు. సాంగ్స్ కూడా రిలీజ్ చేయట్లేదు. దాంతో.. గేమ్ ఛేంజర్ డైరెక్టర్, నిర్మాతలపై చెర్రీ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఇకనైనా గేమ్ ఛేంజర్ పై అప్డేట్స్ ఇస్తారో లేక ఇదే వైఖరి ఉంటుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×