BigTV English

Boomerang CEO : బూమరాంగ్ సీఈవోలతో లాభమెంత?

Boomerang CEO : బూమరాంగ్ సీఈవోలతో లాభమెంత?
Boomerang CEO

Boomerang CEO : టెక్ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ ఉద్వాసన, పునరాగమనం.. రెండూ చకచకా జరిగిన పరిణామాలే. సీఈవోలు.. ఆ మాటకొస్తే వ్యవస్థాపకులను సైతం అనూహ్యంగా తప్పించడం, తిరిగి వారికి ఆహ్వానం పలకడం సిలికాన్ వ్యాలీకి కొత్తేం కాదు. శామ్ ఆల్ట్‌మన్ ఉదంతం కన్నా ముందు ఇలాంటి ఘటనలు ఎన్నింటినో మనం చూడొచ్చు.


అయితే ఇంత వేగంగా.. అదీ రోజుల వ్యవధిలోనే పునరాగమనమనేది శామ్ వ్యవహారంలోనే చోటుచేసుకుంది. ఒకసారి తొలగింపునకు గురైన సీఈవోలు.. కొన్ని సంవత్సరాల అనంతరం తిరిగి తమ పదవుల్లోకి రావడం గతంలో జరిగింది. సంక్షోభాలు చుట్టుముట్టినప్పుడో, ట్రాన్సిషన్ సమయాల్లోనో కంపెనీలకు మాజీ ఎగ్జిక్యూటివ్‌లు గుర్తుకొస్తారు. డిస్నీ, స్టార్‌‌బక్స్ సీఈవోలు బాబ్ ఐగర్, హొవార్డ్ షుల్జ్‌‌ను ఇందుకు ఉదహరించొచ్చు. వీరిని ముద్దుగా ‘బూమరాంగ్ సీఈవో’లని టెక్ వర్గాలు పిలుచుకుంటుంటాయి.

ఇలా ఉద్వాసనకు గురై.. సొంత సంస్థలకు తిరిగొచ్చే వ్యవస్థాపకులు కూడా లేకపోలేదు. ట్విటర్ ఫౌండర్ జాక్ డోర్సే వారిలో ముఖ్యుడు. ట్విటర్ బోర్డు 2008లో ఆయనపై వేటు వేసింది. తిరిగి ఏడేళ్లకు సంస్థకు తిరిగొచ్చారు. డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, సీఈవో మైఖేల్ సాల్ డెల్ కూడా అంతే. 2004లో ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మూడేళ్ల అనంతరం బోర్డు ఆయనకు ఆహ్వానం పలికింది.


అయితే స్టీవ్ జాబ్స్ మినహా వేరెవరూ పునరాగమనం తర్వాత సక్సెస్ అయిన దాఖలాల్లేవు. 1976లో ఏర్పాటైన యాపిల్ సంస్థకు స్టీవ్ జాబ్స్ సహ వ్యవస్థాపకుడు. తొమ్మిదేళ్లకు సంస్థను వీడారు. ఆ తర్వాత యాపిల్ సంస్థ తీవ్ర ఒడుదొడుకుల్లో చిక్కుకుంది. 1997లో స్టీవ్ జాబ్స్ వచ్చిన తర్వాతే అది గాడిలో పడింది. ఐపాడ్, ఐఫోన్ వంటి వినూత్న ఉత్పత్తులను ఆయన ప్రవేశపెట్టడంతో ఆ సంస్థ ఇక వెనక్కి తిరిగి చూడలేదు.

స్టీవ్ జాబ్స్‌ను మినహాయిస్తే.. బూమరాంగ్ సీఈవోలు సహా తిరిగొచ్చిన వ్యవస్థాపకులెవరూ అనుకున్న రీతిలో నిలదొక్కుకోలేకపోయారు. తాము తొలిసారి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లుగా పని చేసినప్పటి పనితీరును కూడా ప్రదర్శించ లేకపోయినట్టు గత అనుభవాలు చెబుతున్నాయి. సీఈవోలుగా తమ సంస్థల్లో తిరిగి చేరిన వ్యవస్థాపకుల విషయంలో.. పలు సవాళ్లను చవిచూడాల్సి వచ్చిందని టెక్ నిపుణులు గుర్తు చేస్తున్నారు.

ఫౌండర్లు సహజంగానే ఆంత్రప్రెన్యూర్లు. పెద్ద పెద్ద టెక్ సంస్థలను నడిపేంత పాలనా నైపుణ్యం వారికి ఉండదనేది నిపుణుల నిశ్చితాభిప్రాయం. అయితే ఆల్ట్‌మన్ కేసు మాత్రం ఇందుకు భిన్నం. ఆయనను బూమరాంగ్ సీఈవోగా పరిగణించలేమని సిలికాన్ వ్యాలీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇతరుల్లా కాకుండా శామ్.. ఓపెన్ ఏఐను వీడింది కొన్ని రోజులే. అదీ గాక ‘పూర్ మేనేజర్’ అనేందుకు ఆయనపై ఎలాంటి మరకల్లేవు.

చాట్ జీపీటీ సృష్టికర్తగా టెక్ వర్గాల్లో పెనుసంచలనమే సృష్టించారు. ఓపెన్ ఏఐ సంస్థ విలువను 29 బిలియన్ డాలర్ల నుంచి 80 బిలియన్ డాలర్లకు చేర్చగలిగారంటేనే.. సీఈవోగా ఆయన సత్తా ఏ పాటిదో తెలిసిపోతోంది. ఏది ఏమైనా.. శామ్ పునరాగమనంతో వారం రోజులుగా ఓపెన్ ఏఐలో నెలకొన్న గందరగోళానికి ఫుల్‌స్టాప్ పడటం ఖాయం.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×