Game Changer: ముఖ్యంగా నార్త్ ఇండస్ట్రీలో సౌత్ హీరోలు పాగా వేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కొడితే కుంభ స్థలమే ఢీ కొట్టాలి అన్నట్టుగా ఇప్పుడు మెగా హీరోలు ఇద్దరు పోటీ పడుతున్నారు. అటు బావ బావమరిది క్రేజ్ చూసి మిగతా హీరోలు సైతం నోరెళ్ళ బెడుతున్నారని చెప్పవచ్చు. మెగా హీరోలుగా పేరు సొంతం చేసుకున్న అల్లు అర్జున్ (Allu Arjun), రామ్ చరణ్(Ram Charan)తమ సినిమాలతో బాలీవుడ్ లో భారీ మార్కెట్ ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తమ సినిమాలతో భారీ బిజినెస్ జరుపుకొని రికార్డు సృష్టించారు.
బాలీవుడ్ లో భారీ ధరకు అమ్ముడుపోయిన పుష్ప -2..
బాలీవుడ్ కి చెందిన ప్రముఖ నిర్మాత అనిల్ తడాని (Anil thadani ) మంచి జోరు మీద ఉన్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ – సుకుమార్ (Sukumar)కాంబినేషన్లో వస్తున్న పుష్ప -2 (Pushpa -2) సినిమాకు సంబంధించి హిందీ థియేట్రికల్ రైట్స్ ను రూ.200 కోట్లకు ఆయన కొనుగోలు చేశారు. ఇటు సౌత్ లో ఈ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడడం వల్లే ఈ రేట్ కు అమ్ముడుపోయినట్లు సమాచారం.
పుష్ప -2 బాటలో గేమ్ ఛేంజర్..
అయితే ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది. మరో తెలుగు పాన్ ఇండియా మూవీ హిందీలో భారీ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. అదేదో కాదు రామ్ చరణ్ – శంకర్ (Shankar) కాంబినేషన్లో వస్తున్న గేమ్ ఛేంజర్ (Game Changer). దిల్ రాజు(Dil Raju) నిర్మిస్తున్న ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయకుండా దిల్ రాజు చాలా పగడ్బందీగా ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు సమాచారం.
ఫ్యాన్సీ రేట్ కు అమ్ముడుపోయిన గేమ్ ఛేంజర్..
రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఈ గేమ్ చేంజెస్ సినిమా డిసెంబర్ లోనే విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని పెండింగ్ పనుల కారణంగా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి తో చేసిన ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత సోలో హీరోగా వస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు ఈ సినిమా నుంచి విడుదల చేసిన జరగండి, రారా మచ్చా పాటలకు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ కూడా లభించింది.
బాలీవుడ్ లో పెరిగిన రామ్ చరణ్ మార్కెట్..
అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. సంక్రాంతి బరిలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై ప్రస్తుతం బజ్ లేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి తోడు బాలీవుడ్ లో భారీ ధరకు అమ్ముడుపోవడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే గేమ్ ఛేంజర్ సినిమాకి శంకర్ మాత్రమే దర్శకత్వం వహించలేదు. ఆయన కమలహాసన్(Kamal Hassan)తో ఇండియన్ 2 (Indian -2 ) సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నప్పుడు..ఈ సినిమాను ఇంకొక డైరెక్టర్ తన చేతుల్లోకి తీసుకున్నారని వార్తలు వినిపించాయి. ఇక దీనికి తోడు రూ.100 కోట్ల విలువ చేసే రీల్ ను స్క్రాప్ చేశారు అంటూ కూడా వార్తలు రావడం గమనార్హం. ఇలా ఎన్నో కారణాలు వినిపించడం.. దీనికి తోడు సినిమా నుంచి అప్డేట్స్ సరిగా వదలకపోవడం కూడా సినిమాకు మైనస్ గా మారింది. అయినా సరే రామ్ చరణ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్లో భారీ ధరకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం.
బావాబామ్మర్దుల దెబ్బకి బాలీవుడ్ హీరోల పరిస్థితి ఏంటో..
అక్కడ ఈ సినిమాని కూడా పుష్ప -2 హక్కులను సొంతం చేసుకున్న అనిల్ తడానీ ఏఏ ఫిలిం సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం. ఒకరకంగా ఈ సంస్థ ద్వారా గేమ్ ఛేంజర్ సినిమా నార్త్ లో గట్టిగానే రిలీజ్ చేయబోతున్నారని, అక్కడ కూడా భారీ ఫ్యాన్సీ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. మొత్తానికైతే ఈ మెగా హీరోల దెబ్బకి బాలీవుడ్ హీరోల పరిస్థితి ఏంటో అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.