Brahmamudi serial today Episode: కంపెనీ అకౌంట్ నుంచి కాకుండా క్యాష్ ద్వారా తాతయ్య హాస్పిటల్ బిల్ పే చేశారు అని రాహుల్ చెప్పగానే.. అయితే ఎక్కడో ఏదో జరుగుతుంది. ఈ కావ్య, రాజ్ కలిసి నాటకాలు ఆడుతున్నారు అసలు కావ్య సీమంతం తమ పుట్టింట్లో ఎందుకు జరిపిస్తుంది అనేది మొత్తం తెలుసుకుందాం అనుకుంటారు ఇద్దరూ.
కావ్య కిచెన్‌లో ఉండగా స్వప్న వెళ్తుంది. అక్కా టీ కావాలా అని కావ్య అడగ్గానే.. సమాధానం కావాలి అంటుంది. దేనికి అంటూ కావ్య అడగ్గానే నా సీమంతం విషయంలో ఎందుకు నువ్విలా చేస్తున్నావు అంటుంది. అది అమ్మ కదా చేసేది అని కావ్య చెప్పగానే అమ్మకు ఆ ఐడియా ఇచ్చింది నువ్వేనని నాకు తెలుసు అంటుంది. అయితే నేను ఎందుకు ఇలా చేస్తున్నానో కూడా తెలుసుకోలేదా..? అంటుంది కానీ నువ్వేమైనా చేసుకో అంటూ స్వప్న ఏడుస్తూ వెళ్లిపోతుంది.
అప్పుడే అపర్ణ వస్తుంది. అపర్ణను చూసిన కావ్య అత్తయ్య మీకు కూడా ఏమైనా అనాలనిపిస్తే అనండి అనగానే.. నిన్ను తిడిత పడతావని కొడితే భరిస్తావని నాకు తెలుసు. అసలు ఎందుకు చేస్తున్నావు ఇదంతా.. నువ్వు తప్పు చేయకుండా ఎవరైనా ఏమైనా అటే నువ్వు ఊరుకోవు.. అయినా నేను ఇక్కడికి వచ్చింది రేపు సీమంతానికి సామాన్లు తీసుకోవడానికి లిస్ట్ రెడీ చేసుకోవడానికి నీ పనులు అన్ని పూర్తి చేసి నువ్వు వచ్చేయ్ అని చెప్పి అపర్ణ వెళ్లిపోతుంది.
సీమంతానికి కావాల్సిన సామాన్ల లిస్టును రెడీ చేయిస్తుంది కనకం. లిస్టు రాసిన సీమంతం శ్రీను 40వేలు అయిందని చెప్తాడు. అంత ఎందుకు అయింది అని నా బడ్జెట్ 20వేలే అంటుంది కనకం. అలా అయితే అన్ని సెకండ్ హ్యాండ్‌లో తీసుకురావాలని సీమంతం శ్రీను చెప్తాడు. అలా కాదు కానీ అన్ని వస్తులలలో కోతపెడదామని చెప్తుంది. అలా చేశాక ఇప్పుడు ఎంత అయిందో చెప్పు అనగానే 24వేలు అయిందని చెప్తాడు. అందులో ఇక 4 వేలు తీసేయ్ అంటుంది కనకం. సీమంతం శ్రీను షాక్ అవుతాడు.
బెడ్ రూంలో కావ్య సర్దుతుంది. రాజ్ వస్తాడు. కావ్యను చూస్తుంటాడు. ఆత్మ వచ్చి ఏరా ఇప్పుడు బాగుందా..?అంటాడు. చాలా బాగుందని రాజ్ చెప్తాడు. సిగ్గుందా నీకు సొంత పెళ్లాన్ని దొంగలా చూస్తావా? అంటూ తిడతుంది ఆత్మ.. ఇప్పుడే మంచి చాన్స్ మెల్లగా వెళ్లి హత్తుకో వెళ్లు అంటుంది. సడెన్‌గా హత్తుకుంటే మొత్తుకుంటుందేమో..? అని రాజ్ అడగ్గానే..
అలాంటిదేం జరగదు వెళ్లు అనగానే.. రాజ్ సైలెంట్‌గా వెళ్లి వెనక నుంచి హగ్ చేసుకోబోతుంటే.. కావ్య తిరిగి చూడబోతు కిందపడబోతుంటే.. రాజ్ గట్టిగా పట్టుకుంటాడు. ఏంటండి అంత సైలెంట్ గా వచ్చారు. అయినా ఏదో చెప్పాలనుకుంటున్నారా..? అని అడుగుతుంది. ఏం లేదు.. మీ ఇంట్లో సీమంతం చేస్తున్నారు కదా మీ అమ్మ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో తెలుసు కోవచ్చు కదా అంటాడు. అంత లేదు.. మా అమ్మ వద్దని చెప్పింది. అనగానే సరేలే అంటూ రాజ్ వెళ్లిపోతాడు.
బెడ్‌రూంలో బాధగా కూర్చున్న స్వప్న దగ్గరకు రుద్రాణి, రాహుల్ వెళ్తారు. ఏంటి స్వప్న రేపు సీమంతం పెట్టుకుని ఇంత డల్లుగా కూర్చున్నావు అని రుద్రాణి అడుగుతుంది. డల్లుగా కూర్చోక ఏం చేస్తుంది మామ్ అంటాడు రాహుల్. ఎంత బాధగా ఉన్నా గుండెల్లో దాచుకోవడం తప్పా మనం ఓపెన్ అయితే శత్రువుల్లా చూస్తారు కదా..? అంటుంది రుద్రాణి. దీంతో శత్రువుల్లా ప్రవర్తిస్తే శత్రువుల్లానే చూస్తారు.. కానీ ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారో చెప్పండి అని స్వప్న అడగ్గానే..
ఒకరి మీద కంఫ్లైంట్ చేయడం మాకేంటి స్వప్న.. నీ బాధను చూసి నిన్ను ఓదార్చడానికి వచ్చాము అంటాడు రాహుల్. నాకెందుకు నన్ను మీరు రెచ్చగొట్టేందుకు వచ్చారు అనిపిస్తుంది అని స్వప్న చెప్పగానే.. రుద్రాణి, రాహుల్ తమ సెంటిమెంటల్ డైలాగ్స్ చెప్తూ కావ్యను తిడతారు. దీంతో నేను అనుకున్నాను మీరు అటు తిరిగి ఇటు తిరిగి కావ్య దగ్గరకే వస్తారని తెలుసు అంటుంది స్వప్న. దీంతో రుద్రాణి సరే నీ ఇష్టం కానీ నీ సీమంతం ఖర్చు మిగిల్చాలని పుట్టింటికి తీసుకెళ్తుంది మీ చెల్లి.. రేపు నీ బిడ్డ పుట్టబోయే ఖర్చు కూడా తగ్గించాలని గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్తుంది ఆలోచించుకో అంటూ చెప్పి వెళ్లిపోతారు. స్వప్న ఆలోచనలో పడిపోతుంది.
సీమంతం సీను కనకం ఇంటికి కుర్చీలు తీసుకొస్తాడు. అందులో ఒకటి విరిగిపోయి ఉంటుంది. అది చూసి కనకం షాక్ అవుతుంది. ఇంతలో మూర్తి వచ్చి అదే కుర్చీలో కూర్చోబోతుంటే.. కనకం ఆపుతుంది. ఇంతలో దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం వస్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?