BigTV English

This Week OTT Release Movies: ఈ వారం ఓటీటీల్లోకి రానున్న టాప్ సినిమాలు.. గామీ.. ప్రేమలు.. ఇంకా!

This Week OTT Release Movies: ఈ వారం ఓటీటీల్లోకి రానున్న టాప్ సినిమాలు.. గామీ.. ప్రేమలు.. ఇంకా!
This Week OTT Movies
This Week OTT Movies

Gaaim, Premalu and More MOvies Releasing on this Week: ప్రస్తుతం ఓటీటీలకు మంచి ఆదరణ లభిస్తుంది. కొత్త కొత్త కాన్సెప్టులతో సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చి ఓటీటీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా ప్రతి వారం థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు.. అలాగే ఓటీటీ నిర్మిస్తున్న కొత్త కొత్త వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. అయితే ఈ వారం కూడా పలు సినిమాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి. మరి ఏప్రిల్ సెకండ్ వీక్‌లో ఓటీటీలోకి రాబోతున్న సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


గామి..

టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘గామి’. మార్చి 8న గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో అఘోర పాత్రలో నటించిన విశ్వక్ అందరి దృష్టిని ఆకర్షించాడు. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను నమోదు చేసింది. ఇక థియేటర్లలో అదరగొట్టేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5లో ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించి జీ5 అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేసింది.


శర్మ అండ్ అంబానీ..

భరత్ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణ, కేశవ్ కర్రీ ప్రధాన పాత్రలో నటించిన ‘శర్మ అండ్ అంబానీ’ మూవీ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది. క్రైమ్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీకి కార్తీక్ సాయి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఏప్రిల్ 11న నేరుగా ఓటీటీలోకి రానుంది. ఈటీవీ విన్‌ ప్లాట్ ఫార్మ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఇందుకు సంబంధించి ఈటీవీ విన్ ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా చేసింది.

Also Read: అదితితో సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌.. తొలిసారి స్పందించిన సిద్ధార్థ్‌!

ప్రేమలు..

ఈ మధ్య మలయాళ చిత్రాలు వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో అన్ని భాషల ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. ఒక చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్‌ను అందుకొని బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. అయితే తాజాగా అలాంటిదే మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రేమలు మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.

లవ్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీ మలయాళం, హిందీ, తమిళం భాషల్లో ఏప్రిల్ 12న డిస్నీ+ హాట్‍స్టార్‌లో స్ట్రీమింగ్‍కు రానుంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. అయితే ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఏప్రిల్ 12న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహాలో స్ట్రీమింగ్‌కు రానుంది. దీనిపై తాజాగా  అధికారిక ప్రకటన వచ్చింది.

భీమా..

గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమా’. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. గత వారమే ఈ మూవీ ఓటీటీలోకి వస్తుందని టాక్ వచ్చింది. కానీ రాలేదు. అయితే ఇప్పడు ఈ వారం భీమా మూవీ స్ట్రీమింగ్‌కు రానుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 12న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×