Garividi Lakshmi: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా బయోపిక్ సినిమాలు వచ్చాయి. అయితే వాటన్నిటికంటే ఒక మెట్టు పైనే ఉంటుంది నాగ అశ్విన్ తెరకెక్కించిన మహానటి. మహానటి సావిత్రి కథను కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు నాగ్ అశ్విన్. దాదాపు థియేటర్ కి ఆడియన్స్ రావడం మానేశారు అనుకునే తరుణంలో ఒక మంచి సినిమా తీస్తే ఖచ్చితంగా వస్తారు అని ప్రూవ్ చేసిన సినిమా అది. ఇక ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో బయోపిక్ సినిమా రానుంది. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాకు చెందిన గరివిడి లక్ష్మి అని బుర్రకథ కళాకారిని, జీవిత కథను ఆధారంగా చేసుకుని సినిమాను నిర్మిస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న 48వ సినిమా ఇది. ఈ సినిమాతో గౌరీ నాయుడు జమ్ము అనే కొత్త దర్శకుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.
శ్రీదేవి సోడా సెంటర్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాలతో మంచి గుర్తింపు సాధించుకున్న ఆనంది ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. సినిమా బండి, కీడా కోలా వంటి సినిమాలతో మంచి గుర్తింపును సాధించుకున్న రాగ మయూర్ ఈ సినిమాలో ఒక ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషనల్ గా ఉండబోతుంది అని విశ్వసినీయ వర్గాల సమాచారం. ఇప్పుడైతే ప్రస్తుతం
రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలు కూడా ఓటీటీలో చూడగలుగుతున్నాం. టీవీలు అరుదుగా ఉన్న రోజుల్లో ప్రేక్షకులకు వినోదం తక్కువగా అందేది. అటువంటి తరుణంలో ఈ బుర్రకథలు అనేవి బాగా ఫేమస్. ఒకచోట బుర్రకథ జరుగుతుంది అంటే ఏకంగా ఊరు ఊరంతా వచ్చి అక్కడే కూర్చుంటారు. ఎంటర్టైన్మెంట్ చేస్తూ చాలామందిని ఆసక్తిగా కూర్చోబెట్టడమే బుర్రకథ తాలూకా ఉద్దేశం.
ఇక గరివిడి లక్ష్మి బుర్రకథ కు చాలా ప్రత్యేకత ఉంది. మామూలుగా సాగిపోతున్న బుర్రకథను గరివిడి లక్ష్మి వచ్చిన తర్వాత మాస్ జనాలు ఎంజాయ్ చేసేలా చేసింది. చాలా యదార్థ సంఘటనలకు తన సొంత బాణిను కలిపి ఆమె ప్రేక్షకులను ఉర్రూతలూగించిన రోజులు ఉన్నాయి. దాదాపు పదివేలకు పైగా ఆమె బుర్రకథ ఆడారు. ఆమె కథను సినిమాగా తీస్తున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేసింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఇక కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మోసం పోస్టర్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ పోస్టర్ గమనిస్తే దానిలో పాతకాలపు హార్మోనియం, తబలా, బిందె వంటి బుర్రకథ ఇన్స్ట్రుమెంట్లు కనిపిస్తున్నాయి. ఇకపోతే మ్యూజికల్ గా కూడా ఈ సినిమా మంచి ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది. ఎందుకంటే బుర్రకథ అంటేనే మాస్ జనాలు ఊగిపోయేంత పాటలు ఉంటాయి. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ వచ్చే నెల నుంచి స్టార్ట్ కానుంది అని విశ్వసినీయ వర్గాల సమాచారం.
MANA GARIVIDI LAKSHMI VACHESARU ❤️🔥
The inspiring story of the iconic Burra Katha artist from Garividi of Vizianagaram district ✨
▶️ https://t.co/55WhfwJDhn#GarividiLakshmi ✨@vishwaprasadtg @peoplemediafcy @gowrinaidujammu @ItsActorNaresh #Raasi @anandhiactress @smayurk… pic.twitter.com/BuD3tIBwlZ
— People Media Factory (@peoplemediafcy) December 24, 2024