Srikakulam District Accident : కుమార్తెకు ఉన్నత విద్యా సంస్థలో సీటు వచ్చిందన్న ఆనందం ఆ కుటుంబానికి కొన్ని రోజులు కూడా మిగల లేదు. మొక్కు తీర్చుకునేందుకు వెళ్లిన వారంతా.. తెల్లవారుజామునే ప్రమాదంలో చిక్కుకున్నారు. దీంతో.. ఆలయాన్ని చేరుకునే వరకు ఆ కుటుంబంలోని ముగ్గురు విగత జీవులుగా మారగా.. మిగతా వాళ్లు తీవ్ర గాయాల పాలయ్యారు. దీంతో.. శ్రీకాకుళం జిల్లాలో విషాద ప్రమాదం చోటుచేసుకుంది.
విశాఖపట్నంలోని సీతమ్మధారకు చెందిన ముత్తా వెంకట రంగ రాజేశ్ కుమార్తె నేహా గుప్తాకు ఐఐటీలో సీటు(IIT seat) వచ్చింది. ఆ సంతోషాన్ని కుటుంబమంతా కలిసి పంచుకోగా.. తన తోడల్లుడు కుటుంబాన్ని కూడా ఆ ఆనందంలో భాగం చేసుకున్నారు. వీరంతా.. ఒడిశాలోని(Orissa) బాజిపూర్ (Bajipur)లోని ఆలయానికి వెళ్లి కుమార్తె మొక్కు చెల్లించుకోవాలని నిర్ణయించుకున్నారు. దాంతో.. విశాఖ(Visakha) నుంచి వెంకట రంగ రాజేశ్ కుటుంబం రాగా.. తెలంగాణాలోని భద్రాచలం(Badravhalam) ప్రాంతానికి చెందిన కదిరిశెట్టి సోమేశ్వరరావు కుటుంబం వారిని కలుసుకుని.. కారులో ప్రయాణమయ్యారు. వీరంతా.. తెల్లవారు జామున 5 గంటలకు ప్రయాణం ప్రారంభించారు.
తెల్లవారు నిద్రమత్తులోకి జారుకున్నారు. మరికొన్ని గంటల్లోనే ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకోవాలని భావించారు. కానీ.. భగవంతుడు మరో మార్గాన్ని నిర్దేశించాడు అన్నట్లు వారి కుటుంబంలో విషాదం నిండుకుంది. వారు ప్రయాణిస్తున్న కారు.. కంచిలి(Kanchili) మండలం జక్కర సమీపంలోకి రాగానే రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. దాంతో.. కారులోని వాళ్లంతా చెల్లాచెదురుగా పడిపోయారు. ఏమైతుందో తెలుసుకునే లోపే.. కారులోని వారికి తీవ్రగాయాలు కాగా.. గందరగోళ పరిస్థితి నెలకొంది.
కారు ప్రమాదంలో.. ఐఐటీలో సీటు సాధించిన నేహా గుప్తా(Neha Gupta), ఆమె తల్లి లావణ్య(lavanya) సహా సోమేశ్వరరావు(Someswara rao) మృతి చెందారు. వెంకట రంగరాజేశ్ తో పాటు సోమేశ్వర రావు భార్య రాధిక, తల్లి సుబ్బలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. కారు ప్రమాద ఘటనా స్థలంలో ఒకరు చనిపోగా.. మిగతా ఇద్దరు సోంపేట(sompet) ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. కాగా.. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దేవుడికి మొక్కు తీర్చుకునేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరగడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Also Read : వచ్చే నెలలో పెళ్లి ఫిక్స్.. ఇంతలోనే విషాదం. హాస్టల్ గదిలో ఉరేసుకున్న యువతి.. అసలేమైంది.
కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు సోంపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించారు. వీరిలో రాధిక పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళంలోని(srikakulam) ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న కంచిలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కారు అతివేగంతో(Over Speed) వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు(police Enquiry) చేపట్టారు.