Jaat Collections : బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ (Sunny Deol), తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో రూపొందిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జాట్’ (Jaat). తాజాగా ఈ సినిమా 7వ రోజు భారీ కలెక్షన్లు రాబట్టింది అంటూ నిర్మాతలు అఫీషియల్ గా పోస్టర్ని రిలీజ్ చేశారు. మరి ‘జాట్’ 100 కోట్లకు ఇంకా ఎంత దూరంలో ఉంది? అనే వివరాల్లోకి వెళ్తే….
ఏడు రోజుల్లో 70 కోట్లకు పైగా…
టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని హిందీలోకి ఎంట్రీ ఇచ్చిన మూవీ ‘జాట్’. మాస్ ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇచ్చే విధంగా, సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ ఈ సినిమాను రూపొందించారు. గోపీచంద్ మలినేని మాస్ టేకింగ్, సన్నీ డియోల్ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్ కారణంగా మూవీకి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. రిలీజ్ రోజు ఈ సినిమా కలెక్షన్స్ నిరాశపరిచినప్పటికీ నెమ్మదిగా ఊపందుకుంటున్నాయి. వీకెండ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీకి కలెక్షన్స్ పెరగడంతో వసూళ్ల పరంగా పరుగులు పెడుతోంది మూవీ. ఇప్పుడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 7 రోజుల్లోనే రూ. 70.5 కోట్లు కొల్లకొట్టింది. ‘జాట్’ రోర్ అంటూ ఏడు రోజుల్లో ఈ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందనే విషయాన్ని ఓ స్పెషల్ పోస్టుర్ ద్వారా మేకర్స్ వెల్లడించారు. ఇక ఇదే జోష్ కొనసాగితే ఈ వీకెండ్ పూర్తయ్యే లోపు ‘జాట్’ 100 కోట్ల క్లబ్లో చేరడం ఖాయం.
హిందీలో మరో తెలుగు డైరెక్టర్ హవా
ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కాగా, మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రూ. 9.5 కోట్లు మాత్రమే రాబట్టింది. శుక్రవారం కలెక్షన్లు తగ్గినప్పటికీ, వారాంతంలో పుంజుకోగలిగింది. శనివారం రూ. 9.5 కోట్లు, ఆదివారం రూ. 14 కోట్లు వసూలు చేసింది. కానీ సోమవారం కలెక్షన్స్ తగ్గి రూ. 7.25 కోట్లు, ఆ తర్వాత మంగళవారం రూ. 6 కోట్లు, బుధవారం రూ. 4 కోట్లు మాత్రమే రాబట్టింది ఈ మూవీ. 100 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీసు బరిలోకి దిగిన ఈ మూవీ… డీసెంట్ టాక్ తో 7 రోజుల్లోనే టార్గెట్ లో సగానికి పైగా రికవరీ చేసింది. ఈ వీకెండ్ ‘జాట్’కి కీలకం కానుంది.
Read Also : అదేదో సుందర్ పిచ్చాయ్ అన్నట్టు అంత పిచ్చి అయిపోతున్నారేంట్రా… పెళ్లి కోసం సారంగపాణి కష్టాలు
ఇక ఈ మూవీ గనుక 100 కోట్ల క్లబ్ లో చేరితే రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగా తరువాత మరో టాలీవుడ్ డైరెక్టర్ పేరు పాన్ ఇండియా రేంజ్ లో మోత మోగనుంది. ఇదిలా ఉండగా, గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ‘జాట్’లో సాయిమీ ఖేర్, రెజీనా కసాండ్రా, వినీత్ కుమార్ సింగ్, ప్రశాంత్ బజాజ్, జగపతి బాబు, జరీనా వాహబ్ కూడా కీలక పాత్రల్లో నటించారు. రణదీప్ హుడా పవర్ ఫుల్ విలన్ పాత్రను పోషించారు. ఈ మూవీతోనే బడా తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు.
#JAAT enters its blockbuster second week ❤🔥#JAAT KA POWER – collects 70.4 CRORES+ DOMESTIC GBOC in 7 days 💥💥
Book your tickets for the MASS FEAST now!
▶️ https://t.co/sQCbjZ51Z6Starring Action Superstar @iamsunnydeol
Directed by @megopichand
Produced by @MythriOfficial… pic.twitter.com/QizuMJg5mt— Mythri Movie Makers (@MythriOfficial) April 17, 2025