Amudham Benefits: ప్రస్తుత కాలంలో చాలామందికి ఆముదం అంటే తెలియదు. అయితే ఆముదం నూనె గురించి చెప్పాలంటే చుండ్రు సమస్యను తొలగించడంలో ఇది ప్రత్యేకంగా పనిచేస్తుంది. గ్రామ ప్రాంతాలలో ఈ ఆముదం నూనెను చాలా మంది వాడుతుంటారు, వారికి చుండ్రు సమస్యలు, కాని జుట్టు సమస్యలు కానీ ఉండవు. ఆముదం నూనెలో యాంటీ బ్యాక్టీరియాల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. కావున మీకు ఎలాంటి సమస్యలు లేకుంటే తలస్నానంకు ముందు ఈ ఆముదం నూనె రాసుకొని ఒక గంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు సమస్య మాయం అవుతుంది.
సుఖమైన నిద్ర:
మరో ముఖ్యమైన సమస్య ఎంటంటే చాలా మంది ప్రస్తుతం నిద్ర సమస్య ఎక్కువగా ఉంది. దీని పరిష్కారానికి ఆముదం నూనె కనీసం వారానికి ఒకసారి చక్కగా శరీరానికి రాసుకొని, బాగా మర్థించి, ఆ తర్వాత వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే శరీరం మొత్తం చక్కటి మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. అంతేకాకుండా ప్రశాంతమైన సుఖ నిద్ర మీ సొంతమవుతుంది. అయితే కొంత మందిలో మల విసర్జన వేలా పాల లేకుండా అవుతుంది. దీని వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారు. దీని నివారణకు ఆముదం వేరుని తీసుకుని దానిని ఎండబెట్టి దానిని పొడి చేసుకోవాలి. దీని తర్వాత ప్రతిరోజూ క్రమం తప్పకుండా రాత్రి సమయంలో పడుకునే ముందు రెండు గ్లాసుల నీరు తీసుకుని అందులో రెండు స్పూన్ల ఆముదం పొడి వేసి దానిని ఆర గ్లాసు అయ్యే వరకు మరిగించి వడపోసుకుని తాగుతూ ఉండాలి. దీంతో ఇది సుఖక్రియోజనకారిగా పనిచేస్తుంది, టైమ్‌ను రెగ్‌లెట్ చేస్తుంది.
ఫీడింగ్ సమస్య:
మరో సమస్య బాలింతలకు వారి పిల్లలకు పాలు ఇవ్వాలన్న వారి పాలు తగ్గిపోతూ ఉంటాయి. ఇది ప్రస్తుతం మోడ్రన్ తల్లులకు పెద్ద సమస్యగా మారింది. ఇలాంటి సమయంలో బాలింతలలో తిరిగి పాలు పెంచడానికి ఈ ఆముదం చాలా చక్కగా పని చేస్తుంది. అయితే బాలింతల రొమ్ములకు ఈ ఆముదం నూనెను మర్థన చేసుకోవాలి. అలాగే ఆముదం ఆకులను నిప్పుల మీదగాని, మంటమీద గాని వేడి చేసి వాటిని రొమ్ములపై కాపడంలాగా పెట్టుకోవాలి. దీంతో ఆ గ్రంథులకు స్టీములేషన్ అందుతుంది. ఇలా చేయడం వల్ల పాలు సమృద్ధిగా ఉత్పత్తి అవుతాయి.
పులిపిర్లు నివారణ:
పులిపిరి సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంటుంది. ఈ వాట్స్‌ని తగ్గించడం పెద్ద చాలెంజ్‌గా మారింది. ఎందుకంటే ఈ పులిపిరిని గిల్లిన, తొలగించిన మళ్లి వాటి పక్కనే తయారవుతూ ఉంటాయి. ఈ వాట్స్‌ను తగ్గించడానికి ఆముదం ఆమోగంగా పనిచేస్తంది. అయితే ప్రతిరోజూ ఆముదం నూనెను పులిపిరి దగ్గర ఆప్లై చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే కొన్ని రోజులకు అవే ఊడిపోతాయి.
Also Read: యువత ఈ ఫుడ్ తీసుకుంటే.. బెస్ట్ హెల్త్ మీదే..
పీరియడ్స్ సమస్య మాయం..
పీరియడ్స్ అంటే చాలు మహిళలు భయపడుతుంటారు అంటే అలా బాధపెడుతుంది. ఈ సమస్య.. అయితే ఈ ఆముదం ఆకులు పీరియడ్స్ సమస్యకు చక్కని రెమిడీగా పనిచేస్తుంది. ఆముదం ఆకులను తీసుకుని వాటిని వేడి చేసి పొత్తి కడుపుమీద కట్టుకోవడం వల్ల ఈ సమస్యకు తక్షణమే ఉపశమనం కల్పిస్తుంది.
ముఖ్యంగా చాలా మంది నడుం నొప్పి సమస్యతో బాధపడుతుంటారు. వారికి ఆముదం గింజలు బాగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆముదం గింజలు తీసుకుని వాటిని పేస్ట్ చేసుకుని దానిని పాలలో వేసుకోవాలి, ఆ తర్వాత వాటిని చిక్కగా అయ్యేవరకు మరిగించిన తర్వాత, వాటిని ఒడపోసుకుని తాగాలని వైద్యులు తెలిపారు. ఇలా చేయడం వల్ల నడుం నొప్పితో పాటు అనేక రకాల సమస్యలను తగ్గిస్తుందని హెచ్చరిస్తున్నారు.