Miss you Thalapathy : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు ఎంతటి క్రేజ్ ఉందో తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విజయ్ కు అంత క్రేజ్ ఉంది. ఇకపోతే తెలుగు ప్రేక్షకులకు కూడా విజయ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన స్నేహితుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాను త్రీ ఇడియట్స్ సినిమాకు రీమేక్ గా శంకర్ తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తర్వాత విజయ్ చేసిన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతూ వచ్చాయి. ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన తుపాకీ సినిమా మంచి హిట్ అయింది. ఈ సినిమా తర్వాత విజయ్ మళ్ళీ తెలుగులో తన సినిమాల ప్రమోషన్ కోసం రాలేదు.
తెలుగు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు
విజయ్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి. తెలుగు ప్రేక్షకులు గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. భాషతో సంబంధం లేకుండా నటులను సినిమాలను ఎంకరేజ్ చేయడం ఎప్పటినుంచో అలవాటు చేసుకున్నారు. అందుకే ఇక్కడ కమల్ హాసన్, రజనీకాంత్, విక్రం, సూర్య వంటి హీరోలకు మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. ఇక విజయ్ విషయానికి వస్తే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన మాస్టర్, లియో సినిమాలకు మంచి కలెక్షన్లు కూడా అందించారు. అట్లీ దర్శకత్వంలో వచ్చిన సినిమాలను కూడా తెలుగులో బాగానే ఆదరించారు. ఎట్టకేలకు ఒక తెలుగు దర్శకుడు తమిళ్ స్టార్ హీరో విజయ్ తో కూడా సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు.
33 ఏళ్ల సినిమా ప్రయాణం పూర్తి
ఇక ప్రస్తుతం విజయ్ తమిళ రాజకీయాల్లో కీలకపాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు విజయ్. తను ఇంకా సినిమాలు చేయను గుడ్ బై చెప్పేస్తున్నాను అని అధికారికంగానే ప్రకటించాడు. ప్రస్తుతం హెచ్ వినోద్ దర్శకత్వంలో జననాయగన్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి విజయ్ ఉన్న సీన్స్ నిన్నటితో పూర్తయిపోయాయి. ఇక ప్రస్తుతం విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లో నిమగ్నం కానున్నారు. ఈ సినిమాకి సంబంధించి విజయ్ సీన్స్ పూర్తి అవడంతో చాలామంది విజయ ఫ్యాన్స్ మిస్ యు విజయ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం మొదలుపెట్టారు.
Also Read : Narne Nithin – Sangeeth Sobhan: పేరు వచ్చింది కాబట్టి పాత ప్రాజెక్టులు రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు