Ramoji Film City: ఒక్కసారి ఎవరైనా ఒక ప్రదేశం గురించి కానీ, మనిషి గురించి కానీ నెగిటివ్ గా మాట్లాడితే.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారితే.. ఇక అదే కొన్నిరోజుల వరకు హాట్ టాపిక్. ఈమధ్యకాలంలో ఇలానే జరుగుతుంది. జానీ మాస్టర్ కేసు అప్పుడు ఆయన గురించి, ఆ తరువాత రాజ్ తరుణ్, అల్లు అర్జున్, పహాల్గమ్ దాడి, అహ్మదాబాడ్ విమాన ప్రమాదం.. ఇలా ఏది ట్రెండ్ లో ఉంటే దాని గురించే సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం ఫ్యాషన్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో దెయ్యాలు ఉన్నాయి అనేది హాట్ టాపిక్ అని చెప్పొచ్చు.
ప్రపంచంలోనే అత్యంత విస్తీర్ణం కలిగిన ఫిల్మ్ స్టూడియోగా రామోజీఫిల్మ్ సిటీ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. ఇండస్ట్రీలో ఎలాంటి సినిమా అయినా ఈ ఫిల్మ్ స్టూడియోలోనే షూటింగ్ జరుపుకోవాల్సిందే. ఇప్పటివరకు ఈ స్టూడియో గురించి ఒక్కఋ కూడా నెగిటివ్ గా చెప్పింది లేదు. అంటే.. చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదు అనేది నిజం. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ చెప్పడంతో ఈ విషయం వైరల్ అవ్వడం జరిగింది.
మా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కాజోల్ రామోజీ ఫిల్మ్ స్టూడియో గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ” కొన్ని ప్రదేశాల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు భయమేస్తుంది. అలాంటి ప్రదేశాలకు ఇంకోసారి వెళ్ళకూడదు అనుకుంటాం.అంతగా అవి మనల్ని భయపెడతాయి. అలా నన్ను భయపెట్టిన ప్రదేశాల్లో రామోజీ ఫిల్మ్ సిటీ ఒకటి. అక్కడకు వెళ్లి నేను భయపడ్డాను. ప్రపంచంలోనే మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అంటే అదే” అని చెప్పుకొచ్చింది.
కాజోల్ ఏదో చెప్తుందిలే అనుకోని అందరూ ఆమెను తిట్టిపోశారు. కావాలని చెప్తుందని కొందరు.. ఫేమస్ అవ్వాలని చెప్తుందని కొందరు. ఇలా రకరకాలుగా మాట్లాడారు. అయితే ఇంకొంతమంది మేధావులు ఏం చేశారు అంటే.. ఇప్పుడంటే కాజోల్ చెప్పింది కానీ, గతంలో ఇదే విషయాన్నీ చాలామంది హీరోయిన్స్ చెప్పారని, వారి వీడియోలను కూడా వెతికి మరీ పట్టుకొస్తున్నారు. ఇక వారి మాటల వలన తెల్సింది ఏంటంటే.. రామోజీ ఫిల్మ్ సిటీలో నిజంగానే దెయ్యాలు ఉన్నాయట. మరి ఆ హీరోయిన్స్ ఎవరు అంటే.. రాశీ ఖన్నా, తాప్సీ, నుష్రత్ బరొచ్చా లతో పాటు పాటు కీరవాణి కూడా ఈ విషయాన్నీ ఒప్పుకున్నాడు.
బాలీవుడ్ బ్యూటీ తాప్సీ.. రామోజీ పిల్మ్ సిటీలో ఉన్న ఒక హోటల్ లో బస చేసిందట. ఆ హోటల్ లో ఒక గదిలో ఆమె నిద్రిస్తుండగా.. కొన్ని వింత శబ్దాలు వినిపించాయని, బెడ్ చుట్టూ ఎవరో తిరుగుతున్నట్లు అనిపించిందని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఎప్పుడు ఆ హోటల్ కు వెళ్లినా ఎవరో తనను వెంటాడుతున్నట్లు అనిపిస్తుందని తెలిపింది.
ఇక అందాల. భామ రాశీఖన్నా కూడా రామోజీ ఫిల్మ్ సిటీ హోటల్ గురించి ఇదే విధంగా చెప్పుకొచ్చింది. బాక్ సినిమా ప్రమోషన్స్ లో ఆమె దెయ్యాల గురించి మాట్లాడింది. తాను దెయ్యాలు ఉన్నాయంటే నమ్ముతాను అని, ఎందుకంటే రామోజీ ఫిల్మ్ సిటీలో అలాంటి అనుభూతిని తాను పొందినట్లు తెలిపింది. ఆ హోటల్ లో నేను పడుకున్నప్పుడు.. ఎవరో నా బెడ్ ను ఊపుతున్నట్లు అనిపించింది. మధ్య రాత్రిలో నా దుప్పటి లాగి పడేసినట్లు, రూమ్ లో ఎవరో గుసగుసలు ఆడుతున్నట్లు శబ్దాలు వినిపించాయని ఆమె తెలిపింది.
మరో బాలీవుడ్ భామ నుష్రత్ కు కూడా ఇదే అనుభవం కలిగింది. నిద్ర లేచేసరికి తన సూట్ కేస్ ఓపెన్ చేసి, బట్టలు మొత్తం చిందరవందరగా పడి ఉన్నాయని, అంతేకాకుండా ఫుడ్ ను కూడా ఎవరో సగం కొరికినట్లు కనిపించిందని, వెంటనే భయంతో ఆ హోటల్ నుంచి బయటపడినట్లు తెలిపింది. వీరితో పాటు సీనియర్. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణీ దగ్గర వర్క్ చేసే సింగర్స్ కూడా ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు తెలిపాడు.
చంద్రముఖి 2 ప్రమోషన్స్ లో భాగంగా కీరవాణి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అంటే రామోజీ ఫిల్మ్ సిటీ. అక్కడ దెయ్యాలు తిరుగుతాయి అనేది వాస్తవమే. ఒకసారి కొంతమంది సింగర్స్ తో అక్కడ ఉన్న సింఫనీ రికార్డ్ స్టూడియోలో ఒక సాంగ్ ను రికార్డ్ చేస్తుండగా.. సింగర్స్ చెవుల వద్ద ఎవరో మాట్లాడుతున్నట్లు వినిపించిందని వారు చెప్పినట్లు తెలిపాడు. ఇలా ఒకరు కారు ఇద్దరు కాదు..చాలామంది సెలబ్రిటీలు రామోజీ ఫిల్మ్ సిటీ గురించి ఇలా చెప్పడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదొక హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇలా చెప్పినవారందరూ కూడా అమ్మాయిలే కావడం విశేషం. అమ్మయిలను మాత్రమే వేధిస్తున్న ఆ దెయ్యాలు నిజంగా ఉన్నాయా.. ? లేక వీరి భ్రమనా.. ? అనేది తెలియాల్సి ఉంది.