BigTV English

Beauty Tips : వానాకాలం బ్యూటీ టిప్స్.. ఇలా చేస్తే మెరిసే స్కిన్..

Beauty Tips : వానాకాలం బ్యూటీ టిప్స్.. ఇలా చేస్తే మెరిసే స్కిన్..

Beauty Tips : ఎండాకాలం అందం కందిపోతుంది. బయటకు వస్తే చర్మం మాడిపోతుంది. తెల్లగా ఉన్నవాళ్ల కూడా నల్లగా అవుతారు. అందుకే, సమ్మర్‌లో మెరిసే చర్మం కోసం నానా తంటాలు పడతారు. వానాకాలం రాగానే రిలాక్స్ అవుతుంటారు. అయితే, రెయిన్ సీజన్‌లోనూ చర్మం నిగారింపు అంత ఈజీ కాదు. ఏ కాలంలో ఉండే ప్రాబ్లమ్స్ ఆ కాలంలో ఉంటూనే ఉంటాయి. వానాకాలం వెదర్ బాగున్నప్పటికీ.. చర్మం, జుట్టు సంరక్షణలో అదనపు జాగ్రత్తలు తప్పనిసరి. తేమ, గాలిలోని ఆర్ద్రత, వర్షం వల్ల.. చర్మం జిడ్డుగా, లేదంటే పొడిగా మారవచ్చు. ఈ సీజన్‌లో అందాన్ని కాపాడుకోవడానికి కొన్ని సులభమైన, సహజమైన బ్యూటీ టిప్స్ పాటిస్తే బెటర్.


చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోండి..

వానాకాలంలో గాలిలోని తేమ వల్ల చర్మంపై ధూళి, జిడ్డు సులభంగా అంటుకుంటాయి. రోజుకు రెండు సార్లు ముఖాన్ని కడగడం మంచిది. రోజ్ వాటర్‌తో కానీ, ఆలోవెరా జెల్‌తో తయారైన ఫేస్ వాష్‌ని యూజ్ చేస్తే చర్మం శుభ్రంగా, ఫ్రెష్‌గా ఉంటుంది. అధిక జిడ్డును తొలగించడానికి వారానికి ఒకసారి ముల్తానీ మట్టి ఫేస్ మాస్క్ వాడతే బెటర్..


మాయిశ్చరైజర్ వాడండి..

వానాకాలంలో చర్మం తేమను కోల్పోకుండా చూసుకోవడం ముఖ్యం. వాటర్-బేస్డ్ మాయిశ్చరైజర్‌ యూజ్ చేయాలి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. జిడ్డుగా అనిపించదు. ఒకవేళ చర్మం పొడిగా ఉంటే, కొబ్బరి నూనె లేదా షియా బటర్ మిశ్రమంతో కూడిన క్రీమ్ వాడొచ్చు.

జుట్టు సంరక్షణ

వర్షం వల్ల జుట్టు తడిసి, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. జుట్టును తడిగా ఉంచకుండా వెంటనే ఆరబెట్టుకోవాలి. వారానికి రెండు సార్లు సౌమ్యమైన షాంపూతో జుట్టును హెయిర్ వాష్ చేసుకోవాలి. కొబ్బరి నూనె లేదా ఆర్గాన్ ఆయిల్‌తో వారానికి ఒకసారి మసాజ్ చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా, మెరిసేలా ఉంటుంది.

వానాకాలంలోనూ సన్‌స్క్రీన్..

వానాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉన్నప్పటికీ, UV కిరణాలు చర్మాన్ని డ్యామేజ్ చేయవచ్చు. SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్‌ని డైలీ వాడితే మంచిది. జెల్ ఆధారిత సన్‌స్క్రీన్ ఈ సీజన్‌కు అనువైనది.

సహజమైన ఫేస్ మాస్క్‌లు

వానాకాలంలో చర్మానికి అదనపు సంరక్షణ కోసం సహజమైన ఫేస్ మాస్క్‌లు వాడాలి. తేనె, పసుపు మిశ్రమం చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. కీర రసం, బియ్యం పిండితో తయారైన మాస్క్ మొటిమలను నివారిస్తుంది. ఇలాంటివి ఇంకా చాలానే ఫేస్ ప్యాక్‌లు ఉంటాయి. సెర్చ్ చేసి.. మీ స్కిన్‌కు సెట్ అయ్యేది ట్రై చేయొచ్చు.

ఆరోగ్యకరమైన ఆహారం

చర్మం, జుట్టు ఆరోగ్యంగా మెరవాలంటే.. విటమిన్ సి, ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో కూడిన ఫుడ్ తీసుకోవాలి. సీజనల్ ఫ్రూట్స్, వెజిటెబుల్స్, తగినంత నీరు తాగడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది.

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×