BigTV English

Siva Rama Krishna: ప్రభుత్వ స్థలం కబ్జా.. టాలీవుడ్ నిర్మాత అరెస్ట్

Siva Rama Krishna: ప్రభుత్వ స్థలం కబ్జా.. టాలీవుడ్ నిర్మాత అరెస్ట్

Siva Rama Krishna: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ఈ మధ్యనే ఒక స్థలం విషయంలో పోలీస్ స్టేషన్ పై దాడికి పాల్పడి వార్తలో నిల్చిన విషయం తెల్సిందే. తాజాగా ఆ స్థలం విషయంలోనే నిర్మాత శివరామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు విషయంలోకి వెళ్తే..  రాయదుర్గంలో 86ఎకరాలు ప్రభుత్వ భూమిని శివ రామకృష్ణ కబ్జా చేయడానికి పక్కా ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాడు.


స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ నుంచి పత్రాలు తెప్పించుకొని.. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ సీనియర్ అసిస్టెంట్ కొత్తిని చంద్రశేఖర్ సాయంతో నకిలీ పత్రాలు సృష్టించి.. ల్యాండ్ తనదేనంటూ క్లెయిమ్  చేశాడు. అంతేకాకుండా ఆ స్థలంలో బిల్డర్‌ మారగొని లింగం గౌడ్ సాయంతో ల్యాండ్‌లో పాగా వేశాడు. అయితే అప్పటి ప్రభుత్వం..  ఆ స్థలం ప్రభుత్వ భూమి అని, సదురు నిర్మాత నకిలీ పత్రాలు తెచ్చాడని తెలుపుతూ 2003 లో కోర్టులో కేసు వేసింది. అప్పటి నుంచి ఈ కేసు కోర్టులో నడుస్తుంది.

Devara: ఆయుధ పూజ వీడియో సాంగ్ వచ్చేసిందిరోయ్..


హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రభుత్వం.. ఈ స్థలం కోసం పోరాటం చేస్తూనే వస్తుంది. ఇంత జరిగినా శివరామకృష్ణ అస్సలు తొణకకుండా ఆ స్థలం కోసం అడ్డదారులు తొక్కుతూనే ఉన్నాడు. ఇక ఎట్టకేలకు అతని పత్రాలు నకిలీవి అని సుప్రీంకోర్టు తేల్చింది.  సుప్రీంకోర్టు తీర్పుతో శివరామకృష్ణతో పాటు ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించినందుకు  నిర్మాతతో పాటు.. ఆయనకు సహాయం చేసిన ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ సీనియర్ అసిస్టెంట్ కొత్తిని చంద్రశేఖర్, బిల్డర్‌ మారగొని లింగం గౌడ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇక నిర్మాత శివరామకృష్ణ గురించి చెప్పాలంటే.. వెంకటేష్, శిల్పాశెట్టి నటించిన సాహస వీరుడు సాగరకన్య  సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టాడు. మహేష్ బాబు తో యువరాజు, వెంకటేష్ తో ప్రేమంటే ఇదేరా లాంటి సినిమాలు నిర్మించాడు. ఇవి మాత్రమే కాకుండా.. సర్దుకుపోదాం రండి, సీతారత్నంగారి అబ్బాయి  లాంటి సినిమాలు నిర్మించాడు. ఇక  చివరగా ఆయన రవితేజ నటించిన దరువు సినిమాను తెరకెక్కించాడు.

Related News

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Shriya Saran: నేను హీరోయిన్ అని నా భర్తకు తెలీదు.. ఆ మూవీ చూసి భయపడ్డారు – శ్రియా

Barrelakka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో?

Heroes Remuneration : హైయెస్ట్ పెయిడ్ హీరోలు… మన తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారో చూడండి

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Big Stories

×