BigTV English

Good Bad Ugly : విజయ్ మూవీపై కన్నేసిన అజిత్… కోలీవుడ్‌లో మళ్లీ ఫ్యాన్ వార్… ఈ సారి రచ్చ రచ్చే

Good Bad Ugly : విజయ్ మూవీపై కన్నేసిన అజిత్… కోలీవుడ్‌లో మళ్లీ ఫ్యాన్ వార్… ఈ సారి రచ్చ రచ్చే

Good Bad Ugly : కోలీవుడ్ స్టార్ తల అజిత్ (Ajith) నటించిన కొత్త చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly). ఈ మూవీ వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే హాట్ టాపిక్ గా మారింది. ఇక మూవీ రిలీజ్ కాబోతున్న తరుణంలో సోషల్ మీడియాలో కథ లీక్ అయ్యింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ లీకైన స్టోరీ లైన్ గురించి తెలుసుకున్నాక… మూవీ అచ్చం విజయ్ సూపర్ హిట్ మూవీలా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి.


‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ స్టోరీ లీక్

సమాచారం ప్రకారం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ స్టోరీ దళపతి విజయ్ హీరోగా నటించిన ‘లియో’ మూవీ స్టోరీలా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. రూమర్స్ ప్రకారం ఈ సినిమాలో ఒక డాన్ మనసు మార్చుకుని, హింసాత్మక జీవితానికి దూరంగా బ్రతుకుతాడు. శాంతియుతంగా తన కుటుంబంతో కలిసి సమాజంలో జీవించడానికి ప్రయత్నాలు చేస్తాడు. అయినప్పటికీ గతం హీరోని వెంటాడుతుంది. ఈ నేపథ్యంలోనే నేరుగా ఆ గతాన్ని ఎదుర్కొంటాడు. ప్రతీకారం, అధికార దాహం వంటి అంశాల నేపథ్యంలోనే ఈ మూవీ తెరకెక్కింది అని అంటున్నారు.


దీంతో ఈ స్టోరీ లైన్ ను చదివిన తర్వాత విజయ్ నటించిన ‘లియో’ మూవీలాగే ఇది కూడా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ‘లియో’ సినిమాలో హీరో బిజినెస్ చేస్తూ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు. కానీ ఆ గతం హీరోని వదలదు. అంతేకాకుండా తనకు అన్యాయం చేసిన వారిపై హీరో ప్రతీకారం తీర్చుకునేలా చేస్తుంది. రెండు స్టోరీ లైన్స్ ఒకేలాగా ఉండడంతో సోషల్ మీడియాలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీపై నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అజిత్ వర్సెస్ విజయ్ ఫ్యాన్ వార్ తప్పదా ?

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ ఏప్రిల్ 10న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా, తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు. ముందుగా ఈ సినిమాను 2019లోనే తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ అజిత్ ‘తునివు’, అధిక్ ‘మార్క్ ఆంటోని’ సినిమాలను పూర్తి చేసేదాకా ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారు. దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ కోసం అజిత్ 150 కోట్లు రెమ్యూనరేషన్ గా అందుకున్నట్టు టాక్ నడుస్తుంది.

అయితే తాజాగా లీక్ అయిన స్టోరీ లైన్ అజిత్ – విజయ్ అభిమానుల మధ్య మరోసారి వార్ కు తెర తీసేలా కనిపిస్తోంది. ఇప్పటికే సందర్భం దొరికిందంటే చాలు విజయ్ అజిత్ అభిమానులు సోషల్ మీడియాలో దారుణంగా ఒకరిపై ఒకరు నెగటివ్ కామెంట్స్ చేసుకుంటారు. మరి ఈ మూవీ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి. ఒకవేళ ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్టుగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ స్టోరీ గనక ఇదే అయితే ఇక సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరగడం ఖాయం.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×