BigTV English
Advertisement

Rashid Khan: 1000 వికెట్లు తీస్తా.. ఇదే నా సీక్రెట్ !

Rashid Khan: 1000 వికెట్లు తీస్తా.. ఇదే నా సీక్రెట్ !

Rashid Khan: ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తాజాగా ప్రపంచ క్రికెట్ లో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. టి-20 క్రికెట్ లో ఎవ్వరికీ సాధ్యం కానీ రికార్డ్ చేశాడు రషీద్ ఖాన్. టి-20 క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో జరుగుతున్న సౌత్ ఆఫ్రికా టీ-20 లీగ్ లో ఎమ్.ఐ కేప్ టౌన్ తరఫున ఆడుతున్న ఈ ప్లేయర్.. పార్ల్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈ రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్ లో రెండు వికెట్లు పడగొట్టి.. టి-20 క్రికెట్ లో తన వికెట్ల సంఖ్యను 633 కు పెంచుకున్నాడు.


Also Read: Shubman Gill: అమ్మాయిలతో గిల్ సెల్పీలు… కుళ్లుకుంటున్న సారా ?

ఈ రికార్డును సాధించే క్రమంలో రషీద్ ఖాన్.. వెస్టిండీస్ మాజీ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో రికార్డును బద్దలు కొట్టాడు. 26 ఏళ్ల రషీద్ ఖాన్ తన కెరీర్ లో 461 టీ-20 ల్లో 633 వికెట్లు పడగొట్టగా.. అత్యధిక టి-20 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండవ స్థానంలో ఉన్న బ్రావో 582 మ్యాచ్ లలో 631 వికెట్లు తీశాడు. ఇక రషీద్ ఖాన్ అఫ్గానిస్థాన్ జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ లో 161 వికెట్లు.. ఫ్రాంచైజీ మరియు దేశవాళీ క్రికెట్ లో 472 వికెట్లు పడగొట్టాడు.


రషీద్ ఖాన్ తన టి-20 కెరీర్ లో ఆఫ్ఘనిస్తాన్ సహా సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, ఎంఐ కెప్టౌన్, అడిలైడ్ స్ట్రైకర్స్, గయానా అమెజాన్ వారియర్స్, ఎంఐ ఎమిరేట్స్, లాహోర్ కలందర్స్, ససెక్స్ షార్క్స్, ట్రెంట్ రాకెట్స్ తదితర జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఇక రషీద్ ఖాన్ కి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా తెలుగు క్రికెట్ అభిమానులకు రషీద్ ఖాన్ సుపరిచితుడు.

ఇక ఈ రికార్డ్ పై తాజాగా రషీద్ ఖాన్ స్పందిస్తూ.. ” టి-20 క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలవడం ఎంతో సంతృప్తినిస్తోంది. 15 – 20 ఏళ్లు ఆడితే ఈ రికార్డుని బ్రేక్ చేయవచ్చేమో అని అనుకున్నా. కానీ కేవలం 9 ఏళ్ల కెరీర్ లోనే ఇది సాధించాను. ఇన్ని అంతర్జాతీయ టి-20 లు, లీగ్ లు ఆడతానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇక వెయ్యి వికెట్లే నా టార్గెట్. ఫిట్ గా ఉంటే వచ్చే మూడు, నాలుగు సంవత్సరాలలో దాన్ని అందుకుంటా” అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు రషీద్ ఖాన్.

Also Read: Team India: పూరి జగన్నాథ్ ఆలయంలో టీమిండియా ప్లేయర్ల పూజలు..ఆటోలో వెళ్లి మరీ !

ఇక బ్రావో రికార్డుని బ్రేక్ చేసిన క్రమంలో.. తాజాగా బ్రావోతో మాట్లాడానని తెలిపాడు రషీద్ ఖాన్. తన రికార్డుని బ్రేక్ చేసిన సందర్భంగా బ్రావో మాట్లాడుతూ.. ” ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ నా రికార్డుని అధిగమించినందుకు సంతోషంగా ఉంది. ఈ రికార్డును బద్దలు కొట్టింది నువ్వే. వీటన్నిటికీ నువ్వు పూర్తిగా అర్హుడివి” అని బ్రావో తనతో చెప్పాడని తెలిపాడు రషీద్ ఖాన్. అంతేకాదు 2024 టీ-20 ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ పై సాధించిన 4/23 తన కెరీర్ లోనే అత్యుత్తమ స్పెల్ అని తెలిపాడు రషీద్ ఖాన్. అలాగే బిగ్ బాష్ లీగ్ లో ఆడిలైట్ స్ట్రైకర్స్ తరఫున 17 పరుగులకు 6 వికెట్లు పడగొట్టడం కూడా ప్రత్యేకమే అన్నాడు.

Related News

CP Sajjanar : వీళ్లేం సెల‌బ్రిటీలు?…రైనా, ధావన్‌లపై స‌జ్జ‌నార్ సీరియ‌స్‌

Cm Revanth Reddy: హైదరాబాద్ లో మ‌రో అంత‌ర్జాతీయ స్టేడియం..ఆస్ట్రేలియా త‌ర‌హాలో బౌన్సీ పిచ్ లు

BBL New Rule : BBLలో కొత్త రూల్స్‌…ఇకపై బంతి తాకితే అభిమానుల‌కే, త్వ‌ర‌లో ఐపీఎల్ లో కూడా

Jahanara Alam : సె**క్స్ కోసం పీరియడ్స్ డేట్ అడిగేవాడు.. ఏడ్చేసిన బంగ్లా క్రికెటర్

IND vs PAK: పాకిస్తాన్ కొంప ముంచిన వ‌ర్షం..టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ

Sree Charani : శ్రీచరణికి ఏపీ సర్కార్ భారీ నజరానా.. గ్రూప్-1 జాబ్, రూ.2.5 కోట్లు, ఇంటి స్థలం

Hong Kong Sixes 2025: 6, 6, 6, 6, 6, 6 పాకిస్తాన్ ప్లేయ‌ర్ విధ్వంసం..6 బంతుల్లో 6 సిక్స‌ర్లు..వీడియో వైర‌ల్‌

Shivam Dube: హ‌ర్షిత్ రాణా కోసం శివమ్ దూబే కెరీర్ నాశనం..బ‌ల‌వంతంగా బ్యాటింగ్ చేయిస్తున్న గంభీర్‌

Big Stories

×