BigTV English

Gopichand New Movie : 14 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఆ ప‌ని చేస్తున్న గోపీచంద్‌

Gopichand New Movie : 14 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఆ ప‌ని చేస్తున్న గోపీచంద్‌


Gopichand New Movie : టాలీవుడ్ యాక్ష‌న్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. ఆ సినిమా పేరే ‘భీమా’. సత్యసాయి ఆర్ట్స్ బ్యాన‌ర్ మీద హ‌ర్ష అనే క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కిస్తుండ‌టం విశేషం. ఈ సినిమా షూటింగ్‌ను కూడా మొద‌లెట్టేశారు. హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో భీమా మూవీ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. అయితే గోపీచంద్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. ఈ సినిమాలో గోపీచంద్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు. 14 ఏళ్ల త‌ర్వాత గోపీచంద్ ప‌వ‌ర్ఫుల్ పోలీస్‌గా క‌నిపించ‌బోతున్నారు.

2010లో డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన గోలీమార్‌లో గోపీచంద్ పోలీస్ ఆఫీస‌ర్‌గా మెప్పించారు. అంత‌కు ముందు శౌర్యం సినిమాలోనూ పోలీస్‌గానే అల‌రించారు. ఇన్నేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ అలాంటి పాత్ర‌లో న‌టించ‌టానికి బ‌ల‌మైన కారణం. మంచి మాస్ హిట్ కోసం ఎదురు చూస్తోన్న గోపీచంద్ త‌న‌కు అచ్చొచ్చిన పోలీస్ డ్రెస్సులో మెప్పించ‌బోతున్నాడు. ఇదొక ప‌క్కా మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మాఆత్ర‌మే కాదు.. మంచి ఫ్యామిలీ ఎమోష‌న్స్‌ను కూడా యాడ్ చేసి తెర‌కెక్కిస్తున్నార‌ట‌. పోస్ట‌ర్‌లో ఓ ఎద్దుని కూడా చూపించ‌టం చూస్తుంటే స‌బ్జెక్ట్‌లో హీరో పాత్ర‌లోని పొగ‌రుబోతుత‌నం ఏంటో చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అనిపిస్తోంది.


గోపీచంద్ గ‌త చిత్రం రామబాణంపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. త‌న కెరీర్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ల‌క్ష్యం కాంబినేష‌న్ కావ‌టం కూడా అందుకు కార‌ణంగా చెప్పుకోవచ్చు. అయితే, రామ‌బాణం మాత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర గురి త‌ప్పింది. గోపి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. అయితే గోపీచంద్ ఎక్కువ గ్యాప్ తీసుకోలేదు. వెంటనే భీమా సినిమాను స్టార్ట్ చేసేశాడు. ఇది త‌న 31వ సినిమా కావ‌టం విశేషం. స్వామి జె గౌడ సినిమాటోగ్రాఫర్‌గా వ‌ర్క్ చేస్తున్న ఈ సినిమాకు కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×