BigTV English

Hero Nikhils News : నిర్మాత‌తో నిఖిల్ గొడ‌వ‌.. వాయిదా ప‌డ్డ ‘స్పై’…!

Hero Nikhils News :  నిర్మాత‌తో నిఖిల్ గొడ‌వ‌.. వాయిదా ప‌డ్డ ‘స్పై’…!


Hero Nikhils News : యంగ్ హీరో నిఖిల్ త‌న పాన్ ఇండియా ప్ర‌య‌త్నాల విష‌యంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారా! అంటే అవున‌నే అనిపిస్తోంది ఆయ‌న తీరు చూస్తుంటే. కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ సాధించిన త‌ర్వాత నిఖిల్ వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌నే లైనప్ చేసుకుంటూ వ‌స్తున్నారు. ఈ వ‌రుస‌లో ముందుగా వ‌స్తోన్న సినిమా ‘స్పై’. జూన్ 29న సినిమాను విడుద‌ల చేస్తున్న‌ట్లు మేకర్స్ ప్ర‌క‌టించారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన టీజ‌ర్‌కు కూడా సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. అంతా బాగానే ఉంద‌నుకుంటున్న త‌రుణంలో స్పై మూవీ వాయిదా ప‌డుతున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అందుకు కార‌ణం.. నిర్మాత‌కు, హీరోకు మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ‌లే కార‌ణ‌మ‌ట‌.

అస‌లేం జ‌రిగింద‌నే వివ‌రాల్లోకి వెళితే.. హీరో నిఖిల్ హీరోగా గ్యారీ బి.హెచ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సినిమాలో చిన్న ప్యాచ్ వ‌ర్క్ మిగిలింది. ఈ నెల 15 నుంచి దానికి సంబంధించిన చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. దాన్ని 23లోపు సెన్సార్ చేయించి ఇవ్వాలి. మ‌రో వైపు ప‌ట్టుమ‌ని ప‌దిహేను రోజులు కూడా లేవు. దీంతో ప్ర‌మోష‌న్స్ చేయాలి. పాన్ ఇండియా రేంజ్ మూవీ కాబ‌ట్టి ప్ర‌మోష‌న్స్ గ‌ట్టిగానే చేయాల్సి ఉంటుంది. కాబ‌ట్టి స‌మ‌యం స‌రిపోద‌ని నిఖిల్ భావించాడు. అయితే నిర్మాత అంతా ఓకే అనుకున్నాడు. ఉన్న ఒక పాట‌ను కూడా సైలెంట్‌గా రిలీజ్ చేసేశాడు. ఈ పాట‌ను హీరో నిఖిల్ క‌నీసం త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ కూడా చేయ‌లేదంటే.. ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు.


కార్తికేయ 2 హిట్ త‌ర్వాత నిఖిల్ నుంచి వ‌స్తోన్న సినిమా. నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ మ‌ర‌ణం వెనుకున్న ర‌హ‌స్యాన్ని క‌నుగొనే కాన్సెప్ట్‌తో స్పై మూవీ రూపొంద‌టంతో క్రేజ్ క్రియేట్ అయ్యింది. దీంతో నాన్ థియేట్రిక‌ల్ హ‌క్కుల‌కు బాగానే డ‌బ్బులు ద‌క్కాయి. ఇక థియేట్రిక‌ల్ బిజినెస్ విష‌యంలోనూ బాగా డ‌బ్బులు వ‌చ్చాయి. ఇప్పుడు స్పై సినిమాను వాయిదా వేయాలంటే డిస్ట్రిబ్యూట‌ర్స్ ఒప్పుకోరు క‌దా! అని ప్రొడ్యూస‌ర్ ఆలోచ‌న‌. అయితే తొంద‌ర‌లో చేసే చిన్న త‌ప్పులు వ‌ల్ల ప్రొడ‌క్ట్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంద‌ని నిఖిల్ వాదన‌. దీంతో చివ‌ర‌కు నిర్మాత సైతం నిఖిల్ దారిలోకి వ‌చ్చి సినిమాను వాయిదా వేసేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని టాక్‌. త్వ‌రలోనే ఈ విష‌యంపై మ‌రింత క్లారిటీ రానుంది.

Related News

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Big Stories

×